Budget-friendly Electric Cars: పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్ - ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లు మీ ఫ్యామిలీకి బెస్ట్, మీకు డబ్బు ఆదా
Affordable Electric Cars: తక్కువ ధరకే మెరుగైన రేంజ్ అందించే కార్లు భారతీయ మార్కెట్లో చాలా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

Top 3 Affordable Electric Cars In India: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ కాలక్రమేణా పెరుగుతోంది. ఆటో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్‌తో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రజలు, ఇప్పుడు, పెట్రోల్ & డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు బెటర్ ఆప్షన్‌గా చూస్తున్నారు. అయితే, ఏదైనా ఎలక్ట్రిక్ కారు కొనడానికి ముందు దాని పరిధితో పాటు ధర గురించి కూడా తెలుసుకోవాలి. తక్కువ ధరకు మెరుగైన రేంజ్ ఇచ్చే ఇలాంటి కార్లను ఎంచుకోవాలి, అలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ మార్కెట్లో చాలా ఉన్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో అమ్ముడవుతున్న టాప్-3 చవక ఎలక్ట్రిక్ కార్లు ఇవి..
టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
టాటా టియాగో EV అప్‌డేటెడ్ మోడల్ ఇటీవలే కొత్త ఇంటీరియర్‌తో లాంచ్ అయింది. ఈ కారు క్యాబిన్ చాలా అందంగా మారింది. టాటా టాటా టియాగో ఈవీలో 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు, పూర్తి ఛార్జింగ్‌తో ఇది 223 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మీరు కావాలనుకుంటే, ఈ కారులో 24 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది ఎంపికను కూడా కలిగి ఉంది, పూర్తి ఛార్జింగ్‌తో ఇది 293 కి.మీ. దూరం ప్రయాణించగలదు. టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర (Tata Tiago EV ex-showroom price) రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.14 లక్షల వరకు ఉంటుంది.
టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ EV ఒక చిన్న సైజు SUV అయినప్పటికీ ఈ కారులో మీకు మంచి స్పేస్ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారును జనరేషన్ 2 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. ఈ కారులోనూ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి - 25 kWh & 35 kWh. 25 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఈ కారు 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. 35 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తీసుకుంటే ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 421 కి.మీ. పరిధిని అందించగలదు. టాటా పంచ్ EV ఎక్స్-షోరూమ్ ధర (Tata Punch ex-showroom price) రూ. 11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
MG విండ్‌సోర్ (MG Windsor)
కొత్త MG విండ్‌సోర్ చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కనిపిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర (MG Windsor ex-showroom price) రూ. 14 లక్షల నుంచి రూ. 18.31 వరకు ఉంటుంది. ఈ కారులో అందుబాటులో ఉన్న స్పేస్ ఈ ధర పరిధిలో అద్భుతమైన సదుపాయం అనిపిస్తుంది. ఈ కారు వెనుక సీటులో అందుబాటులో ఉన్న రిక్లైన్ ఆప్షన్ ప్రయాణీకులకు కారు చాలా విశాలంగా ఉందన్న అనుభూతిని ఇస్తుంది. ఈ కంపెనీ, MG విండ్‌సోర్‌లో పెద్ద టచ్ స్క్రీన్ కూడా అందించింది. ఈ కారులో అమర్చిన 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ EV 332 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని MG మోటార్స్ పేర్కొంది.
ఇవి విద్యుత్ కార్లు కాబట్టి, పెట్రోల్ & డీజిల్‌కు అయినంత వ్యయం వీటికి ఉండదు. కాబట్టి, కారు నడిపిన ప్రతిసారీ మీరు కొంత డబ్బు ఆదా చేసినట్లే!.





















