అన్వేషించండి

టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు

టైర్ లోడ్ రేటింగ్ అంటే ఏమిటి? టైర్‌పై ఉండే 91, 94 XL వంటి మార్కింగ్‌ల అర్థం ఏంటి? ఎక్కువ లోడ్ రేటింగ్ ఉన్న టైర్లు వాడొచ్చా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tyre load rating: కారు టైర్‌పై ఉన్న అక్షరాలు & సంఖ్యలు చాలామంది పట్టించుకోరు. కానీ వాటిలోనే మీ వాహన భద్రతకు సంబంధించిన కీలక సమాచారం దాగి ఉంటుంది. ముఖ్యంగా టైర్‌పై కనిపించే 91, 94, 97 వంటి సంఖ్యలు టైర్‌ సీరియల్‌ నంబర్లు మాత్రం కాదు. వాటిని టైర్ లోడ్ రేటింగ్ లేదా లోడ్ ఇండెక్స్ అంటారు. ప్రతి కారు యజమాని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఇది.

టైర్ లోడ్ రేటింగ్ అంటే ఒక టైర్ గరిష్టంగా ఎంత బరువును సురక్షితంగా మోయగలదో తెలిపే సంఖ్య. ఈ సంఖ్యకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రత్యేక లోడ్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఆధారంగానే ఒక్కో సంఖ్యకు గరిష్ట బరువును నిర్ణయించడం జరిగింది.

మీ కారు టైర్ సైడ్‌వాల్‌పై 205/55 R17 91V వంటి కోడ్ కనిపించింది అనుకుందాం. ఇందులో 205 అంటే టైర్ వెడల్పు ‍‌(205 mm), 55 అంటే టైర్ ఎత్తు నిష్పత్తి, R17 అంటే 17 అంగుళాల (17”) రిమ్‌కు సరిపోయే టైర్. చివర్లో ఉండే 91 అనేది టైర్ లోడ్ రేటింగ్ కాగా, V అనేది స్పీడ్ రేటింగ్‌ను సూచిస్తుంది.

ఉదాహరణకు 91 లోడ్ రేటింగ్ ఉన్న టైర్ సరైన గాలి ఒత్తిడితో గరిష్టంగా 615 కిలోల బరువును మోయగలదు.

లోడ్ ఇండెక్స్ టేబుల్‌

 
లోడ్ ఇండెక్స్ ఒక్కో టైరుపై భారం (కేజీల్లో) లోడ్ ఇండెక్స్ ఒక్కో టైరుపై భారం (కేజీల్లో) లోడ్ ఇండెక్స్ ఒక్కో టైరుపై భారం (కేజీల్లో)
70 335 87 545 104 900
71 345 88 560 105 925
72 355 89 580 106 950
73 365 90 600 107 975
74 375 91 615 108 1000
75 387 92 630 109 1030
76 400 93 650 110 1060
77 412 94 670 111 1090
79 437 96 710 113 1150
80 450 97 730 114 1180
81 462 98 750 115 1215
82 475 99 775 116 1250
83 487 100 800 117 1285
84 500 101 825 118 1320
85 515 102 850 119 1360
86 530 103 875 120 1400

కొన్ని టైర్లపై XL అనే గుర్తు కూడా కనిపిస్తుంది. XL అంటే ఎక్స్‌ట్రా లోడ్‌ (Extra Load). అంటే, ఈ టైర్‌ సైజులోనే ఉన్న సాధారణ టైర్‌తో పోలిస్తే ఈ టైర్‌ను మరింత బలంగా తయారు చేస్తారు. దీంతో ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఉంటుంది.

ఉదాహరణకు 205/55 R16 94V XL టైర్‌ను తీసుకుంటే, ఇది, అదే సైజులోని సాధారణ టైర్ కంటే ఎక్కువ లోడ్‌ను భరించగలదు. 91 లోడ్ రేటింగ్ ఉన్న టైర్ 615 కిలోల వరకు మోయగలిగితే, 94 XL టైర్ గరిష్టంగా 650 కిలోల వరకు లోడ్‌ను భరించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

ఎక్కువ లోడ్ టైర్లను వాడొచ్చా?
అయితే చాలా మందికి వచ్చే సందేహం ఒకటే. కంపెనీ సూచించిన దానికంటే ఎక్కువ లోడ్ రేటింగ్ ఉన్న టైర్లను వాడొచ్చా? దీనికి సమాధానం అవును. ఎక్కువ లోడ్ రేటింగ్ ఉన్న టైర్లను వాహనానికి అమర్చుకోవచ్చు. ఎందుకంటే వాటిని ఎక్కువ బరువును భరించేలా తయారు చేస్తారు. అయితే, దీని అర్థం మీ కారులో ఎక్కువ బరువు తీసుకెళ్లొచ్చని కాదు. ఎందుకంటే ప్రతి వాహనానికి తయారీ సంస్థ నిర్ణయించిన గరిష్ట యాక్సిల్ లోడ్ పరిమితి ఉంటుంది. టైర్ సామర్థ్యం ఎక్కువగా ఉన్నా, వాహనం అనుమతించే పరిమితిని మించకూడదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఒకే సైజులో ఉన్న అన్ని టైర్లకూ ఒకే లోడ్ రేటింగ్ ఉండదు. ఒకే సైజులో వేర్వేరు లోడ్ ఇండెక్స్ & స్పీడ్ రేటింగ్‌లు ఉంటాయి. కాబట్టి కొత్త టైర్లు కొనుగోలు చేసే సమయంలో కేవలం సైజ్ మాత్రమే కాదు, లోడ్ రేటింగ్ & స్పీడ్ రేటింగ్ కూడా తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇది కూడా చదవండి: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

మీ కారు తయారీ సంస్థ సూచించిన టైర్ వివరాలు డ్రైవర్ డోర్‌పై ఉన్న స్టిక్కర్‌లో లేదా ఓనర్స్ మాన్యువల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త టైర్లు కొనుగోలు చేసే ముందు వాటిని ఒకసారి పరిశీలించడం మంచిది.

చిన్న సంఖ్యలా కనిపించే టైర్ లోడ్ రేటింగ్... వాస్తవానికి మీ ప్రయాణ భద్రత, టైర్ పనితీరు & వాహనం స్థిరత్వాన్ని నిర్ణయించే కీలక అంశం. కాబట్టి ఈసారి టైర్లు మార్చే ముందు లోడ్ రేటింగ్‌ను తప్పకుండా చెక్ చేయండి. అదే మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే తెలివైన నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget