Indian and Pakistani Companies: భారత్‌లో ఏర్పాటైన ఈ కంపెనీలు పాకిస్తాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయా?
Indian and Pakistani Companies:భారత్ పాక్ విభజన తర్వాత భారత్‌లో స్థాపించిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కు వెళ్ళాయి. ఆ కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Indian and Pakistani Companies: 1947కి ముందు, భారతదేశం- పాకిస్థాన్ విభజన జరగక ముందు, భారతదేశంలో అనేక ప్రసిద్ధ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. విభజన తర్వాత ఈ కంపెనీలు కూడా విడిపోయాయి. అలాంటి కొన్ని కంపెనీలు ఇప్పటికీ పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వ్యాపారంపై విభజన ప్రభావం
1947లో భారతదేశ విభజన కేవలం భూమిని, ప్రజలను మాత్రమే కాకుండా పరిశ్రమలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలను కూడా విభజించింది. పనిచేస్తున్న వ్యాపారాలు ఏదో ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది లేదా తమ కార్యకలాపాలను విభజించుకోవాల్సి వచ్చింది. దీని ఫలితంగా, ముంబై, ఢిల్లీ, లాహోర్ వంటి నగరాల్లో ప్రారంభమైన అనేక కంపెనీలు వేర్వేరు యాజమాన్యాలు, చట్టపరమైన నిర్మాణాల కింద భారతదేశం, పాకిస్థాన్‌లలో స్వతంత్రంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.
హమ్‌దర్ద్ లాబొరేటరీస్
హమ్‌దర్ద్ లాబొరేటరీస్ 1906లో ఢిల్లీలో హకీమ్ హాఫిజ్ అబ్దుల్ మజీద్ ఏర్పాటు చేసిన యునాని ఔషధ క్లినిక్. విభజన తర్వాత, ఆయన చిన్న కుమారుడు హకీమ్ మొహమ్మద్ సయీద్ 1948లో కరాచీకి వెళ్లి హమ్‌దర్ద్ పాకిస్థాన్‌ను స్థాపించారు.
నేడు, హమ్‌దర్ద్ ఇండియా, హమ్‌దర్ద్ పాకిస్థాన్ పూర్తిగా స్వతంత్ర ఛారిటబుల్ ట్రస్ట్‌లుగా పనిచేస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన ప్రసిద్ధ ఉత్పత్తి 'రూహ్ అఫ్జా' రెండు దేశాలలో వేర్వేరుగా తయారవుతోంది. ఏ యూనిట్ కూడా మరొకదాని కోసం డబ్బు సంపాదించదు, రెండూ తమ తమ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమంలో లాభాలను తిరిగి పెట్టుబడిపెడతాయి.
హబీబ్ బ్యాంక్ లిమిటెడ్
హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ 1941లో ముంబైలో హబీబ్ కుటుంబంతో మహమ్మద్ అలీ జిన్నా అభ్యర్థన మేరకు ఏర్పాటైంది. పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత, బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని కరాచీకి మార్చేసింది. తర్వాత పాకిస్థాన్ మొదటి కమర్షియల్ బ్యాంక్‌గా మారింది. 1974లో జాతీయం చేసిన తర్వాత, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ ఇప్పుడు పాకిస్థాన్‌లోనే అతిపెద్ద బ్యాంక్‌గా మారింది. ఈ బ్యాంక్ 25కుపైగా దేశాల్లో పనిచేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేడు దీనికి భారతదేశంతో ఎటువంటి కార్యాచరణ లేదా ఆర్థిక సంబంధం లేదు.
అలైడ్ బ్యాంక్
ఈ బ్యాంక్ 1942లో లాహోర్‌లో ఆస్ట్రేలియా బ్యాంక్‌గా ప్రారంభమైంది. విభజన తర్వాత అనేక భారతీయ బ్యాంకులు పాకిస్థాన్ నుంచి బయటకు వెళ్లడంతో, అలైడ్ బ్యాంక్‌కు వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది. బ్యాంక్ 1974లో జాతీయం చేశారు. ఆ తర్వాత ప్రైవేటీకరించారు.
డాల్డా
డాల్డా బ్రాండ్ 1937లో బ్రిటిష్ ఇండియాలో హిందుస్థాన్ వనస్పతి మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా పరిచయమైంది. విభజన తర్వాత, డాల్డా పాకిస్థాన్‌లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. 2000ల ప్రారంభంలో, యూనిలీవర్ రెండు దేశాలలో డాల్డా బ్రాండ్‌ను వేర్వేరుగా విక్రయించింది. భారతదేశంలో దీనిని బంజ్ లిమిటెడ్ కొనుగోలు చేసింది, పాకిస్థాన్‌లో ఇది వెస్ట్‌బరీ గ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. వెస్ట్‌బరీ గ్రూప్ దీని పేరును డాల్డా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చింది.
ఈ కంపెనీలు నేడు పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదిస్తున్నాయా?
వాస్తవానికి, ఈ కంపెనీలు భారతదేశం తరపున పాకిస్థాన్ కోసం డబ్బు సంపాదించడం లేదు. ఎందుకంటే విభజన తర్వాత ఆ కంపెనీలు పాకిస్థాన్‌లోనే స్థాపితమయ్యాయి, కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఆర్థిక కార్యకలాపం ఆ దేశ చట్టాలకు లోబడి జరుగుతున్నాయి.





















