అన్వేషించండి

Yamaha Aerox S: స్మార్ట్ కీతో మార్కెట్లోకి వచ్చిన యమహా కొత్త స్కూటీ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Yamaha Aerox S Smart Key: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ యమహా మనదేశంలో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదే యమహా ఏరోక్స్ ఎస్ వేరియంట్. స్మార్ట్ కీ ఫీచర్‌తో ఇది మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Yamaha Aerox S Launched: యమహా మోటార్ ఇండియా కొత్త ఏరోక్స్ ఎస్ వేరియంట్‌ను కీ లెస్ ఇగ్నిషన్, మరిన్ని ఫీచర్లతో మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,50,000గా నిర్ణయించారు. అంటే ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 3300 ఎక్కువన్న మాట. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. సిల్వర్, రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ కీ ఎలా పని చేస్తుంది?
స్మార్ట్ కీపై బటన్‌ను నొక్కడం ద్వారా ఫ్లాషింగ్ ఇండికేటర్‌ను ట్రిగ్గర్ చేసి, ప్రత్యేకమైన సౌండ్‌ను జనరేట్ చేయడం ద్వారా మీరు స్కూటర్‌ను సులభంగా గుర్తించవచ్చు. సాంప్రదాయ స్లాట్‌కు బదులుగా, స్కూటర్‌ను ఆన్/ఆఫ్ చేయడం లేదా ఫ్యూయల్ క్యాప్‌ను ఓపెన్ చేయడం వంటి వివిధ పనులకు కీ నాబ్‌ను ఉపయోగించవచ్చు.

యమహా ఏరోక్స్ స్పెసిఫికేషన్స్
కొత్త యమహా ఏరోక్స్ ఎస్ వేరియంట్‌లో ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను అమర్చారు. ఇది స్మార్ట్ కీ రేంజ్ వెలుపల ఉన్నప్పుడు వాహనం స్వయంచాలకంగా లాక్ అయ్యేలా చేస్తుంది. ఇందులో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. స్కూటర్‌లో ఎల్ఈడీ లైటింగ్, ఛార్జింగ్ సాకెట్, స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నాయి. ఇది 14 అంగుళాల ముందు, వెనుక చక్రాలను కలిగి ఉంది. ఏరోక్స్ ఎస్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, 126 కిలోల కర్బ్ వెయిట్‌ని కలిగి ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

ఇంజిన్, గేర్‌బాక్స్ ఇలా...
సాధారణ వేరియంట్ తరహాలోనే కొత్త యమహా ఏరోక్స్ ఎస్ 155 సీసీ సింగిల్ సిలిండర్ వీవీఏ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది ఇది 8,000 ఆర్పీఎం వద్ద 15 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 6500 ఆర్పీఎం వద్ద 13.9 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

కంపెనీ ఏం చెప్పింది?
యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఇషిన్ చిహానా మాట్లాడుతూ, ‘ఆరోక్స్ 155 లాంచ్ అయినప్పటి నుంచి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆకట్టుకునే పనితీరు, అసాధారణ డిజైన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. భారతీయ నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, సమర్ధవంతమైన రవాణా పరిష్కారాల అవసరం పెరిగింది. పెరుగుతున్న యమహా రైడర్ల డిమాండ్లను పరిష్కరించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాం.’ అన్నారు. 

మరోవైపు యమహా ఇటీవలే మనదేశంలో అప్‌డేట్ చేసిన ఫాసిన్, రే జెడ్‌ఆర్‌లను భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫాసినో ఎస్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (డిస్క్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.91,030గా కంపెనీ నిర్ణయించింది. రే జెఆర్‌ను మాత్రం రే జెడ్‌ఆర్ 125, రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ అనే రెండు వేరియంట్‌ల్లో మార్కెట్లో విడుదల చేశారు. వీటిలో రే జెడ్‌ఆర్ ధర రూ.89,530గా, స్ట్రీట్ ర్యాలీ ధర రూ.93,530గా నిర్ణయించారు. 

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 

టాప్ హెడ్ లైన్స్

FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
VinFast e-scooters: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వియత్నాం దేశపు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారీ!
Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
వాహన బీమా లేకుండా టోల్ ప్లాజా దాటితే SMS అలర్ట్.. రూ.10,000 వరకు జరిమానా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget