British Bike: బ్రిటిష్ క్లాసిక్ 'నార్టన్' బైకులను ఇండియాలోకి తెస్తున్న TVS - ఇక దద్దరిల్లిపోద్దంతే!
Norton Electra Bike: టీవీఎస్ మోటార్, 2025 చివరి నాటికి భారతదేశంలో నార్టన్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయబోతోంది. అసలు ఈ ఎలక్ట్రా బైక్ ప్రత్యేకత ఏంటో మొదట తెలుసుకుందాం.

Norton Electra Bike In India: బ్రిటిష్ బైక్ తయారీ కంపెనీ 'నార్టన్ మోటార్ సైకిల్స్' (Norton Motorcycles) త్వరలో భారతదేశంలో అడుగు పెట్టబోతోంది. ఈ రాక వెనుక TVS Motor Company బలమైన పెట్టుబడి & వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. వాస్తవానికి, TVS, ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో నార్టన్ మొదటి మోటార్ సైకిల్ 'ఎలక్ట్రా' (Electra Bike)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌లు వస్తే, భారతదేశంలో ప్రీమియం & క్లాసిక్ బైక్ విభాగానికి కొత్త మెరుపు వస్తుంది.
'ఎలక్ట్రా'తో ప్రారంభం అవుతుంది
'ఎలక్ట్రా' అనేది క్లాసిక్ లుక్ & మోడర్న్ టెక్నాలజీలను అద్భుతంగా కలిపి తయారు చేసిన బైక్. TVS వెల్లడించిన ప్రకారం, ఈ బైక్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది & ఇప్పటికే ఉన్న ఏ మోడల్‌కు నేరుగా రీబ్రాండెడ్ వెర్షన్ కాదు. ఎలక్ట్రా బైక్‌ను ఈ సంవత్సరం చివరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టి ఆ తర్వాత భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి తెస్తారు.
నార్టన్ భారతదేశానికి రావడంలో ప్రత్యేకత ఏం ఉంది?
నార్టన్ మోటార్ సైకిల్స్ భారతదేశానికి రావడం నిజంగానే ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే, ఈ కంపెనీ ఇప్పుడు కొత్త విజన్ & వ్యూహంతో TVS Motor Company నాయకత్వంలో వస్తోంది. భారతీయ కస్టమర్లకు, ముఖ్యంగా యువతకు ప్రీమియం బ్రాండ్ అనుభూతితో పోటీ ధరకు క్లాసిక్ బ్రిటిష్ స్టైల్ మోటార్ సైకిళ్లు అందుబాటలోకి వస్తాయి. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో పాటు, ఇండియా-UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకుని CBU పన్నును తగ్గించాలని TVS యోచిస్తోంది. ఫలితంగా ఈ బైక్ ధరలు మరింత తగ్గుతాయి.
ఎలాంటి బైక్‌లు రావచ్చు?
TVS ఆలోచన కేవలం ఎలక్ట్రాకే పరిమితం కాలేదు, అంతకుమించి ఆలోచిస్తోంది. 2030 నాటికి నార్టన్ బ్రాండ్ కింద పూర్తిగా కొత్త రేంజ్‌ను తీసుకురావాలన్నది TVS వ్యూహంగా తెలుస్తోంది. ఈ బైక్‌లను భారతీయ & అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందిస్తోంది.
ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ధర ఎంత ఉంటుంది?
TVS మోటార్, ఈ మోటార్‌సైకిళ్లను Triumph & Royal Enfield వంటి కంపెనీల కంటే మరింత తక్కువ ధరకు (Norton Electra Bike Price In India) తయారు చేయాలనుకుంటోంది. ధర తగ్గినా నార్టన్ ప్రీమియం బ్రాండింగ్ అలాగే ఉంటుంది, ఇది ఈ బైక్‌లకు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు స్టైలిష్ అప్పీల్ ఇస్తుంది.
లాంచ్ టైమ్‌లైన్ ప్రకారం, మొదటి నార్టన్ బైక్ ఎలక్ట్రా లాంచ్ (Norton Electra Bike Launch Date In India), ప్రపంచవ్యాప్తంగా 2025 చివరి నాటికి జరుగుతుంది. భారతదేశంలో దీని అమ్మకాలు 2025 చివరి నెలల్లో లేదా 2026 ప్రారంభంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.




















