Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్ స్పెషల్ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్ కావద్దు
కొన్ని బ్యాంక్‌లు రన్ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల బెనిఫిట్స్ అందుకోవడానికి ఈ నెల చాలా ముఖ్యం.
Deadlines in December 2023: డిసెంబర్ నెల ప్రారంభమైంది, 2023 చివరి నెలకు చేరుకున్నాం. ప్రతి నెలలాగా ఈసారి కూడా దేశంలో కొన్ని విషయాలు మారాయి, కొన్ని పనులకు డెడ్‌లైన్స్ ఈ నెలలోనే ఉన్నాయి. ఈ డెడ్‌లైన్స్‌ను మిస్సయితే మీరు నష్టపోవాల్సి వస్తుంది.
కొన్ని బ్యాంక్‌లు రన్ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల బెనిఫిట్స్ అందుకోవడానికి ఈ నెల చాలా ముఖ్యం. దీంతోపాటు... మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి, యూపీఐ ఐడీ రద్దు కాకుండా ఆపడానికి, డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్ కాకుండా చూసుకోవడానికి కూడా డిసెంబర్ నెల కీలకం.
ఈ నెలలో ముగిసే బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లు:
ఎస్‌బీఐ హోమ్‌లోన్ ఆఫర్: ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి గృహ రుణం తీసుకోవాలని భావిస్తున్నారా?, మీ కోసమే స్టేట్ బ్యాంక్ (SBI) ఇప్పుడు ఒక ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. మీ క్రెడిట్ స్కోర్‌ను (Credit Score) బట్టి హోమ్ లోన్ వడ్డీ రేట్ల మీద గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల (0.65%) వరకు రాయితీ ఇస్తోంది.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఎఫ్‌డీ పథకం : స్టేట్ బ్యాంక్ రన్ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ గడువు ఈ నెలాఖరుతో (డిసెంబర్ 31, 2023) ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో పెట్టే పెట్టుబడుల మీద 7.10 శాతం పైగా వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
మరికొన్ని బ్యాంక్‌ల స్పెషల్ ఎఫ్‌డీలు: IDBI అమృత్ మహోత్సవ్ 375 డేస్, 444 డేస్ పథకాల్లో చేరడానికి ఈ నెల వరకే గడువు ఉంది. ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 400 డేస్’, ‘ఇండ్ సూపర్ 300 డేస్’ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో చేరే ఛాన్స్ కూడా డిసెంబర్ 31తో ముగుస్తుంది.
2023 డిసెంబర్ నెలలో ముగిసే డెడ్‌లైన్స్:
ఆధార్ వివరాల ఉచిత అప్‌డేషన్ : గత 10 సంవత్సరాలుగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయనివాళ్లు, తమ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి ఉడాయ్ (UIDAI) అవకాశం కల్పించింది. ఈ గడువు ఈ నెల 14తో (డిసెంబర్ 14, 2023) ముగుస్తుంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి 14వ తేదీ వరకే సమయం ఉంది.
యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ : గత ఏడాదికి పైగా వాడుకలో లేని యూపీఐ (UPI) ఐడీలు, నంబర్లను డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) ఆదేశించింది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. మీ యూపీఐ ఐడీ డీయాక్టివేట్ కాకుండా ఆపడానికి ఇప్పుడే ఒక లావాదేవీ పూర్తి చేయండి.
నామినీ పేరు యాడ్ చేయడం : మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ అకౌంట్లలో నామినీ పేరును యాడ్ చేయడానికి సెబీ (SEBI) ఇచ్చిన తాజా డెడ్‌లైన్ ఈ నెల 31తో పూర్తవుతుంది. నామినీ పేరుతో పాటు పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను కూడా డీమ్యాట్ అకౌంట్‌లో అదే తేదీ నాటికి అప్‌లోడ్ చేయాలి. లేకపోతే అకౌంట్ డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది.
బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ : మీరు బ్యాంక్ లాకర్‌లో ఏదైనా దాచారా?. అయితే కచ్చితంగా మీరు లాకర్ అగ్రిమెంట్ పూర్తి చేయాల్సిందే. బ్యాంక్ లాకర్ కోసం కొత్త అగ్రిమెంట్ చేసుకోవడానికి గడువు ఈ నెలతో ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 31 కంటే ముందు అగ్రిమెంట్ ఇచ్చిన వాళ్లు, ఈ ఏడాది కూడా డిసెంబరు 31లోగా ఆ అగ్రిమెంట్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌బీఐ