అన్వేషించండి

వెంటిలేషన్, సేఫ్టీ రెండూ కావాలంటే సరైన రైడింగ్‌ జాకెట్ ఇదే కావచ్చు! Viper Air V4 రివ్యూ

Alpinestars Viper Air V4 జాకెట్‌ భారత వాతావరణానికి ఎంతవరకు సరిపోతుంది? మెరుగైన వెంటిలేషన్‌, ఫిట్‌, CE ఆర్మర్‌, ధర, లాభాలు, లోపాలు అన్నీ ఈ డీటెయిల్డ్‌ రివ్యూలో తెలుసుకోండి.

Alpinestars Viper Air V4 Review: భారతదేశంలో బైక్ రైడింగ్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, వాతావరణం, భద్రత, కంఫర్ట్‌ అన్నీ కీలకం. ముఖ్యంగా వేసవిలో రైడింగ్ జాకెట్ ఎంచుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్ Alpinestars నుంచి వచ్చిన Viper Air V4 జాకెట్ భారత రైడర్లకు ఎంతవరకూ సరిపోతుందో అర్ధం చేసుకుందాం.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Viper Air V3కి ఇది ప్రత్యామ్నాయం. రెండు సంవత్సరాల పాటు పాత మోడల్‌ను ఉపయోగించిన అనుభవంతో చూస్తే, Viper Air V4లో స్పష్టమైన మెరుగుదలలు కనిపిస్తున్నాయి. మొదటగా, జాకెట్ తయారీలో ఉపయోగించిన మెటీరియల్‌ను Alpinestars పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది. కొత్త మోడల్‌లో 600D డ్యూరబుల్ ఫాబ్రిక్ వాడారు. ఇది బలంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలం మన్నికగా ఉంటుందని అనిపిస్తుంది.

వెంటిలేషన్‌ చాలా బాగుంది
వెంటిలేషన్ విషయంలో ఈ జాకెట్ నిజంగా మెప్పిస్తుంది. సాధారణంగా గాలి ప్రవాహం ఉండని చోట్ల కూడా లేజర్‌తో కట్ చేసిన చిన్న రంధ్రాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. చేతులు, సైడ్స్‌, ఛాతీ భాగంలో పెద్ద మెష్ ప్యానెల్స్ ఉండటం వల్ల గాలి ప్రవాహం చాలా బాగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని వేడి వాతావరంలో ఇది పెద్ద ప్లస్ పాయింట్‌.

ఫిట్ విషయానికి వస్తే, ముందుభాగం పొడవును కొద్దిగా తగ్గించారు. నిలబడినప్పుడు కొంచెం చిన్నగా అనిపించినా, బైక్‌పై కూర్చున్నప్పుడు పొట్ట దగ్గర ఫాబ్రిక్ ముడుచుకోకుండా ఉంటుంది. దీనివల్ల స్పోర్టీగా, ఫిట్‌గా కనిపిస్తుంది. అయితే, ఈ జాకెట్ ఫిట్ కొంచెం సన్నగా ఉంటుంది. కాస్త బరువు ఎక్కువగా ఉన్న రైడర్లు ఒక సైజ్ పెద్దదాన్ని ఎంచుకుంటే బాగుంటుంది.

పాత మోడల్‌లో స్లీవ్స్ చిన్నగా ఉన్నాయనే ఫిర్యాదు ఉండేది. Viper Air V4లో ఇది కొంతవరకూ మెరుగైంది. అయినా, పొడవైన రైడర్లకు ఇంకా కొంచెం ఎక్కువ పొడవు ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. జేబుల విషయంలో, జిప్ పుల్ ట్యాబ్స్ చిన్నగానే ఉన్నా, పాకెట్లు మాత్రం పెద్దగా మారాయి, గ్లోవ్స్ వేసుకున్నా ఉపయోగపడతాయి.

భద్రత విషయంలో కూడా నమ్మకం
సేఫ్టీ విషయంలో కూడా ఈ జాకెట్ నమ్మకం కలిగిస్తుంది. ఇందులో CE లెవల్‌ 1 షోల్డర్‌, ఎల్బో ఆర్మర్ స్టాండర్డ్‌గా వస్తాయి. అయితే, బ్యాక్‌, ఛెస్ట్ ఆర్మర్ వేరుగా కొనాలి. ఈ విషయంలో భారతీయ బ్రాండ్లు కొంచెం మెరుగైన వాల్యూ ఇస్తున్నాయి. అయితే, కొత్తగా ఛెస్ట్ ఆర్మర్ కోసం ప్రత్యేక పాకెట్లు ఇవ్వడం పెద్ద అప్‌గ్రేడ్‌. వాష్ చేసే సమయంలో ఆర్మర్ తీయడం ఇప్పుడు చాలా సులభం.

జాకెట్‌తో పాటు రిమూవబుల్ విండ్ లైనర్, వాటర్‌ప్రూఫ్ ఇంటర్నల్ పాకెట్ కూడా ఉన్నాయి. నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే ఈ జాకెట్, గత మోడళ్లతో పోలిస్తే మరింత స్పోర్టీ పొజిషనింగ్‌లో ఉంది.

ధర విషయానికి వస్తే, Alpinestars Viper Air V4 ధర రూ.27,600. ఇది ఖచ్చితంగా ప్రీమియం సెగ్మెంట్‌. అయితే, Dainese వంటి హైఎండ్ బ్రాండ్లతో పోలిస్తే ఇదీ అదే స్థాయిలో నిలుస్తుంది. దీర్ఘకాలం ఉపయోగించే రైడర్లకు, వేడి వాతావరణంలో కూడా కంఫర్ట్ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.

మొత్తం మీద, వేసవిలో ఎక్కువ రైడింగ్ చేసే, ప్రీమియం సేఫ్టీ గేర్ కోరుకునే రైడర్లకు Alpinestars Viper Air V4 ఒక బలమైన ఆప్షన్. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
అన్ని కార్లకూ పవర్ పెట్రోల్ అవసరమా? పూర్తి నిజం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్ - మీ కారుకు ఏది బెస్ట్? డబ్బు వృథా చేసుకోవద్దు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget