అన్వేషించండి

Volkswagen Tayron కొనాలా వద్దా? ప్లస్‌లు, మైనస్‌లు స్పష్టంగా చెప్పే ఫుల్‌ అనాలిసిస్‌

Volkswagen Tayron R-Line టెక్నాలజీ, ఇంటీరియర్‌, ఇంజిన్‌, సీటింగ్‌, సేఫ్టీ ఎలా ఉన్నాయి? ఈ ప్రీమియం 7 సీటర్‌ SUV మీకు సరిపోతుందా, లేదా తెలిపే పూర్తి రివ్యూ.

Volkswagen Tayron Review: వోక్స్‌వ్యాగన్‌ భారత మార్కెట్‌లో మళ్లీ 7 సీటర్‌ SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా ఆవిష్కరించిన Volkswagen Tayron R-Lineతో జర్మన్‌ బ్రాండ్‌ మరోసారి తన ప్రీమియం ఇమేజ్‌ను చూపిస్తోంది. ధరలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, బుకింగ్‌లు మాత్రం ప్రారంభమయ్యాయి. ఎక్స్‌పర్ట్‌లు ఈ మూడు వరుసల SUVతో కొంత సమయం గడిపి, ఇంజిన్‌, రైడ్‌, హ్యాండ్లింగ్‌, ఫీచర్లు, సీటింగ్‌ వంటి అంశాలను వివరించారు. ఈ నేపథ్యంలో Tayron మీకు సరిపోతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం.

ప్రీమియం ఇంటీరియర్‌ అనుభవం

Volkswagen నుంచి ఆశించే స్థాయి ఇంటీరియర్‌ నాణ్యత Tayronలో స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌ Tiguan R-Lineను పోలి ఉంటుంది. మధ్యలో ఉన్న భారీ 15 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ పరిమాణంలో పెద్దదిగా ఉన్నా, డ్రైవింగ్‌లో ఇబ్బంది కలిగించదు. రాత్రివేళ డ్యాష్‌బోర్డ్‌ మీద కనిపించే యాంబియంట్‌ లైటింగ్‌ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.

10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, ఫిజికల్‌ బటన్‌లతో వచ్చే 3 స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ వాడటానికి సౌకర్యంగా ఉంటాయి. కేబిన్‌లో సాఫ్ట్‌ టచ్‌ మెటీరియల్స్‌ ఎక్కువగా వాడటం వల్ల ప్రీమియం ఫీలింగ్‌ వస్తుంది. అయితే డ్యాష్‌బోర్డ్‌ దిగువ భాగాల్లో హార్డ్‌ ప్లాస్టిక్‌ వాడటం కొంచెం హై ఎండ్‌ ఫీలింగ్‌ను తగ్గిస్తుంది.

ఆధునిక ఫీచర్లతో నిండిన SUV

Volkswagen Tayronలో నేటి కాలానికి అవసరమైన దాదాపు అన్ని ఫీచర్లు ఉన్నాయి. పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 3 జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెనుక AC వెంట్స్‌, 11 స్పీకర్‌ హార్మన్‌ కార్డన్‌ సౌండ్‌ సిస్టమ్‌, AR ఆధారిత హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, జెస్చర్‌ కంట్రోల్‌తో పవర్డ్‌ టెయిల్‌గేట్‌ లాంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ముందు సీట్లు 12-వే పవర్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌, మెమరీ, మసాజ్‌, హీటింగ్‌, వెంటిలేషన్‌ ఫంక్షన్లతో వస్తాయి. అయితే క్లైమేట్‌ కంట్రోల్‌, సీట్‌ వెంటిలేషన్‌ సెట్టింగ్స్‌ అన్నీ టచ్‌స్క్రీన్‌ ద్వారానే ఆపరేట్‌ చేయాలి. దీనివల్ల, డ్రైవింగ్‌ సమయంలో కళ్లను రోడ్డుపై నుంచి స్కీన్‌ వైపునకు తిప్పాల్సి రావడం భద్రత పరంగా కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది.

సేఫ్టీ 

9 ఎయిర్‌బ్యాగ్స్‌, లెవల్‌-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌, TPMS, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే 360 డిగ్రీ కెమెరా రిజల్యూషన్‌ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది.

ఇంజిన్‌, డ్రైవింగ్‌ అనుభవం

Tayron R-Lineలో వోక్స్‌వ్యాగన్‌ ప్రఖ్యాత EA888 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 204hp శక్తి, 320Nm టార్క్‌ ఇస్తుంది. 7-స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌తో పాటు AWD సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. గేర్‌ మార్పులు స్మూత్‌గా జరుగుతాయి. 0 నుంచి 100 km వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో చేరగలగడం దీని శక్తిని చూపిస్తుంది.

హ్యాండ్లింగ్‌ విషయంలో Tayron చాలా స్థిరంగా ఉంటుంది. హైవే స్పీడ్స్‌లో కూడా నమ్మకంగా నడుస్తుంది. సిటీ డ్రైవ్‌లో స్టీరింగ్‌ లైట్‌గా, వేగం పెరిగే కొద్దీ గట్టిగా మారుతుంది. అయితే గుంతలు, రంబుల్‌ స్ట్రిప్స్‌ మీదుగా వెళ్తే కొంచెం స్టిఫ్‌ ఫీలింగ్‌ కేబిన్‌లోకి వస్తుంది.

లోపాలు కూడా ఉన్నాయి

ఈ SUVలో డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ లేకపోవడం పెద్ద మైనస్‌. అంతర్జాతీయ మార్కెట్‌లో లభించే డీజిల్‌ వెర్షన్‌ భారత్‌లో ఉంటే ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ కోరుకునే వారికి మరింత ఆకర్షణీయంగా ఉండేది.

అలాగే, ఇది పూర్తిస్థాయి 7 సీటర్‌ అని చెప్పుకోవడం కష్టం. మూడో వరుస సీట్లలో పెద్దవాళ్లు కూర్చోవడం కష్టమే. ఎక్కువ ఎత్తు ఉ్నన ప్రయాణికులకు మోకాళ్ల దగ్గర స్థలం, హెడ్‌రూమ్‌ చాలా తక్కువగా ఉంటుంది. కాస్త ముడుచుకుని కూర్చుంటే తక్కువ దూరం ప్రయాణాల చేయొచ్చు, లాంగ్‌ జర్నీలు చేయలేరు. చిన్న పిల్లలకైతే మూడో వరుస సీటు సరిపోతుంది.

Volkswagen Tayron ప్రీమియం ఇంటీరియర్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, ఆధునిక టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అయితే డీజిల్‌ ఆప్షన్‌ లేకపోవడం, మూడో వరుసలో పరిమిత స్థలం దీని బలహీనతలు. 

లగ్జరీ ఫీల్‌, పెట్రోల్‌ పవర్‌, బ్రాండ్‌ విలువ కోరుకునేవారికి Tayron మంచి ఎంపిక. పూర్తిస్థాయి ఫ్యామిలీ 7 సీటర్‌ కోరుకునేవారు మాత్రం మరోసారి ఆలోచించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.8 లక్షలు ఆదా చేసుకునే అద్భుతమైన ఛాన్స్‌.. Mahindra XEV 9e, XEV 9S ఎలక్ట్రిక్ కార్లపై కొత్త ఆఫర్‌!
ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏకంగా రూ.8 లక్షలు తక్కువకే Mahindra XEV 9e, XEV 9S ఎలక్ట్రిక్ కార్లు!
Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?
Yamaha R2లో ఏ వేరియంట్‌ బెస్ట్‌? రూ.2.30 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లు ఇవే!
రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం!
ఏకంగా 301 కి.మీ. రేంజ్‌తో ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1Z లాంచ్‌.. రూ.999తో బుక్‌ చేసుకోవచ్చు
పెట్రోల్ బాదుడుకి చెక్ చెబుదాం - పాత వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చడం ఎలా?
మీ పాత కారును EVగా మార్చేయండి! రెట్రోఫిటింగ్ ప్రాసెస్, ఖర్చుల వివరాలు ఇవిగో!

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Vizag Crime News: విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం!
విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం!
Hyderabad E-Challan Fastag Link: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌!
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌!
AP Local Body Elections: లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా?
లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా?
GDN Movie OTT : మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
DC Movie OTT : రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!
విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్
Embed widget