MedPlus: మెడ్‌ప్లస్ బ్రాండ్ మందులు, అతి భారీ డిస్కౌంట్స్ - త్వరలో విడుదల!
పేటెంట్ కాల గడువు పూర్తయిన దాదాపు 500 రకాల ఔషధాలను తన సొంత బ్రాండ్ పేరిట అమ్ముతుంది.
MedPlus Brand Drugs: మెడ్‌ప్లస్ ఫార్మసీలకు వెళ్లి టాబ్లెట్స్, సిరప్‌లు, ఇతర మెడిసిన్ సంబంధిత ఉత్పత్తులు కొంటుంటాం. అవన్నీ, వివిధ బ్రాండ్లతో వేర్వేరు కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్. ఇకపై, మెడ్‌ప్లస్ బ్రాండ్ ఔషధాలను కూడా కొనే అవకాశం ఉంది.
ఇతర కంపెనీలు తయారు చేసే మందులు అమ్ముతున్న మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ (MedPlus Health Services Ltd), తన సొంత బ్రాండ్‌తోనూ ఔషధాలు అమ్మాలని నిర్ణయించింది. పేటెంట్ కాల గడువు పూర్తయిన దాదాపు 500 రకాల థెరప్యూటిక్, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఔషధాలను తన సొంత బ్రాండ్ పేరిట అమ్మనున్నట్లు మెడ్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. మధుకర్ రెడ్డి ప్రకటించారు.
అయితే, పేటెంట్ గడువు ముగిసిన డ్రగ్స్ (off-patent drugs) ప్రొడక్షన్‌ను సొంతంగా చేపట్టడం లేదు. దేశంలో ఔషధాలు ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ ఫార్మా కంపెనీలతో ఈ సంస్థ అగ్రిమెంట్స్ చేసుకుంది. ఆ ఒప్పందాల ప్రకారం, ఫార్మా కంపెనీలు మెడ్‌ప్లస్ బ్రాండ్‌తో ఔషధాలను ఉత్పత్తి చేసి, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌కు సప్లై చేస్తాయి. ఆ మందులను తన ఫార్మసీ స్టోర్లలో మెడ్‌ప్లస్ అమ్ముతుంది. దీంతో, ఈ సంస్థ కూడా మార్కెటింగ్ కంపెనీగా మారుతుంది.
50 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్
మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్‌పై 50 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురాబోతోందీ కంపెనీ. ఉత్పత్తి చేస్తున్న సంస్థల నుంచే డ్రగ్స్‌ను నేరుగా సమీకరించడం వల్ల, చాలా తక్కువ రేటుకే కస్టమర్లకు వాటిని అందిస్తామని కంపెనీ CEO చెబుతున్నారు. మరో మూడు నెలల్లో, మెడ్‌ప్లస్ బ్రాండ్‌తో అమ్మే మందుల సంఖ్యను 800కు పెంచుతామని ప్రకటించారు.
మెడ్‌ప్లస్ స్టోర్లు
ప్రస్తుతం, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌కు ఏడు రాష్ట్రాల్లో 4,000 ఫార్మసీ స్టోర్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కొత్తగా 800 నుంచి 1000 ఫార్మసీలను ఓపెన్ చేసే ప్లాన్‌లో ఉంది. కొత్తవాటితో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 4,500 పైకి చేర్చాలని కంపెనీ భావిస్తోంది.
FY23లో ఈ కంపెనీ రూ. 4,558 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
నిన్న (బుధవారం), BSEలో రూ. 808 వద్ద ముగిసిన మెడ్‌ప్లస్ షేర్లు, ఇవాళ ఉదయం 10.20 గంటల సమయానికి 0.37% శాతం లాభంతో రూ. 811 వద్ద ట్రేడవుతున్నాయి. గత ఏడాది కాలంలో 12% పైగా లాభపడిన ఈ కౌంటర్, గత ఆరు నెలల టైమ్‌లోనే దాదాపు 22% రిటర్న్స్ డెలివెరీ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే, 31% పైగా రాబడిని అందించింది.
మరో ఆసక్తికర కథనం: బ్లాక్ డీల్స్, బిగ్ సక్సెస్ - మార్కెట్‌లో మంచి బూమ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial