అన్వేషించండి

Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!

నవంబర్ 2026లో భారత్‌లో నాలుగు కార్లు విడుదల కానున్నాయి. Mercedes GLC Electric, Denza Z9 GT, Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్, Mini Cooper SE ప్రత్యేకతలు తెలుసుకోండి.

Car launches in November 2026: పండుగల సీజన్‌లో కొత్త కార్ల విడుదలతో సందడి చేసిన ఆటోమొబైల్ కంపెనీలు.. ఇప్పుడు ఏడాది చివరి దశకు చేరుకోవడంతో లాంచ్‌ల వేగాన్ని తగ్గిస్తున్నాయి. అక్టోబర్‌లో తొమ్మిదికి పైగా ముఖ్యమైన కార్లు మార్కెట్లోకి రాగా, నవంబర్‌లో మాత్రం నాలుగు కొత్త మోడళ్లు మాత్రమే లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు, ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారుగా నిలిచే అవకాశం ఉన్న మోడల్ కూడా ఉంది. వీటిలో ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత.

 1. Mercedes-Benz GLC Electric

లాంచ్ తేదీ: నవంబర్ 4

Mercedes-Benz ఇండియా ఎలక్ట్రిక్ SUV లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా GLC Electric రానుంది. భారత్‌లో ఇది 400 4Matic వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుంది.

ఈ SUVలో 94kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది WLTP ప్రకారం 715km రేంజ్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి 490hp పవర్, 800Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. 2-speed గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది. దీంతో ఈ కారు 0-100kph వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో చేరుకోగలదు.

330kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 300km రేంజ్‌ను తిరిగి పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ కారులో 39.1-అంగుళాల Hyperscreen ట్రిపుల్ డిస్‌ప్లే సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వైర్‌లెస్ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, పారదర్శకతను మార్చుకునే పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఓవర్‌ ది ఎయిర్‌‍‌ అప్‌డేట్స్, Burmester 4D సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ADAS, AI అసిస్టెంట్, హీటింగ్ & మసాజ్ ఫంక్షన్లతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందించనున్నారు. దీని ధర రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్‌లో క్లచ్ బాధ వద్దు.. రూ.6 లక్షల్లో వచ్చే ఈ 6 సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కార్లను పరిశీలించండి

 2. Denza Z9 GT

లాంచ్ తేదీ: నవంబర్ 13

BYD తన లగ్జరీ కార్ల బ్రాండ్ Denzaను భారత్‌లో పరిచయం చేయనుంది. ఈ బ్రాండ్ నుంచి తొలి మోడల్‌గా Z9 GT షూటింగ్ బ్రేక్ విడుదల కానుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ తరహా షూటింగ్ బ్రేక్ మోడల్ మరొకటి లేదు.

Denza Z9 GTలో 122.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది WLTP ప్రకారం 600km రేంజ్ అందిస్తుంది. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి 1,156hp పవర్, 1,210Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా 0-100kph వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.

BYD ఫ్లాష్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో 1,500kW DC ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. ఈ ఛార్జింగ్ సామర్థ్యంతో బ్యాటరీని 10 నుంచి 97 శాతానికి కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది.

ఇంటీరియర్‌లోనూ ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 20-స్పీకర్ Devialet సౌండ్ సిస్టమ్, ఐదు డిస్‌ప్లేలు, లెదర్ సీట్లు, మూడు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు ఇందులో ఉంటాయి. బయట కెమెరాల ఫీడ్‌ను చూపించే రెండు డిస్‌ప్లేలు సంప్రదాయ ORVMల స్థానంలో పనిచేస్తాయి.

ఇవే కాకుండా హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో పవర్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, సాఫ్ట్ క్లోజ్ ఫంక్షన్‌తో పవర్ డోర్లు, కో-డ్రైవర్ సీటుకు Boss Mode, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.

 3. Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్

లాంచ్ తేదీ: నవంబర్ 25

మార్కెట్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో Toyota తన పాపులర్ MPV Innova Hycrossకు ఫేస్‌లిఫ్ట్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. నవంబర్‌లో ఈ కొత్త వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ మోడల్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం 'ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ'. భారత్‌లో లాంచ్‌ అయ్యే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారుగా Innova Hycross ఫేస్‌లిఫ్ట్ నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుత 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఇంజిన్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందులో ఏ ఇథనాల్ మిశ్రమాలకు సపోర్ట్ ఉంటుందన్నది ఇంకా స్పష్టత లేదు. తక్కువ వేరియంట్లలోని నాన్-హైబ్రిడ్ 2.0-లీటర్ ఇంజిన్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ సపోర్ట్ పొందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

డిజైన్ పరంగా ముందు భాగంలో కొత్త గ్రిల్, మరింత షార్ప్‌గా కనిపించే హెడ్‌ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు వెనుక భాగంలోనూ స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్, కొత్త సీట్ అప్‌హోల్‌స్టరీ, కొత్త కలర్ ఆప్షన్లు ఆశించవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

ఇది కూడా చదవండి: తక్కువ సీట్ హైట్, తక్కువ బరువుతో వచ్చే 5 స్కూటర్లు... హైట్‌ తక్కువ ఉన్నవాళ్ల కోసం టాప్ ఆప్షన్లు!

 4. రెండో తరం Mini Cooper SE & Paul Smith Edition

లాంచ్ తేదీ: నవంబర్ 27

2023లో అంతర్జాతీయంగా పరిచయమైన రెండో తరం Mini Cooper SE ఈ నెలలో భారత మార్కెట్లోకి రానుంది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో పలు డిజైన్ మార్పులు చేశారు.

కొత్త హెడ్‌ల్యాంప్స్, ఆక్టాగనల్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు, మరింత షార్ప్‌గా కనిపించే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచారు. కొత్త మోడల్‌లో 54.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనికి ముందు భాగంలో అమర్చిన ఒక ఎలక్ట్రిక్ మోటార్ శక్తినిస్తుంది. ఈ మోటార్ 218hp పవర్, 330Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Mini ప్రకారం, ఈ కారు 0-100kph వేగాన్ని 6.7 సెకన్లలో చేరుకుంటుంది. WLTP ప్రకారం 402km రేంజ్ అందిస్తుంది. 11kW AC, 95kW DC ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 95kW DC ఛార్జర్‌తో బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 30 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.

స్టాండర్డ్ మోడల్‌తో పాటు ప్రత్యేక పాల్‌ స్మిత్‌ ఎడిషన్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ పాల్‌ స్మిత్‌తో కలిసి ఈ ప్రత్యేక ఎడిషన్‌ను అభివృద్ధి చేశారు.

ఇంటీరియర్‌లో ‘Hello’ లైట్ ప్రొజెక్షన్, ఫ్లోర్ మ్యాట్‌పై ‘Rabbit’ గ్రాఫిక్స్, డోర్ సిల్స్‌పై ‘Every day is a new beginning’ అనే అక్షరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ప్రత్యేక బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అందిస్తారు.

ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత

నవంబర్‌లో లాంచ్‌ కానున్న నాలుగు మోడళ్లలో ఒక్కో కారు ఒక్కో ప్రత్యేకతతో వస్తోంది. Mercedes-Benz GLC Electric లగ్జరీ SUV విభాగంలో ఆసక్తి పెంచుతుండగా, Denza Z9 GT అధిక పవర్, వేగవంతమైన ఛార్జింగ్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ టెక్నాలజీపై ఆసక్తి నెలకొంది. ఇక Mini Cooper SE కొత్త డిజైన్, మెరుగైన బ్యాటరీతో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Automatic Second Hand Cars: ట్రాఫిక్‌లో క్లచ్ బాధ వద్దు.. రూ.6 లక్షల్లో వచ్చే ఈ 6 సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కార్లను పరిశీలించండి
సెకండ్‌ హ్యాండ్‌ ఆటోమేటిక్‌ కార్లు.. రూ.6 లక్షల బడ్జెట్‌లో 6 బెస్ట్‌ ఆప్షన్లు!
Lightweight Scooters: తక్కువ సీట్ హైట్, తక్కువ బరువుతో వచ్చే 5 స్కూటర్లు... హైట్‌ తక్కువ ఉన్నవాళ్ల కోసం టాప్ ఆప్షన్లు!
హైట్‌ తక్కువ ఉన్నవాళ్లు కూడా నడపగలిగే 5 లైట్‌ వెయిట్‌ స్కూటర్లు... రూ.90 వేల లోపే!
Electric Car Sound: అక్టోబర్ నుంచి ఎలక్ట్రిక్ కార్లకు తప్పనిసరిగా AVAS.. వేగం 20km కంటే తగ్గితే ప్రత్యేక సౌండ్ అలర్ట్
ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Cyclone Murasu: 22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Electric Car Sound: అక్టోబర్ నుంచి ఎలక్ట్రిక్ కార్లకు తప్పనిసరిగా AVAS.. వేగం 20km కంటే తగ్గితే ప్రత్యేక సౌండ్ అలర్ట్
ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
Cult First Weekend Collections : విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
Embed widget