(Source: ECI/ABP News/ABP Majha)
Anant Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికల మూడు రోజుల గ్రాండ్ వెడ్డింగ్- షెడ్యూల్ ఇదే
Anant Ambani Wedding Schedule: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై 12న వివాహం చేసుకోబోతున్నారు. తర్వాత జూలై 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు.
Anant Ambani Radhika Wedding Date: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై 8న యాంటిలియాలోని తన ఇంట్లో కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల హల్దీ వేడుకను ముఖేష్ అంబానీ నిర్వహించారు. తాజాగా, రాధిక మర్చంట్ హల్దీ వేడుక ఫోటో రివీల్ అయింది. ఇప్పుడు రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ హల్దీ వేడుక ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైభవంగా మామేరు వేడుక
జూలై 3న నీతా అంబానీ, ముఖేష్ అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్ మామేరు వేడుకను నిర్వహించారు. గుజరాతీ ఆచారాల ప్రకారం పెళ్లికి ముందు కోడలికి మామలు బహుమతులు అందజేస్తారు. అప్పుడు నూతన వధువు తన కాబోయే మామ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుంటారు. మామేరు వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్
ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి. ఈ క్రూయిజ్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అల్ట్రా-లగ్జరీ బెడ్‌రూమ్‌లు 800 మంది వీఐపీలకు సరిపడా సౌకర్యాలు ఉంటాయి. ఈ వేడుకకు కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అనన్య పాండే, ఓర్రీ, కరీనా కపూర్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఇంకా చాలా మంది హాజరయ్యారు.
అబ్బురపరచిన సంగీత్
పాప్ సింగర్ జస్టిన్ బీబర్ నుండి ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ వరకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. సంగీత్ వేడుకలో జస్టిన్ బీబర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, ‘సామూహిక వివాహ’ తర్వాత, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనున్నారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ వేడుక జరగనుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకోబోతున్నారు. తర్వాత జూలై 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు. అనంత్-రాధిక వివాహానికి వచ్చే అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించనున్నారు. జూలై 12 నుండి 14 వరకు పెళ్లి పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం.
పెళ్లికి మొదలైన సన్నాహాలు
అంబానీ కుటుంబం జూలై 2న సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్ఘర్‌కు చెందిన 20 మంది నిరుపేద జంటలు గ్రాండ్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ప్రతి వధువుకు ముక్కు పుడక, మంగళ సూత్రం, మెట్టెలు, ఉంగరాలు సహా బంగారు, వెండి ఆభరణాలను అందించారు. వీరికి దాదాపు రూ. 1.01 లక్షల విలువైన బహుమతులను అంబానీ అందజేశారు. జంటలు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు కావాల్సిన గృహోపకరణాలను కూడా అందుకున్నారు. జూన్ 29న ఆంటిలియాలోని అంబానీ నివాసంలో అనంత్, రాధిక వివాహ వేడుకలు పూజ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.
అనంత్-రాధిక వివాహ షెడ్యూల్:
జూలై 12: ఈ రోజు అనంత్ రాధిక వివాహ వేడుక జరుగనుంది. ఈ రోజున ఇద్దరూ ఆచారాలతో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే రోజు ప్రధాన వివాహ వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించనున్నారు.
జూలై 13: శుభ అశీర్వాద్ లేదా దైవిక ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారతీయ దుస్తులు కోడ్ అధికారికంగా ఉంటుంది.
జూలై 14: మంగళ్ ఉత్సవ్ అంటే వివాహ రిసెప్షన్ ఈ రోజున ఉంటుంది. దీనికి చిక్ థీమ్ డ్రెస్ కోడ్ ఫిక్స్ చేయబడింది.
అడెలె, డ్రేక్, లానా డెల్ రే, జస్టిన్ బీబర్ ప్రదర్శన
జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహన్న, ఎకాన్ ప్రదర్శనలు ఇచ్చారు. అయితే బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, పిట్‌బుల్, ఇటాలియన్ ఒపెరా సింగర్ ఆండ్రియా బోసెల్లి వంటి గాయకులు క్రూయిజ్ వేడుకలో తమ మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలతో అతిథులను అలరించారు. అడెలె, డ్రేక్, లానా డెల్ రే వంటి గాయకులు పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వివాహ వేడుకలో ఈ కళాకారుల ప్రదర్శన తేదీలను ఫిక్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జస్టిన్ బీబర్ కూడా ముంబైకి చేరుకుని సంగీత్ లో తన గానంతో ఉర్రూతలూగించారు.