అన్వేషించండి

Triumph Thruxton 400 EMI Guide: భారీగా తగ్గిన ట్రయంఫ్ త్రక్స్టన్ 400 ధర! కొనాల‌నుకుంటున్నారా..? ఈఎంఐ వివ‌రాలు ఇవిగో..

ట్రయంఫ్ త్రక్స్టన్ 400 ధర ఇండియాలో తగ్గింది. కొత్త 350 సీసీ ఇంజిన్ తో జీఎస్‌టీ బెనిఫిట్స్ లభించడమే దీనికి ప్రధాన కారణం. డౌన్ పేమేంట్, కాల వ్య‌వ‌ధిని బ‌ట్టి, పూర్తి ఈఎంఐ వివరాలు వివ‌రాలు తెలుసుకుందాం.

Triumph Thruxton 400 Latest Updates:  ప్రీమియం బైక్ కొనాలనుకునే వారికి ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఒక తీపి కబురు అందించింది. తన పాపులర్ మోడల్ ‘ట్రయంఫ్ త్రక్స్టన్ 400’ ధరను సవరించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2,65,538 కి చేరుకుంది. గతంలో కంటే ఈ ధర తక్కువ ఉండటం గమనార్హం. దీనికి కారణం ఈ బైక్‌లో చేసిన ఒక ఆసక్తికరమైన మార్పు. కంపెనీ ఇందులో కొత్తగా 350 సీసీ ఇంజిన్‌ను ప్రవేశపెట్టింది. మన దేశంలో 350 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్‌టీ (GST) రేటు కేవలం 18 శాతమే ఉంటుంది. గతంలో బజాజ్ డొమినార్ 400 తరహాలోనే, ఇప్పుడు ట్రయంఫ్ కూడా తక్కువ పన్ను పరిధిలోకి రావడంతో ఈ ధర తగ్గింపు సాధ్యమైంది. ఈఎంఐలో కొనాల‌నుకునేవారు ఈ కింది లెక్క‌లు చూడ‌వ‌చ్చు.

నెలవారీ ఈఎంఐ లెక్కలు:
ఒకవేళ మీరు ఈ బైక్‌ను ఫుల్ లోన్ (100% ఎక్స్‌షోరూమ్ ధర) పై తీసుకోవాలని అనుకుంటే, 9.5% వడ్డీ రేటుతో నెలవారీ ఈఎంఐలు ఎలా ఉంటాయో చూద్దాం:  

12 నెలల కాలపరిమితి:  మీరు ఒక సంవత్సరంలో లోన్ తీర్చాలనుకుంటే, ప్రతి నెలా రూ. 23,283 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం వడ్డీ రూ. 13,862 అవుతుంది.

24 నెలల కాలపరిమితి: రెండేళ్ల కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ భారం తగ్గి ఈఎంఐ రూ. 12,192 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 27,071 కట్టాలి.

36 నెలల కాలపరిమితి: మూడేళ్ల పాటు లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 8,506 కి చేరుతుంది. దీనివల్ల నెలవారీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం రూ. 40,677 ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 


ఇంజిన్ పవర్ - స్పీడ్ వివరాలు..
కొత్త ఇంజిన్ వచ్చినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ బైక్ 9,000 rpm వద్ద 41 bhp గరిష్ట పవర్, 7,500 rpm వద్ద 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే, కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరడానికి 7.5 సెకన్లు సరిపోతుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 161 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హుస్క్ వర్ణ స్వార్ట్‌పిలెన్ 401, హార్లే డేవిడ్సన్ X440 వంటి గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లో త్రక్స్టన్ 400 ఇప్పుడు మరింత బలమైన పోటీని ఇస్తోంది. ఈ బండి వినూత్నమైన మార్పుతో ఈ బైక్ మార్కెట్లో వినియోగ దారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. 

గొప్ప అవ‌కాశం..
బడ్జెట్ ధరలో లగ్జరీ రైడింగ్ అనుభవాన్ని కోరుకునే యువతకు ఈ ధర సవరణ ఒక గొప్ప అవకాశం. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, ఇప్పుడు తగ్గిన ధర కలిపి త్రక్స్టన్ 400ను ఒక బెస్ట్ డీల్‌గా మార్చాయి. మీరు కూడా మీ పాత బైకుని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈ ట్రయంఫ్ బైక్ ఒక మంచి ఆప్షన్ కావచ్చని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇంజిన్ సీసీ మార్పుతో జీ ఎస్టీ ప్రయోజనం కూడా కస్టమర్లకు కంపెనీ అందించిందని నిపుణలు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget