By: ABP Desam | Updated at : 23 Dec 2022 03:24 PM (IST)
Edited By: Arunmali
రోజుకు 6 రూపాయలతో రూ.లక్ష తిరిగి పొందవచ్చు
Post Office Bal Jeevan Bima Yojana: తమ పిల్లలు మంచి స్థాయిలో స్థిర పడాలని ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే... పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర సందర్భాల కోసం లక్షల రూపాయలు కావాలి. భారీ ఖర్చును భరించలేని వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడతారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లల కోసం పెట్టుబడి ప్రణాళికను వాళ్లు పుట్టినప్పటి నుంచి ప్రారంభించాలి.
అనేక ప్రభుత్వ పథకాలు పిల్లల చదువుల దగ్గర నుంచి పెళ్లి వరకు ఖర్చులను భరిస్తున్నాయి. మీరు కూడా మీ పిల్లల కోసం మంచి పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ ప్రత్యేక పథకం ఒకటి ఉంది.
ఈ పోస్ట్ ఆఫీస్ పథకం పేరు 'బాల్ జీవన్ బీమా యోజన' (చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్). పిల్లల భవిష్యత్తు కోసమే ఈ బీమా పథకాన్ని రూపొందించారు. తల్లిదండ్రులు, తమ పిల్లల పేరుతో బాల జీవన్ బీమా యోజనను తీసుకోవచ్చు. నామినీగా పిల్లలను ఉంచాలి. ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కోసం తల్లిదండ్రుల వయస్సు కూడా ముఖ్యమే. 45 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయలేరు.
5 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్
ఈ పథకం, 5 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి వర్తిస్తుంది. ఈ పథకం తీసుకుంటే... కట్టాల్సిన ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన జమ చేయవచ్చు. చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద, ప్రతిరోజు రూ. 6 నుంచి రూ. 18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్లాన్ మెచ్యూరిటీ తేదీన, కనీసం రూ. 1 లక్ష హామీతో కూడిన ప్రయోజనం లభిస్తుంది.
చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పూర్తి వివరాలు
* ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుంది
* ఈ పథకం తీసుకోవడానికి, పిల్లల వయస్సు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి
* మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది
* పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు
* పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు.
* పాలసీ ప్రీమియాన్ని తల్లిదండ్రులు చెల్లించాలి
* ఈ పాలసీ మీద రుణ ప్రయోజనం ఉండదు
* మీకు వద్దు అనుకుంటే, ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు
* రూ. 1000 హామీ మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ ఇస్తారు
L&T Q3 Results: ఎల్టీ అదుర్స్! మాంద్యం పరిస్థితుల్లో లాభం 24% జంప్!
Adani Enterprises FPO: సర్ప్రైజ్! అదానీ ఎంటర్ప్రైజెస్లో $ 400 మిలియన్లు పెట్టుబడికి అబుదాబి కంపెనీ రెడీ!
UAN Number: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా, ఒక్క నిమిషంలో తెలుసుకోండి
Stock Market News: హమ్మయ్య! పతనం ఆగింది - కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం