అన్వేషించండి

రూ.1.11 లక్షలకే Vida VX2 Go 3.4kWh ఎలక్ట్రిక్‌ స్కూటర్‌: కొనే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 7 కీలక విషయాలు

Vida VX2 Go 3.4kWh ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో పవర్‌, రేంజ్‌, ఛార్జింగ్‌, ఫీచర్లు, Battery-as-a-Service ప్లాన్‌, హైదరాబాద్‌, విజయవాడ ఆన్‌రోడ్‌ ధరలతో కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విషయాలు.

Vida VX2 Go Electric Scooter Price And Features: పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో, నగర ప్రయాణాలకు సరిపోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో, హీరో మోటోకార్ప్‌ తీసుకొచ్చిన Vida VX2 Go 3.4kWh మోడల్‌ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ధర అందుబాటులో ఉండటంతో పాటు, కావలసినంత రేంజ్‌, నమ్మకమైన బ్రాండ్‌ కావడం దీనికి ప్లస్‌ పాయింట్లు. అయితే కొనుగోలు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం.

VX2 Go ఎంత పవర్‌ఫుల్‌?

Vida VX2 Go 3.4kWh స్కూటర్‌లో పర్మనెంట్‌ మాగ్నెట్‌ సింక్రోనస్‌ మోటార్‌ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6kW పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. 

0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఇది 4.2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. Plus వేరియంట్‌తో పోలిస్తే టాప్‌ స్పీడ్‌ 10 కిలోమీటర్లు తక్కువగా ఉంటుంది.

బ్యాటరీ & రేంజ్‌ ఎంత?

ఈ స్కూటర్‌లో 3.4kWh రిమూవబుల్‌ బ్యాటరీ ఇస్తున్నారు. కంపెనీ ప్రకటించిన ప్రకారం, ఇది IDC ప్రమాణాల ప్రకారం 142 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది.

తక్కువ ధరలో కొనాలనుకునే వారికి 2.2kWh బ్యాటరీ ఆప్షన్‌ కూడా ఉంది. ఈ బ్యాటరీతో 92 కిలోమీటర్ల IDC రేంజ్‌ లభిస్తుంది. రోజూ ఆఫీస్‌, కాలేజ్‌ ప్రయాణాలకు ఇది సరిపోతుంది.

ఛార్జింగ్‌ సమయం ఎంత పడుతుంది?

VX2 Go, Plus వేరియంట్‌ రెండింట్లోనూ ఒకేలాంటి బ్యాటరీ ఉండటంతో ఛార్జింగ్‌ టైమ్‌ కూడా ఒకేలా ఉంటుంది.

580W ఛార్జర్‌తో 0 నుంచి 80% ఛార్జ్‌ అవ్వడానికి 4 గంటలు 13 నిమిషాలు;

పూర్తి ఛార్జ్‌ (0-100%) ఛార్జ్‌ అవ్వడానికి 5 గంటలు 39 నిమిషాలు పడుతుంది.

ఇంట్లో ఉన్న ప్లగ్‌ పాయింట్‌తో ఛార్జ్‌ చేసుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

VX2 Plus‌తో పోలిస్తే VX2 Go వేరియంట్‌ ఏం మిస్‌ అవుతుంది?

VX2 Goలో LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ మాత్రమే ఇస్తారు. VX2 Plus వేరియంట్‌లో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది.

రైడింగ్‌ మోడ్‌ల విషయానికి వస్తే VX2 Goలో Eco, Ride మోడ్‌లు మాత్రమే ఉన్నాయి. VX2 Plusలో అదనంగా Sport మోడ్‌ కూడా ఉంటుంది.

బ్రేకింగ్‌ సిస్టమ్‌లో VX2 Goకు ఫ్రంట్‌ డ్రమ్‌ బ్రేక్‌, VX2 Plusకు ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ అందిస్తారు. అలాగే VX2 Plus టాప్‌ స్పీడ్‌ గంటకు 80 కిలోమీటర్లు ఉంటుంది.

Battery-as-a-Service (BaaS) ప్లాన్‌ అంటే ఏమిటి?

Vida అందిస్తున్న Battery-as-a-Service ప్లాన్‌ ద్వారా స్కూటర్‌ను తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ ప్లాన్‌లో నెలవారీ చెల్లింపులు చేస్తారు. ప్లాన్‌ ముగిసిన తర్వాత స్కూటర్‌తో పాటు బ్యాటరీ పూర్తిగా మీదే అవుతుంది.

2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొత్తం ఖర్చు లెక్క వేస్తే, సాధారణ కొనుగోలుతో పోలిస్తే BaaS ప్లాన్‌ కొంచెం ఖరీదైనదే.

కలర్‌ ఆప్షన్లు

Vida VX2 Go స్కూటర్‌ పసుపు, ఎరుపు, నీలం, తెలుపు, నలుపు, బూడిద రంగుల్లో లభిస్తుంది. Plus వేరియంట్‌లో ఉన్న ఆరెంజ్‌ కలర్‌ మాత్రం Goలో లేదు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర & తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధరలు

Vida VX2 Go (3.4kWh) ధర

రూ. 1,10,990 (ఎక్స్‌-షోరూమ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ)

Battery-as-a-Service ప్లాన్‌ తీసుకుంటే ప్రారంభ ధర రూ.60,000 నుంచి ఉంటుంది.

సబ్సిడీలు పోను హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర: సుమారు రూ. 1,10,305

సబ్సిడీలు పోను విజయవాడలో ఆన్‌రోడ్‌ ధర: సుమారు రూ. 1,10,705

మొత్తం మీద... నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కావాలనుకునే వారికి Vida VX2 Go 3.4kWh మంచి ఎంపికగా నిలుస్తుంది. కొనే ముందు, మీ అవసరాలకు ఏ బ్యాటరీ సరిపోతుందో మాత్రం ఒకసారి ఆలోచించుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget