అన్వేషించండి

Volkswagen Virtus: వావ్ అనిపించే ఫోక్స్‌వాగన్ వర్ట్యూస్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

ఫోక్స్‌వాగన్ వర్ట్యూస్ సెడాన్ కారును కంపెనీ రివీల్ చేసింది. దీని ఫీచర్లను కూడా ప్రకటించింది.

Volkswagen Virtus: ఫోక్స్‌వాగన్ మనదేశంలో కొత్త సెడాన్ కారును రివీల్ చేసింది. అదే ఫోక్స్‌వాగన్ వర్ట్యూస్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కారును మొదటిసారి ప్రదర్శించారు కూడా. ఇది ఒక మిడ్ సైజ్ సెడాన్. వెంటోను ఇది రీప్లేస్ చేయనుంది. ఇది వెంటో కంటే శక్తివంతమైనది కాకుండా విలాసవంతమైన కారు కూడా.

టైగూన్‌కు దీనికి కొంచెం దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ రెండిటినీ ఒకే ప్లాట్‌ఫాం మీద రూపొందించారు. ఈ ప్లాట్‌ఫాంపై రూపొందించే కార్లను బాగా లోకలైజేషన్ చేయడంతో పాటు ధరను ఇతర బ్రాండ్లతో పోటీ పడేవిధంగా నిర్ణయిస్తారు. భారతదేశంలో కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

వర్ట్యూస్ కొంచెం పెద్ద కారే. దీని పొడవు 4,561 మిల్లీమీటర్లుగా ఉంది. వెడల్పు కూడా ఎక్కువే. ఇక డిజైన్ చూడగానే సన్నని గీతలతో చూడగానే ఫోక్స్‌వాగన్ కారు అని గుర్తుపట్టే విధంగా ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను గ్రిల్స్‌తో మ్యాచ్ చేసిన విధానం చాలా బాగుంది. బంపర్ డిజైన్ కూడా ఇప్పటివరకు వచ్చిన ఫోక్స్‌వాగన్ కార్లన్నిటి కంటే షార్ప్‌గా ఉంది.

ఈ కారు అసలైన సెడాన్ ఆకారంలో ఉంది. వెనకవైపు పెద్ద ల్యాంప్స్ చూస్తే వెంటో కంటే ప్రీమియంగా ఉందని తెలుస్తోంది. జీటీ ట్రిమ్ వేరియంట్‌లో బ్లాక్ డ్యూయల్ టోన్ రూఫ్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్, బ్లాక్ అలోయ్స్ ఇందులో ఉన్నాయి. వర్ట్యూస్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ వేరియంట్‌తో లాంచ్ కానుంది.

ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ వేరియంట్లను అందించనున్నారు. స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ వెర్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని ఇంటీరియర్ చాలా స్పేషియస్‌గా ఉండనుంది. దీని క్యాబిన్ డిజైన్ కొంచెం టైగూన్‌కు దగ్గరగా ఉండనుంది.

టైగూన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించారు. సన్‌రూఫ్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు రెండిట్లోనూ ఉన్నాయి. వర్ట్యూస్ త్వరలో లాంచ్ కానుంది. స్కోడా స్లేవియా, హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నాలతో ఈ కారు పోటీ పడనుంది.

Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!

Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Volkswagen India (@volkswagen_india)

టాప్ హెడ్ లైన్స్

Highest Mileage CNG Cars: హైయెస్ట్‌ మైలేజీ ఇచ్చే టాప్ 10 CNG కార్లు ఇవే.. కిలో గ్యాస్‌తో ఏకంగా 36.47km! టాప్‌లో Maruti Dzire
దేశం మొత్తంలో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 CNG కార్లు.. కేవలం రూ.4.69 లక్షల నుంచి స్టార్ట్‌
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
రాయల్ ఎన్‌ఫీల్డ్ 500కి పోటీగా Honda CB500.. మూడు వేరియంట్లు, 501cc ఇంజిన్‌, 28hp పవర్‌
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Honda CB500 లాంచ్.. రూ.2.75 లక్షలకే కొత్త 501cc బైక్!
Vehicle RC Address Change: RCలో 30 రోజుల్లో అడ్రస్ మార్చుకోకపోతే జరిమానా.. కావాల్సిన డాక్యుమెంట్లు, ఫీజు వివరాలు
మీ వెహికల్ RCలో ఇంటి అడ్రస్ మార్చుకోవడం ఎలా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget