అన్వేషించండి

Aadhaar: ఈ వివరాలు మార్చేందుకు జీవితకాలంలో ఒకే ఒక్క అవకాశం, చాలామందికి తెలీదు!

Aadhar Card Updation: పౌరుడి పేరు, చిరునామా వంటి విషయాలు మాత్రమే కాదు, వేలిముద్రలు (Fingerprints), కనుపాపలు (Iris) వంటి అత్యంత సున్నితమైన సమాచారం కూడా ఆధార్‌లో నిక్షిప్తమై ఉంటుంది.

How To Change DoB And Gender In Aadhaar Card: ప్రస్తుతం, మన దేశంలో, దాదాపు ప్రతి భారతీయుడి దగ్గర ఆధార్‌ కార్డ్‌ ఉంది. ఇది ఒక వ్యక్తిగత గుర్తింపు పత్రం. కేంద్ర ప్రభుత్వం, చాలా పనులు & పథకాలకు ఆధార్‌ను లింక్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారతదేశ పౌరుడైన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి. పౌరుడి పేరు, చిరునామా వంటి విషయాలు మాత్రమే కాదు... వేలిముద్రలు (Fingerprints), కనుపాపలు (Iris) వంటి అత్యంత సున్నితమైన సమాచారం కూడా ఆధార్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి ఆధార్ కార్డ్‌లో, వ్యక్తి గుర్తింపు కోసం 16 అంకెల సంఖ్య ఉంటుంది. 

జీవితకాలంలో ఒకే ఒక్క ఛాన్స్‌
ఆధార్‌లోని పేరు నుంచి చిరునామా వరకు ప్రతి విషయంలో దొర్లిన తప్పులను సరిచేయవచ్చు. అయితే... జీవితకాలం మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే మార్చగలిగే రెండు విషయాలు ఉన్నాయి. 

ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ (Date of Birth), జెండర్‌ (Gender) విషయంలో దొర్లిన తప్పులను ఒక్కసారి మాత్రమే సరి చేయడానికి అవకాశం ఉంటుంది. మరోమారు దీనికి అవకాశం ఇవ్వరు. కాబట్టి... మీ ఆధార్‌ కార్డ్‌లో మీ పుట్టిన తేదీ, జెండర్‌ తప్పుగా ఉంటే, తప్పును సరి చేసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. రెండోసారి కూడా తప్పుడు సమాచారం ఇస్తే, ఇక దానిని మార్చడానికి వీలు కాదు.

ఆధార్‌ కార్డ్‌లో మీ పేరు తప్పుగా ఉంటే, దానిని సరి చేసుకోవడానికి రెండుసార్లు మాత్రమే అవకాశం లభిస్తుంది. ఈ దిద్దుబాట్లను ఆన్‌లైన్‌లో చేయవచ్చు, లేదా, మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలను సరి చేయించుకోవచ్చు. 

ఎప్పటికీ మారని విషయం
ఆధార్ కార్డ్‌లో మీ 16 అంకెల సంఖ్యను ఎప్పటికీ మార్చలేరు. మీకు ఆధార్ నంబర్ జారీ అయిన తర్వాత, అది మీ జీవితకాలం కొనసాగుతుంది. మిగిలిన విషయాల్లో మార్పులు చేసి కొత్త ఆధార్‌ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, ఆ కార్డ్‌ మీద పాత నంబరే ఉంటుంది. మీ వివరాలను ఉపయోగించి మరొక నంబర్‌తో ఆధార్ కార్డ్‌ను తయారు చేయలేరు. ఆధార్‌లో మీ వేలిముద్రలు, కనుపాపలు బయోమెట్రిక్స్‌ ఉంటాయి. ఒక వ్యక్తికి ఈ వివరాలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. తప్పుడు మార్గాల ద్వారా కొత్త నంబర్‌ను సృష్టించలేకపోవడానికి ఇదే కారణం.

జూన్‌ 14 వరకు ఉచిత అప్‌డేషన్‌
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి ఈ ఏడాది జూన్ 14వ తేదీ వరకు 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ' (UIDAI) అవకాశం ఇచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకునే వాళ్లకే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఆధార్‌ కేంద్రానికి వెళ్లి ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటే కొంత రుసుము చెల్లించాలి. జూన్‌ 14వ తేదీ తర్వాత, ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసినా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ కార్డ్‌ పని చేయదా?
పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డ్‌లను జూన్‌ 14లోపు నవీకరించకపోతే ఆ కార్డు చెల్లదంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు కనిపిస్తున్నాయి. అలాంటి గాలి కబుర్లను నమ్మొద్దని, అవి వదంతులేనని ఉడాయ్‌ వెల్లడించింది. ఆధార్‌ కార్డును జూన్‌ 14 లోగా అప్‌డేట్‌ చేయకపోయినా, ఆ తర్వాత కూడా ఆధార్‌ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. 

మరో ఆసక్తికర కథనం: ఒక్క SMS లేదా ఒక్క మిస్డ్‌ కాల్‌ - పీఎఫ్‌ బ్యాలెన్స్‌ క్షణాల్లో తెలుస్తుంది

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget