అన్వేషించండి

Bedroom In Car: కారును బెడ్‌రూమ్‌ చేసిన బీహార్‌ యువతి - పిచ్చి పీక్‌ స్టేజ్‌లో ఉన్నట్లుంది!

Mahindra XUV700 Safety Features: మహీంద్ర XUV700 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కారు. ఈ కారులో బిహార్‌ యువతి చేసిన బాధ్యతారహితమైన మార్పులు ప్రయాణీకుల జీవితాలను ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి.

Bedroom Setup In Mahindra XUV700: SUVలను మోడిఫై చేసి క్యాంపింగ్ వ్యాన్‌లుగా మార్చే ట్రెండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను యాక్సెప్ట్‌ చేసిన బీహార్‌కు చెందిన గాయని, తన మహీంద్రా XUV700ను బెడ్‌రూమ్‌గా మార్చింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

బిహార్‌ యువతి, Mahindra XUV700 SUV లోపల ఒక తాడుకు వేలాడుతున్న మెటల్ ఫ్రేమ్డ్ బెడ్‌ను అమర్చింది. ఒకవైపు కారు వేగంగా దూసుకుపోతుంటే ఆమె ఆ బెడ్‌ మీద పడుకుని పాట పాడుతోంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల మధ్య చర్చ కూడా ప్రారంభమైంది. ఇలాంటి మార్పులు ప్రయాణీకులకు ఎంత వరకు క్షేమమంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వైరల్ వీడియోలో ఏం ఉంది?
ఈ వీడియోను 'శివ్ చౌదరి అఫీషియల్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అందులో, ఒక గాయని, వేగంగా కదులుతున్న XUV700 కారులో మంచం మీద కూర్చుని పాట పాడుతూ కనిపిస్తుంది. SUVలోని రెండు సీట్లను మడతపెట్టి, వాటి పైన మెటల్ ఫ్రేమ్‌తో ఒక తాడు మంచం తయారు చేశారు.

ప్రమాదకరమైన ఫీట్‌
ఈ మంచాన్ని ఎటువంటి సేఫ్టీ బెల్టులు లేకుండా అమర్చారు. కదులుతున్న వాహనంలో ఎలాంటి రక్షణ లేకుండా పడుకోవడం లేదా కూర్చోవడం చాలా ప్రమాదకరం. XUV700 కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నప్పటికీ, ఇటువంటి బాధ్యతారహిత మార్పులతో ఆ భద్రత మొత్తం తుడిచిపెట్టుకు పోతుంది, ప్రయాణీకుల జీవితాలు ప్రమాదంలో పడతాయి.

కారులో ఇలాంటి మార్పులు చేయడం చట్టబద్ధమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది?. క్యాంపింగ్ వ్యాన్‌లలో కూడా బెడ్‌లు ఉంటాయి కాబట్టి, ఇలాంటి బెడ్‌ సెటప్‌లు తప్పుకాదని కొంతమంది వాదిస్తున్నారు. నిజానికి వాస్తవానికి తేడా ఏమిటంటే.. క్యాంపింగ్ వాహనాలకు ఫిక్స్‌డ్ బెడ్‌లు ఉంటాయి & వాహనం కదులుతున్నప్పుడు వాటిని ఉపయోగించరు. కానీ ఇక్కడ, వాహనం కదులుతున్నప్పుడు ఆ యువతి బెడ్‌ను ఉపయోగించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం & ప్రాణాంతకం.

మహీంద్రా XUV700లో లెవెల్‌ 2 ADAS ఫీచర్లు
మహీంద్రా XUV700 లో ఇలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తన గతంలోనూ కనిపించింది. కొంతమంది ADAS (లెవల్ 2 ఆటోమేటిక్ డ్రైవ్ సిస్టమ్)ను ట్యాంపరింగ్‌ చేసి డ్రైవర్ సీటు నుంచి దిగి వెనుక సీట్లో కూర్చోవడం, కార్డ్స్‌ ఆడటం, కదులుతున్న కారులో నిద్రపోవడం, తినడం, ఆటో డ్రైవింగ్‌ మోడ్‌లో పెట్టడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. నిజానికి... ADAS టెక్నాలజీ డ్రైవర్‌కు సహాయం చేయడానికి మాత్రమే వచ్చింది, ఇది డ్రైవర్‌కు ప్రత్నామ్యాయం కాదు. ఇటువంటి బాధ్యతారహిత ప్రవర్తన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తుల భద్రతకు కూడా పెద్ద ముప్పు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      

View this post on Instagram
 
A post shared by Shiva Choudhary (@shivachoudharyofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget