అన్వేషించండి

Volkswagen Taigun Facelift 2026: ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ రీ-ఎంట్రీ – సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రానున్న మార్పులు ఇవే!

Volkswagen Taigun Facelift 2026: ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో 2026 మధ్యలో లాంచ్ కానుంది. తాజాగా ఈ కారు రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వోక్స్​వ్యాగన్​ టైగూన్​ ఫేస్​లిఫ్ట్​ 2026 మధ్యలో విడుదల కానుంది.
  • కొత్త టైగూన్​లో ఐ-షేప్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ స్ట్రిప్​తో ఫోక్స్​వ్యాగన్​ లోగో ఉన్నాయి.
  • కారులో మసాజర్​ సీట్లు, పనోరమిక్​ సన్​రూఫ్​ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.
  • 1.0 లీటర్​ ఇంజిన్​కు 8-స్పీడ్​ ఆటోమేటిక్​ గేర్​బాక్స్​ అదనంగా లభిస్తుంది.

Volkswagen Taigun Facelift 2026: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ 'టైగూన్' (Taigun) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. 2026 మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎరుపు రంగులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (LHD) టెస్ట్ మోడల్ రోడ్లపై కనిపిస్తూ ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ కొత్త వెర్షన్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్

పాత మోడల్‌లో ఉన్న రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్ స్థానంలో ఇప్పుడు కర్వీగా ఉండే ఐ-షేప్ (Eye-shaped) యూనిట్లు వచ్చాయి. పైన ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఇప్పుడు మరింత మందంగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రిల్ సెక్షన్‌లో ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో పాటు వెలుగులీనే ఫోక్స్‌వ్యాగన్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బంపర్ డిజైన్‌ను కూడా మార్చారు. పాత మెష్ స్ట్రక్చర్‌కు బదులుగా హారిజాంటల్ స్లాట్లను చేర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్తగా బ్లాక్ ఫినిషింగ్ ఉన్న అలాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. వెనుక వైపు టెయిల్ లైట్లు ఇప్పుడు మరింత పెద్దవిగా మారి, ఒక ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. వెనుక బంపర్ కూడా ఇప్పుడు స్మూత్ ఫినిషింగ్‌తో లగ్జరీగా కనిపిస్తోంది.

హైటెక్ ఇంటీరియర్, ఫీచర్లు

లోపలి భాగంలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంటి అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. వెనుక సీట్లలో మసాజర్ సౌకర్యం, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. గూగుల్ సపోర్ట్‌తో పనిచేసే ఏఐ (AI) కంపానియన్ యాప్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.

కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

మెకానికల్ పరంగా చూస్తే, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు ఇప్పుడు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేస్తున్నారు. ఇది పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను రీప్లేస్ చేయనుంది. 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ అలాగే కొనసాగుతుంది. ఇక పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 PS శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డీఎస్‌జీ (DSG) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మార్కెట్లోకి వస్తే ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

Volkswagen Taigun Facelift 2026 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

Volkswagen Taigun Facelift 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

కొత్త Taigun Facelift లో ఎక్స్‌టీరియర్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్ స్థానంలో కర్వీ ఐ-షేప్ యూనిట్లు, ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో వెలుగులీనే లోగో, కొత్త బంపర్ డిజైన్, పెద్ద టెయిల్ లైట్లు వంటి మార్పులు ఉన్నాయి.

Taigun Facelift ఇంటీరియర్‌లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి?

వెనుక సీట్లలో మసాజర్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, AI కంపానియన్ యాప్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.

కొత్త Taigun Facelift లో గేర్‌బాక్స్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ కొనసాగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

కైలాక్‌ నుంచి కొడియాక్‌ వరకు బాదుడు.. స్కోడా కార్ల ధరలు రూ.20,000 వరకు పెంపు
కొత్త కారు కొనేవాళ్లకు షాక్‌.. మరో రూ.20,000 వరకు జేబుకు చిల్లు పెట్టిన స్కోడా!
Best Bikes Under Rs 1 Lakh: తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్‌ఫుల్, మైలేజ్‌లో బెస్ట్
తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్‌ఫుల్, మైలేజ్‌లో బెస్ట్
Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!
Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
Don't Trouble The Trouble First Review: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఫస్ట్ రివ్యూ... ఫహాద్ ఫాజిల్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఫస్ట్ రివ్యూ... ఫహాద్ ఫాజిల్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Embed widget