అన్వేషించండి

కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320

టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ భారత్‌లో రూ.95,320 ధరకు లాంచ్‌ అయింది. కొత్త మార్వెల్‌ థీమ్‌, స్పెక్ట్రల్‌ గ్రీన్‌ పెయింట్‌, కనెక్టెడ్‌ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

TVS Raider 125 Doctor Doom Edition: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌, తన పాపులర్‌ కమ్యూటర్‌ బైక్‌ రైడర్‌ 125 లో మరో ప్రత్యేక వెర్షన్‌ను పరిచయం చేసింది. మార్వెల్‌ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందించిన కొత్త డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.95,320గా నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌ బైక్‌ల మాదిరిగానే ఈ మోడల్‌కు కూడా ప్రత్యేక మార్వెల్‌ థీమ్‌ను అందించారు. అయితే డిజైన్‌లో మాత్రమే మార్పులు ఉండగా, ఇంజిన్‌ & ఇతర మెకానికల్‌ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

మల్టీ టోన్‌ ఫినిష్‌
కొత్త టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా స్పెక్ట్రల్‌ గ్రీన్‌ పెయింట్‌ స్కీమ్‌ను అందించారు. ఇది సాధారణ గ్రీన్‌ రంగు కాకుండా కాంతి పడే కోణాన్ని బట్టి ఆకుపచ్చ నుంచి బ్రౌన్‌ రంగులోకి మారుతున్నట్లుగా కనిపించే మల్టీ టోన్‌ ఫినిష్‌తో రూపొందించారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌, సైడ్‌ ప్యానెల్స్‌పై డాక్టర్‌ డూమ్‌కు సంబంధించిన ప్రత్యేక గ్రాఫిక్స్‌ను జోడించారు. దీంతో ఈ బైక్‌కు మరింత స్పోర్టీ & ప్రీమియం లుక్‌ వచ్చింది.

టీవీఎస్‌ ఇప్పటికే ఐరన్‌ మాన్‌, బ్లాక్‌ పాంథర్‌, డెడ్‌పూల్‌, వుల్వరిన్‌ థీమ్‌లతో సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌లను విక్రయిస్తోంది. ఇప్పుడు డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ చేరడంతో ఈ శ్రేణి మరింత విస్తరించింది. మార్వెల్‌తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక పోర్ట్‌ఫోలియోకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించిందని కంపెనీ తెలిపింది. రైడర్‌ 125 & ఎన్‌టార్క్‌ స్కూటర్‌లలో అందుబాటులో ఉన్న సూపర్‌ స్క్వాడ్‌ శ్రేణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 5 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదైనట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

ఇంజిన్‌ 
ఈ కొత్త ఎడిషన్‌లో కూడా అదే 124.8సీసీ ఎయిర్‌ & ఆయిల్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌, మూడు వాల్వ్‌ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 11.4 హెచ్‌పీ పవర్‌ & 11.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలతో పాటు రోజువారీ వినియోగానికి అనువైన పనితీరును ఈ ఇంజిన్‌ అందిస్తుంది.

ఫీచర్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. కనెక్టెడ్‌ రివర్స్‌ LCD డిస్‌ప్లేతో పాటు 85కు పైగా కనెక్టెడ్‌ ఫంక్షన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే ఐగో అసిస్ట్‌ టెక్నాలజీ కూడా కొనసాగించారు. ఈ ఫీచర్ల ద్వారా రైడర్లకు మెరుగైన కనెక్టివిటీ & సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

ఇది కూడా చదవండి: 2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు

డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ ధర (రూ.95,320, ఎక్స్‌షోరూమ్‌), ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌ వేరియంట్ల ధరతో సమానంగా ఉంది. రాబోయే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్‌ అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ ప్రత్యేక ఎడిషన్‌ విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ప్రత్యేక డిజైన్‌ను ఇష్టపడే యువతతో పాటు మార్వెల్‌ అభిమానులను ఆకట్టుకునేలా ఈ కొత్త వెర్షన్‌ను టీవీఎస్‌ రూపొందించింది. దీంతో రైడర్‌ 125 అమ్మకాలకు మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget