Hot Stocks: 3 నెలల్లో 48% లాభాలు తెచ్చిపెట్టిన స్పెషల్ స్టాక్స్, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
క్వాలిటీ స్టాక్స్‌ను చాలా మ్యూచువల్ ఫండ్స్ కొని హోల్డ్ చేస్తుంటాయి.
Mutual Fund Scheme: మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు తెలుసుగా, రకరకాల పథకాల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటాయి. దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లలో (domestic institutional investors లేదా DIIs) మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఒక కీలక భాగం. మార్కెట్‌లోని వివిధ వర్గాల నుంచి సేకరించిన డబ్బును వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇవి లాభాలు ఆర్జిస్తుంటాయి. ఈ క్రమంలో, క్వాలిటీ స్టాక్స్‌ను చాలా మ్యూచువల్ ఫండ్స్ కొని హోల్డ్ చేస్తుంటాయి.
ఈ స్టోరీలో, ప్రత్యేకంగా ఒకే ఒక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మాత్రమే హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి చెప్పుకుందాం. ఈ జాబితాలో మొత్తం 182 స్టాక్స్ ఉన్నాయి. వీటిని షార్ట్ లిస్ట్ చేయడానికి... 2023 ఫిబ్రవరి నాటికి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ (market value) ఉండి, గత 3 నెలల కాలంలో 10% పైగా వృద్ధి రేటును సాధించిన వాటిని మాత్రమే ఫిల్టర్ చేశాం. ఈ వడపోత తర్వాత 5 స్టాక్స్ మిగిలాయి.
కేవలం ఒక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మాత్రమే హోల్డ్ చేస్తున్న 5 హాట్ స్టాక్స్:
స్టెర్లింగ్ టూల్స్ (Sterling Tools)
సోమవారం (03 ఏప్రిల్ 2023) నాటి ముగింపు ధర: రూ. 401.90
గత 3 నెలల కాలంలో ప్రైస్ రిటర్న్: 48 శాతం
హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్: HSBC స్మాల్ క్యాప్ ఫండ్
2023 ఫిబ్రవరి చివరి నాటికి పెట్టుబడి విలువ: రూ. 56 కోట్లు
వర్దమాన్ స్పెషల్ స్టీల్స్ (Vardhman Special Steels)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 398
గత 3 నెలల కాలంలో ప్రైస్ రిటర్న్: 29 శాతం
హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్: టాటా స్మాల్ క్యాప్ ఫండ్
2023 ఫిబ్రవరి చివరి నాటికి పెట్టుబడి విలువ: రూ. 13 కోట్లు
కంట్రోల్ ప్రింట్ (Control Print)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 516
గత 3 నెలల కాలంలో ప్రైస్ రిటర్న్: 29 శాతం
హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్: SBI లార్జ్ & స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్
2023 ఫిబ్రవరి చివరి నాటికి పెట్టుబడి విలువ: రూ. 45 కోట్లు
ఐనాక్స్ విండ్ ఎనర్జీ (Inox Wind Energy)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 1,118.80
గత 3 నెలల కాలంలో ప్రైస్ రిటర్న్: 15 శాతం
హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్: ఆదిత్య బిర్లా SL మిడ్ క్యాప్ ఫండ్
2023 ఫిబ్రవరి చివరి నాటికి పెట్టుబడి విలువ: రూ. 15 కోట్లు
లూమ్యాక్స్ ఆటో టెక్నాలజీస్ (Lumax Auto Technologies)
సోమవారం నాటి ముగింపు ధర: రూ. 278.10
గత 3 నెలల కాలంలో ప్రైస్ రిటర్న్: 12 శాతం
హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్: DSP స్మాల్ క్యాప్ ఫండ్
2023 ఫిబ్రవరి చివరి నాటికి పెట్టుబడి విలువ: రూ. 94 కోట్లు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.