Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Tweet: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటారా.. ఈ వివరాలు చదవండి.

FOLLOW US: 

Anand Mahindra Thanks KTR: సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వ్యాపారవేత్తలో ఆనంద్ మహీంద్రా ఒకరు. దేశం కోసం పతకాలు సాధించిన వారికి తమ వాహనాలు ఆఫర్ చేయడం, మరోవైపు ఊరూ, పేరూ తెలియకపోయినా ఏదైనా మారుమూల ప్రాంతాల్లోని వారు ఏదైనా సాధిస్తే వారికి సైతం ప్రోత్సహకాలు అందించే వ్యక్తిగా ఆనంద్ మహీంద్రాకు మంచి పేరుంది. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటారా.. ఈ వివరాలు చదవండి.

ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ (Formula E) వరల్డ్ ఛాంపియన్‌షిప్ రేసు నిర్వహించేందుకు హైదరాబాద్ వేదికగా మారనుంది. ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా ఫిఫా ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఖరారు చేస్తూ  సోమవారం ప్రకటించారు. 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ రేసులను నిర్వహిస్తుండగా.. మహీంద్రా రేసింగ్ కంపెనీ కూడా ఇందులో పాల్గొంటుంది. వ్యవస్థాపక టీమ్‌లో భాగస్వామిగా కొనసాగుతోంది.

మహేంద్ర రేసింగ్ కంపెనీ కార్లు స్వదేశంలో, అందులోనూ హైదరాబాద్‌లో పరుగులు పెట్టబోతున్నందుకుగానూ ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను వేదికగా ఖరారు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఫార్ములా ఈ రేసింగ్ వ్యవస్థాపక టీమ్‌లలో మేం ఒకరం. స్వదేశంలో ఇక నుంచి మహీంద్రా రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నందుకు నా కల నెరవేరింది. సొంత ప్రజల మధ్య ఈ రేసింగ్ జరగనుంది. నా చిరకాల స్వప్నం నిజం చేసినందుకు కేటీఆర్‌కు థ్యాంక్స్’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

స్పందించిన కేటీఆర్..
ఆనంద్ మహీంద్రా రేసింగ్ కార్లకు పోడియం ఫినిష్- హైదరాబాద్‌లో సొంత ప్రజల మధ్య జరగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. థ్యాంక్స్ ఆనంద్ జీ.. హైదరాబాద్‌ను స్ట్రాంగ్ ఈవీ హబ్‌గా మార్చేందుకు మీ సలహాలు, సహకారం కావాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్‌ ద్వారా బదులిచ్చారు. ‘ఫార్ములా ఈ’ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసులు మెక్సికో, లండన్, న్యూయార్క్, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్ నగరాలలో నిర్వహించారు. సౌదీ అరేబియాలోని దిరియా నగరం తొమ్మిదో సీజన్ పోటీలకు వేదికగా మారింది. త్వరలోనే హైదరాబాద్ ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలని  భావిస్తోంది. 

Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Also Read: Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా.. 

Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 07:40 AM (IST) Tags: Hyderabad KTR Anand Mahindra Anand Mahindra Thanks KTR Formula E FIA Formula E Formula E Racing In Hyderabad

సంబంధిత కథనాలు

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: వరుసగా రెండో వీకెండ్‌ లాభాలే లాభాలు! సెన్సెక్స్‌ 632+, నిఫ్టీ 182+

Stock Market News: వరుసగా రెండో వీకెండ్‌ లాభాలే లాభాలు! సెన్సెక్స్‌ 632+, నిఫ్టీ 182+

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్