Tata Nexon Facelift Design: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా నెక్సాన్ డిజైన్ - లుక్ టీజ్ చేసిన కంపెనీ!
టాటా నెక్సాన్ 2023 ఫేస్ లిఫ్ట్ త్వరలో లాంచ్ కానుంది. దీని డిజైన్‌ను ఇప్పుడు టీజ్ చేశారు.
2023 Tata Nexon Facelift: టాటా ఉత్పత్తి చేస్తున్న కార్లలో నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. దాని సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కంపెనీ కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే నెల 14వ తేదీన అఫీషియల్‌గా లాంచ్ చేయనుంది. అయితే కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త నెక్సాన్ అధికారిక లాంచ్‌కు ముందే డీలర్ యార్డ్‌లకు చేరుకోవడం ప్రారంభించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొత్త స్పై షాట్‌లు కూడా కనిపించాయి.
కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 డిజైన్ ఇలా?
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కర్వ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందనుందని కొత్త లుక్‌ను బట్టి చెప్పవచ్చు. కర్వ్ కాన్సెప్ట్ లాగా కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, సన్నని డీఆర్ఎల్స్ పొందనుంది. ప్రస్తుత నెక్సాన్ కంటే చిన్న గ్రిల్ ఇందులో ఉంది. దీన్ని ఇతర ఎస్‌యూవీల్లో కూడా చూడవచ్చు. ఫలితంగా కొత్త నెక్సాన్ మిగిలిన కార్ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తుంది.
ప్రీమియం ఫీచర్ అయిన సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కూడా ఈ కారులో చూడవచ్చు. ఇదే ఫీచర్ కొత్త కియా సెల్టోస్‌లో కూడా అందించారు. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రజాదరణను పొందుతుంది. దీన్ని బట్టి చూస్తే కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర చాలా ప్రీమియం స్థాయిలో ఉండవచ్చు. డోర్లు లేదా సైడ్ వ్యూ కియా సెల్టోస్ తరహాలో ఉంటుందని అంచనా. అయితే అల్లాయ్ వీల్స్ కూడా చూడటానికి కొత్తవిగా ఉన్నాయి. వెనుక భాగంలో ఫుల్ విడ్త్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, సరికొత్త బంపర్ కూడా లభించనుంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 ఇంజిన్
కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్, కర్వ్ పెట్రోల్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఇంజన్‌ను అందించారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్ కంటే మరింత శక్తివంతమైన, మెరుగైన మైలేజీని ఆశించవచ్చు. లోపలి భాగంలో చూసినట్లుయితే కొత్త నెక్సాన్ చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది అత్యంత ఎక్కువ పోటీ ఉన్న విభాగంలో కంపెనీని టాప్ పొజిషన్‌లో ఉంచడానికి పని చేస్తుంది.
టాటా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కావడంతో, కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ ఈ సంవత్సరం అతిపెద్ద లాంచ్‌లలో ఒకటిగా ఉండనుంది. త్వరలోనే దీనికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావచ్చని భావిస్తున్నారు. దీని లాంచ్ ఈవెంట్ కూడా వచ్చే పండుగ సీజన్‌లో జరిగే అవకాశం ఉంది.
View this post on Instagram
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial