అన్వేషించండి

Bank Holiday: జులైలో బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులే, ఇదిగో హాలిడేస్‌ లిస్ట్‌

బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు.

Bank Holidays list in July 2023: ప్రజల రోజువారీ జీవనంలో బ్యాంకులు, ATMలు కూడా ఒక భాగంగా మారాయి. మెజారిటీ ప్రజలకు బ్యాంక్‌లతో పని ఉంటుంది. డబ్బు వేయడం/తీసుకోవడం, డిమాండ్ డ్రాఫ్ట్‌లు తీయడం, చెక్కులు డిపాజిట్ చేయడం, లోన్లు తీసుకోవడం/తిరిగి కట్టడం.. ఇలా చాలా పనులు బ్యాంకులతోనే ముడిపడి ఉన్నాయి. బ్యాంకులకు సెలవు వస్తే కస్టమర్ల పనులు పెండింగ్‌లో పడతాయి. రూ. 2000 నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం జులై నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, ఆ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు.

జులై నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. జులై నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. జులై 02న ఆదివారంతో మొదలై 31న షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవంతో హాలిడేస్‌ అయిపోతాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 

2023 జులై నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

జులై 02, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 05, 2023- గురు హరగోవింద్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 06, 2023- MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
జులై 08, 2023 - రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 09, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- భాను జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- బోనాలు సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 16, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 17, 2023- యు టిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు
జులై 22, 2023 - నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 23, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 29, 2023- మొహర్రం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
జులై 30, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 31, 2023- షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హరియాణాలో బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: మెడ్‌ప్లస్‌ బ్రాండ్‌ మందులు, అతి భారీ డిస్కౌంట్స్‌ - త్వరలో విడుదల! 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget