అన్వేషించండి

PF Interest Rate : పీఎఫ్ చందాదారులకు అలర్ట్! 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఖరారు!

PF Interest Rate : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల భవిష్య నిధి(EPF) నిల్వలపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని ఖరారు చేసింది.
  • కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా వడ్డీ రేటును నోటిఫై చేయనుంది.
  • వరుసగా రెండో ఏడాది కూడా 8.25% వడ్డీ కొనసాగనుంది.
  • ఖాతాదారులు UAN, పాస్‌వర్డ్ ద్వారా లేదా SMS ద్వారా వడ్డీని చెక్ చేసుకోవచ్చు.

PF Interest Rate : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2025-26 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుపై స్పష్టత వచ్చింది. గత ఫిబ్రవరి నెలలో జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయనుంది. 

ఈ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే EPFO తన పరిధిలోని సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లోకి వడ్డీని క్రెడిట్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. వరుసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం 8.25 శాతం వడ్డీని యథాతథంగా కొనసాగిస్తోంది.              

వడ్డీ రేటు ఖరారు ఎలా చేస్తారు?

పీఎఫ్‌వడ్డీ రేటు ప్రకటన అనేది ఒక ఆర్గనైజ్డ్‌ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఫిబ్రవరి 2న జరిగిన సమావేశంలో ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా ఉంచాలని ప్రతిపాదించింది. సీబీటీ ఆమోదం తెలిపిన తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రేటును పరిశీలించి అధికారికంగా నోటిఫై చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈపీఎఫ్‌వో సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి చందాదారుల ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తుంది. 

Also Read: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

8.25 వడ్డీ రేటు కంటిన్యూ

మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈపీఎఫ్‌ ఇప్పటికే ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్‌ 8 శాతానికి పైగా వడ్డీని స్థిరంగా కొనసాగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా 8.25 శాతం వడ్డీని అందించారు. ఇప్పుడు 2025-26కు కూడా అదే రేటును నిర్ణయించడం ద్వారా చందాదారులకు తమ పొదుపుపై భరోసా లభిస్తుంది. 

ఎదురు చూస్తున్న  కోట్లమంది ఉద్యోగులు 

ఈపీఎఫ్‌వో అనేది కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది ఉద్యోగుల పదవీ విరమణ కాలపు ఆర్థిక భద్రత. గత పదేళ్లుగా పరిశీలిస్తే ఈపీఎఫ్‌వో తన చందాదారులకు మెరుగైన రిటర్న్ అందించటానికి ప్రయత్నిస్తోంది. గతంలో చాలా ఏళ్ల పాటు 8 శాతం కంటే తక్కువ వడ్డీని ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 8.25 శాతం వడ్డీని నిలుపుకోవడం అనేది ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం. 

వడ్డీ జమ అయ్యిందని ఎలా చెక్ చేయాలి?

మీ యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. పాస్‌బుక్ చెక్ చేయాలి. మొబైల్ యాప్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చూడవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్‌ కాల్, ఎస్‌ఎంఎస్ పంపించడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 

Also Read: పీఎఫ్‌ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్‌ రద్దు

Frequently Asked Questions

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఎంత?

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.25 శాతంగా నోటిఫై చేయనుంది. ఇది వరుసగా రెండో ఏడాది కూడా కొనసాగింపు.

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఎలా ఖరారు చేస్తారు?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి అధికారికంగా నోటిఫై చేస్తుంది.

8.25 శాతం వడ్డీ రేటు కొనసాగడం వల్ల ఉద్యోగులకు ప్రయోజనమా?

అవును, మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈపీఎఫ్‌ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. ఇది చందాదారులకు తమ పొదుపుపై భరోసాను ఇస్తుంది.

నా ఈపీఎఫ్‌ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

మీ యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి లేదా ఈపీఎఫ్‌ మొబైల్ యాప్ ద్వారా పాస్‌బుక్ చెక్ చేయండి. మిస్డ్‌ కాల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget