అన్వేషించండి

Volkswagen Taigun లేదా Maruti Victoris ఎస్‌యూవీలలో ఏది పవర్‌ఫుల్? 2 నిమిషాల్లో ఫీచర్లు తెలుసుకోండి

మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ వోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి విక్టోరియాస్ మధ్య పోటీ నెలకొంది. అయితే ధర, ఫీచర్లు, ఇంజిన్ పరంగా ఏ SUV మీకు బెస్ట్ ఇక్కడ వివరాలతో తెలుసుకోండి.

మిడ్ సైజ్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో ప్రస్తుతం పోటీ పెరుగుతోంది. ఒకవైపు పవర్‌ఫుల్ పనితీరు, జర్మనీ ఇంజనీరింగ్‌కు పేరుగాంచిన వోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) ఉండగా, మరోవైపు ఇటీవల లాంచ్ అయిన మారుతి సుజుకి కొత్త 'మారుతి విక్టోరిస్' (Maruti Victoris) పోటీ పడుతున్నాయి. ఒకవేళ మీరు కొత్త ఎస్‌యూవీని కొనాలని ఆలోచిస్తుంటే, ఇంజిన్, ఫీచర్లు, ధర ఆధారంగా మీకు ఏది బెస్ట్ ఈ వివరాలు చూసి తెలుసుకోండి. 

ఇంజిన్, పనితీరులో ఏది బెస్ట్..
వోక్స్‌వ్యాగన్ టైగన్‌లో 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. మొదటిది 1.5 లీటర్ TSI ఇంజిన్, ఇది 150 PS పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండవది 1.0 లీటర్ TSI ఇంజిన్, ఇది 115 PS పవర్, 178 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ DSG గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మరోవైపు మారుతి విక్టోరిస్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు. ఈ ఎస్‌యూవీ 75.8 kW పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ SUV స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఆప్షన్లలో కూడా వస్తుంది. మీరు ఎక్కువ పవర్, ఫాస్ట్ డ్రైవింగ్‌ను ఇష్టపడితే టైగన్ బెటర్ అనిపిస్తుంది.  కానీ మైలేజ్, తక్కువ ఖర్చు ప్రాధాన్యతగా భావిస్తే విక్టోరిస్ బెటర్ ఆప్షన్ కావొచ్చు. 

ఫీచర్లలో ఏది ఎక్కువ మోడ్రన్?
వోక్స్‌వ్యాగన్ టైగన్‌లో 17 ఇంచుల అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడీ డిఆర్ఎల్ (DRL), 10 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఇంచుల డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సైతం లభిస్తాయి. మారుతి విక్టోరిస్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, 26.03 సెం.మీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. జెస్టర్ కంట్రోల్ టెయిల్ గేట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, 35 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లు లభిస్తాయి. ఫీచర్ల పరంగా చూస్తే, విక్టోరిస్ టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్‌గా కనిపిస్తుంది.

ఏది తక్కువ ధర
వోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹11.42 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల వరకు ఉంటుంది. మారుతి విక్టోరిస్ ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. అంటే బేస్ వేరియంట్‌లో విక్టోరిస్ కొంచెం చౌకగా ఉన్నప్పటికీ, టాప్ మోడల్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.

ప్రస్తుత మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి విక్టోరిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పనితీరు విషయానికి వస్తే, వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5 లీటర్, 1.0 లీటర్ TSI ఇంజిన్లతో పవర్ ఫుల్ (గరిష్టంగా 150 PS), వేగవంతమైన డ్రైవింగ్ ఫీల్ అందిస్తుంది. మారుతి విక్టోరిస్ మైలేజ్, పొదుపుపై ఫోకస్ చేసింది. స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్జీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. సాంకేతిక పరంగా టైగన్ 10 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. విక్టోరిస్ పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, జెస్టర్ కంట్రోల్ టెయిల్ గేట్ వంటి మోడ్రన్ ఫీచర్లతో టెక్నాలజీ పరంగా ముందుంటుంది. మారుతి విక్టోరిస్ బేస్ వేరియంట్ (రూ. 10.49 లక్షలు) టైగన్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, ఫీచర్లు ఉన్న టాప్ వేరియంట్ ధర మాత్రం టైగన్ కంటే ఎక్కువగా ఉంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget