Anant-Radhika: అంబానీ ఫ్యామిలీతో అట్లుంటది, దుబాయ్‌లోనూ దర్జా, 20 కార్ల కాన్వాయ్‌తో షాపింగ్
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక తర్వాత అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ కలిసి మళ్లీ బయట కనిపించడం ఇదే తొలిసారి.
Anant Ambani - Radhika Merchant Dubai Shopping: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) గానీ, అతని కుటుంబ సభ్యులుగానీ ఎక్కడికి వెళ్లినా జాతర జరిగినట్లే ఉంటుంది. అంబులెన్స్ సహా పెద్ద కాన్వాయ్ వెంట ఉండాల్సిందే, సెక్యూరిటీ గార్డ్‌లు హడావిడి చేయాల్సిందే. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ సీన్ ఇలాగే ఉంటుందని తాజా సంఘటన రుజువు చేస్తోంది.
ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇటీవల దుబాయ్‌లో ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లారు. వీళ్లు హై ప్రొఫైల్ సెలబ్రిటీలు కాబట్టి, ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి ఈ యువ జంటపైనే ఉంటుంది. దుబాయ్ మాల్‌లోకి ఈ జంట ఇచ్చిన ఎంట్రీకి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
20 కార్ల కాన్వాయ్‌లో దుబాయ్ మాల్‌కు..
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక (Pre Wedding Ceremony) తర్వాత అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ కలిసి మళ్లీ బయట కనిపించడం ఇదే తొలిసారి. ఈసారి దుబాయ్‌లో కెమెరాలకు చిక్కారు. ఈ యంగ్ కపుల్ దుబాయ్ మాల్‌కు నారింజ రంగు రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బీజ్‌లో వచ్చారు. వాళ్లకు గట్టి భద్రత కల్పించేందుకు 20 కార్లతో కూడిన కాన్వాయ్ దుబాయ్ వీధుల్లో నడిచింది.
మీడియా కథనాల ప్రకారం, ఈ మొత్తం కాన్వాయ్ విలువ రూ. 25 కోట్ల పైమాటే. కాన్వాయ్‌లో ఉన్న కార్లలో కాడిలాక్ ఎస్కలేడ్స్, GMC యుకాన్ డెనాలిస్, చేవ్రొలెట్ సబర్బన్ వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. 20 కార్ల వాహన శ్రేణిలో అధునాత భద్రత వ్యవస్థలతో కూడిన శక్తిమంతమైన SUVలు కూడా ఉన్నాయి. ఈ హై-ప్రొఫైల్ జంట భద్రత విషయంలో ఎలాంటి లోపం జరగకుండా అంబులెన్స్ కూడా ఈ ఫ్లీట్‌లో కనిపించింది. షాపింగ్ చేసిన వస్తువులు తెచ్చుకోవడానికి రూ. 25 కోట్ల విలువైన కార్ల కాన్వాయ్‌ను వినియోగించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దేశాధినేతలకు కూడా ఇలాంటి వైభోగం ఉండదని కామెంట్లు చేస్తున్నారు.
అనంత్ అంబానీ దుబాయ్‌లో ఏం కొన్నారు?
దుబాయ్ మాల్‌లోని రిమోవా స్టోర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ కనిపించారు, అక్కడ అనంత్ అంబానీ లగ్జరీ లగేజీ ఆప్షన్స్ చూశారు. అంతేకాదు.. అనంత్ - రాధిక దుబాయ్ మాల్‌లోని కొంతమంది వ్యవస్థాపకులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.
అనంత్-రాధిక పెళ్లి ఎప్పుడు? (Anant Ambani - Radhika Merchant Marriage Date)
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ఈ ఏడాది జులై 12న జరుగుతుంది. జామ్‌నగర్‌లో ఇటీవల ప్రి-వెడ్డింగ్ సెరెమొనీ జరిగింది, ప్రపంచ స్థాయి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వెడ్డింగ్ గురించి గ్లోబల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి.
మరో ఆసక్తికర కథనం: వెండి రేటు రూ.లక్ష దాటొచ్చు, ఆశ్చర్యపోకండి, సిల్వర్ స్పీడ్ అలాగే ఉంది!