Upcoming Electric Cars: త్వరలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో మోస్ట్ అవైటెడ్ ఇవే - రాగానే డిమాండ్ మామూలుగా ఉండదు!
Most Awaited Electric Cars: ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని క్రేజీ ఎలక్ట్రిక్ కార్లను కంపెనీలు తీసుకువస్తున్నాయి.
Highly Anticipated Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా, ఎలక్ట్రిక్ కార్లకు భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ మూడు ఎలక్ట్రిక్ కార్లతో ముందుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా, స్కోడా, వోక్స్‌వ్యాగన్‌లతో సహా ఇతర ప్రధాన వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి.
మారుతి సుజుకి ఈవీఎక్స్ (Maruti Suzuki EVX)
మారుతి సుజుకి భారతదేశంలో ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు 2024 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి లాంచ్ కానుందని అంచనా. వినూత్నమైన బర్న్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన మారుతి ఈవీఎక్స్, ఎల్ఎఫ్‌పీ బ్లేడ్ సెల్‌తో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని వార్తలు వస్తున్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎక్స్‌టర్ ఈవీ (Hyundai Creta EV, Hyundai Exter EV)
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన క్రెటా, ఎక్స్‌టర్ మోడళ్లలో ఎలక్ట్రిక్ వేరియంట్‌లను సిద్ధం చేస్తోంది. ఇంజిన్ వివరాలు ఇంకా తెలియనప్పటికీ రెండు వాహనాలు టెస్టింగ్‌లో కనిపించాయి. కానీ ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కోనా ఈవీ తరహాలో... అందులో ఉన్న ఇంజిన్‌నే పొందే అవకాశం ఉంది.
టాటా పంచ్.ఈవీ, కర్వ్.ఈవీ, హారియర్.ఈవీ (Tata Punch EV, Tata Curvv EV, Tata Harrier EV)
టాటా మోటార్స్ పంచ్.ఈవీని 2023 చివరిలో, కర్వ్.ఈవీని 2024 ప్రారంభంలో లాంచ్ చేయనుంది. ఇది కాకుండా 2025లో హారియర్.ఈవీని కూడా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. టాటా ఇటీవలే జెన్ 1, జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా రాబోయే కొత్త ఈవీలు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ అందించనున్నాయని తెలుస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8, మహీంద్రా థార్.ఈ (Mahindra XUV.e8, Mahindra Thar.e)
ఎక్స్‌యూవీ700 ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన ఎక్స్‌యూవీ.ఈ8తో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవాలని మహీంద్రా & మహీంద్రా అనుకుంటోంది. ఈ మోడల్ ఇంగ్లో స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన మొదటి మోడల్, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. కంపెనీ థార్.ఈని కూడా సిద్ధం చేస్తోంది. అయితే ఇది రోడ్లపైకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.
హ్యుందాయ్ ఇటీవలే తన ప్రీమియం ఎస్‌యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను సరికొత్త డిజైన్‌తో పరిచయం చేసింది. హ్యుందాయ్ టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు కొత్త అప్‌డేటెడ్ తాజా మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలోకి రానుంది. అప్‌డేట్ చేసిన ఇంటీరియర్, ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు కాకుండా డిజైన్ పరంగా పెద్ద అప్‌డేట్‌లు ఏమీ కంపెనీ చేయలేదు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!