అన్వేషించండి

Vinfast Limo Green: త్వరలో భారత మార్కెట్లోకి 7 సీటర్ ఎలక్ట్రిక్ ఈవీ విన్‌పాస్ట్ లిమో గ్రీన్.. ఫీచర్లు, ధర అంచనా

Vinfast Limo Green 7 Seater: భారత మార్కెట్లో ఒక కొత్త, భారీ ఎలక్ట్రిక్ MPV విడుదలకు సిద్ధంగా ఉంది. విన్‌ఫాస్ట్ ఈ ఈవీలో ఆకట్టుకునే రేంజ్, పవర్‌ఫుల్ పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు అందించనుంది.

భారత్‌లో తన కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV లిమో గ్రీన్ (Limo Green)ను లాంచ్ చేయడానికి విన్‌ఫాస్ట్ (Vinfast) సిద్ధంగా ఉంది. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ అనేది వియత్నాంలోని ప్రముఖ ఆటో మేకర్ కంపెనీలలో ఒకటని తెలిసిందే. భారత మార్కెట్లో తమ ప్రొడక్ట్ లైన్‌ను విస్తరించుకోనున్నామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మరో కొత్త వాహనం తీసుకురావడం ఆ దిశగా కీలక అడుగు. ఇప్పటివరకు విన్‌ఫాస్ట్ వద్ద కేవలం SUV సెగ్మెంట్‌లో మాత్రమే ఆప్షన్లు ఉండగా, లిమో గ్రీన్ రాకతో కంపెనీ MPV సెగ్మెంట్‌లో కూడా తమ స్థానాన్నిమెరుగు చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీ కార్ కావాలనుకునే, అదే సమయంలో ఎలక్ట్రిక్ ఆప్షన్ కోరుకునే వారి కోసం ఈ వాహనాన్ని మార్కెట్లోకి తేనున్నారు. 

ఈ లిమో గ్రీన్ MPV కియా కారెన్స్ క్లావిస్ EV (Kia Carens Clavis EV) వంటి వాహనాలతో పోటీ పడనుంది. డిజైన్ విషయానికి వస్తే, లిమో గ్రీన్ లుక్ చాలా మోడ్రన్‌గా, స్లీక్‌గా ఉంటుంది. ఇందులో విన్‌ఫాస్ట్ ప్రత్యేకమైన డిజైన్ శైలి కనిపిస్తుంది. కానీ ఇది వారి పాత మోడళ్ల కంటే కొంచెం భిన్నంగా, కొత్తగా ఉంటుంది. దీని పొడవు 4740 mm, వీల్‌బేస్ 2840 mm. దాంతో ఇందులో ఎక్కువ స్పేస్ లభించే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్, పెర్ఫార్మెన్స్
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ లో సుమారు 60kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంది, ఇది ఎక్కువ దూరం ప్రయాణించడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ దాదాపు 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని విన్‌ఫాస్ట్ కంపెనీ పేర్కొంది. ఇది రోజువారీ జర్నీకి, లాంగ్ జర్నీలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఇస్తారు. ఇది సుమారు 200bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-సీటర్ వాహనం చాలా పవర్‌ఫుల్ అని దీనివల్ల డ్రైవింగ్ చేసే వారికి చికాకు లేని స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వొచ్చు. 

ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో 11kW AC ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఇది 80kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఈ వాహనం కేవలం 30 నిమిషాల్లో 10 శాతం నుండి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్  ఉపయోగకరంగా ఉంటుంది.

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

ఫీచర్ల విషయానిక వస్తే ఈ MPV చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది. ఇందులో 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. లిమో గ్రీన్‌లో కంట్రోల్ మొత్తం డిజిటల్‌గా ఉంటుంది. ఫిజికల్ బటన్లు తక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఇందులో అనేక స్మార్ట్, కనెక్టెడ్ ఫీచర్లు కూడా లభిస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ మరింత సులభంగా, స్మూత్‌గా మారుతుంది.

లిమో గ్రీన్ అంచనా ధర
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ప్రారంభ ధర సుమారు 16 నుండి 17 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంది. ఒకవేళ కంపెనీ ఈ ధరకే లాంచ్ చేస్తే, భారత మార్కెట్లో ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget