అన్వేషించండి

EV Battery Charging Tips: ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత శాతం వరకు ఛార్జింగ్ చేయాలి? దాని వల్ల లాభాలేంటీ

Electric Vehicle Battery Tips | ఎలక్ట్రిక్ వాహనాలను ఇంట్లో రాత్రంతా ఛార్జింగ్ చేస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల బ్యాటరీ 100% ఛార్జ్ అవుతుంది. కానీ కొన్నేళ్లలోనే బ్యాటరీ సమస్య వస్తుంది.

Electric Vehicle Battery charging Tips | భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మారుతున్నారు. తద్వారా ఇది మీ ఇంధన ఖర్చులు తగ్గించడంతో పాటు తక్కువ కాలుష్య కారకాలుగా పర్యావరణానికి సైతం మేలు చేస్తాయి. అయితే EV కొనుగోలు చేసిన తర్వాత, వెహికల్ ఎంతవరకు ఛార్జ్ చేయడం సరైనది అనే విషయంపై క్లారిటీ ఉండాలి. నిపుణులు తరచుగా 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ మెరుగ్గా ఉంటుంది. 

80% ఛార్జింగ్ రూల్ ఎందుకు ముఖ్యం?
ఆధునిక EVలలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) అమర్చి ఉంటుంది. ఈ సిస్టమ్ బ్యాటరీ సురక్షితంగా, సమతుల్యంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ, బ్యాటరీని ప్రతిసారీ 100 శాతం వరకు ఛార్జ్ చేస్తే, దాని లైఫ్ టైంపై  ప్రభావం చూపుతుంది. అందుకే 80 శాతం వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. ఛార్జ్ లెవల్ పెరిగేకొద్దీ బ్యాటరీ లోపల నిరోధం (Resistance) అదే స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల అది పూర్తిగా నిండటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే 80 శాతం నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. పదేపదే 100% వరకు ఛార్జ్ చేస్తే బ్యాటరీ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.

బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది..
EV వాహనాల బ్యాటరీ చాలా ఖరీదు ఉంటాయి. ఒకవేళ బ్యాటరీ పాడైతే, దాన్ని మార్చడానికి భారీగా ఖర్చు అవుతుంది. అందుకే ఛార్జింగ్‌ను 80 వరకు, లేదా 85 శాతం వరకే చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ దీర్ఘకాలం పాటు బాగుంటుంది. దీనివల్ల మీ బ్యాటరీ త్వరగా చెడిపోదు. కొన్నేళ్లపాటు మీకు బ్యాటరీ ఖర్చులు తగ్గుతాయి. ఎప్పుడైనా సుదీర్ఘ ప్రయాణాలు (Long Journey) చేయాల్సి వచ్చినప్పుడు లాంటి సందర్భాలలో దాదాపు 100 ఛార్జ్ చేసుకోవాలి. కానీ రోజువారీ వినియోగంలో 80 శాతం ఛార్జింగ్ రూల్ పాటించడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

సమయం కూడా ఆదా అవుతుంది
EVలను పెట్రోల్-డీజిల్ వాహనాల తరహాలో కొన్ని నిమిషాల్లో బయటకు వెళ్లేందుకు సిద్ధం కాలేం. బ్యాటరీ 80% వరకు వేగంగా ఛార్జ్ అవుతుంది, కానీ ఆ తర్వాత వేగం తగ్గుతుంది. అందుకే 80 శాతం వద్ద ఛార్జింగ్ ఆపివేయడం వల్ల మీ విలువైన సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా, ఛార్జింగ్ స్టేషన్ల వద్ద రద్దీ తగ్గుతుంది. ఇతరులు కూడా తమ వాహనాలను త్వరగా ఛార్జ్ చేసుకునే వీలుంటుంది.

చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో 'రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్' ఉంటుంది. మీరు బ్రేక్ వేసినప్పుడు లేదా వాహనం వేగాన్ని తగ్గించినప్పుడు, ఈ సిస్టమ్ ఎనర్జీని తిరిగి బ్యాటరీలో నిల్వ చేస్తుంది. ఒకవేళ బ్యాటరీ ముందే 100 శాతం నిండి ఉంటే, ఈ అదనపు ఎనర్జీని సేవ్ చేయడం సాధ్యపడదు. కానీ బ్యాటరీ 80% వరకు మాత్రమే ఛార్జ్ అయి ఉంటే, అందులో ఖాళీ ఉంటుంది కాబట్టి రీజనరేటివ్ బ్రేకింగ్ పూర్తి ప్రయోజనం మీరు పొందవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki Dzire Hyderabad Price: మారుతి సుజుకి డిజైర్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ప్రైస్! ఈఎమ్‌ఐ, డౌన్‌పేమెంట్ లెక్కలు ఇవే!
మారుతి సుజుకి డిజైర్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ప్రైస్! ఈఎమ్‌ఐ, డౌన్‌పేమెంట్ లెక్కలు ఇవే!
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల
2026 తొలి ఆరు నెలల్లో దేశాన్ని ఊపేసిన కార్లు ఇవే - టాప్ 15 జాబితాలో మారుతి హవా
రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌
తక్కువ ధరలోనే డస్టర్‌ కొత్త అడ్వెంచర్‌ ఎడిషన్‌, టాప్‌-క్లాస్‌ ఫీచర్లతో లాంచ్‌ - ఇక ఆట, వేట మీదే!
Maruti Baleno మీకు సరైన కారేనా? కొనే ముందు తెలుసుకోవాల్సిన 2 ప్లస్‌లు & 2 మైనస్‌లు
మారుతి బలెనో ఒక బెస్ట్‌ కార్‌! అయితే, పెర్‌ఫెక్ట్‌ మాత్రం కాదు, ఈ లోపాలు కూడా ఉన్నాయి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget