అన్వేషించండి

EV Battery: ఎడారిలో ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ డౌన్.. తెలివిగా ఆలోచించి పరిష్కారాన్ని కనిపెట్టిన డ్రైవర్

శాండ్రో వాన్ కుయిజ్క్ అనే ఒక యూట్యూబర్ అటకామా ఎడారిలో ప్రయాణిస్తుండగా కారు బ్యాటరీ అయిపోయింది. ఆ తర్వాత solar panels ఉపయోగించాడు.

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ వీటితో జర్నీ అంటే బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోననే టెన్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు అటవీ ప్రాంతం, ఎడారి వంటి నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రం అనిపిస్తుంది. ఇటీవల ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తుండగా మధ్య ఎడారిలో ఆగిపోయినప్పటికీ, తన తెలివితేటలతో ఆ కష్టం నుండి బయటపడే మార్గాన్ని గుర్తించాడు. 

శాండ్రో వాన్ కుయిజ్క్ అనే యూట్యూబర్ చిలీలోని అటాకామా ఎడారి (Atacama Desert) నుంచి ప్రయాణిస్తుండగా, అతని ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ అయిపోయింది. అతను సహాయం కోసం చాలా మందికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అంత దూరం కావడంతో ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. దిక్కుతోచని స్థితిలో యూట్యూబర్ అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడ్డాడు.

కారులో లభించే సౌకర్యాలు
చిలీలోని అటాకామా ఎడారిలో శాండ్రో కారు బ్యాటరీ ఒక్కసారిగా డెడ్ అయిపోయింది. అప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఆ యూట్యూబర్ సోలార్ ప్యానెల్స్‌ను వినియోగించాడు. శాండ్రో తన 'టెస్లా మోడల్ X' (Tesla Model X) కారులో కెనడా నుండి అర్జెంటీనా వరకు లాంగ్ ట్రిప్‌లో ఉన్నాడు. యూట్యూబర్ కుయిజ్క్ తన కారును ఒక చిన్న ఇల్లులా మార్చుకుని, అందులో బెడ్, కిచెన్, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని అతను కారులో ముందుగానే ఒక చిన్న సోలార్ ప్యానెల్‌ను కూడా సెట్ చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అదే అతడి సమస్యను పరిష్కరించింది.

తదుపరి ఛార్జింగ్ స్టేషన్ 42 కిలోమీటర్ల దూరంలో ఉండగా అతడు సమస్య గుర్తించాడు. కానీ అతని కారులో కేవలం 37 కిలోమీటర్ల వరకు సరిపోయే బ్యాటరీ మాత్రమే ఉంది. కొండ మార్గం, ఈదురు గాలుల కారణంగా బ్యాటరీ త్వరగా అయిపోయి, కారు దారి మధ్యలోనే ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అతడు సాయం కోసం స్నేహితులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. కానీ అతడి తరువాత జర్నీ చాలా ఆసక్తికరంగా సాగింది.

సోలార్ ప్యానెల్‌ ఉపయోగించిన యూట్యూబర్
అటువంటి క్లిష్ట సమయంలో శాండ్రో వాన్ కుయిజ్క్ తాను ముందుగానే సిద్ధం చేసుకున్న సోలార్ ప్యానెల్స్‌ ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు. రోడ్డు పక్కన సోలార్ ప్యానెల్స్ పరిచి కారును ఛార్జింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే ఈ ఛార్జింగ్ చాలా నెమ్మదిగా సాగింది. ఆ తర్వాత అతనికి రోడ్డుపై పనిచేస్తున్న కొందరు కనిపించారు. వారు తమ మెషీన్ సాయంతో  కారును ఛార్జింగ్ చేయడానికి సహాయం చేశారు. దీనివల్ల అతడి కారు బ్యాటరీకి మరికొంత విద్యుత్ లభించింది. చివరికి అతను తన కారును సమీపంలోని సిటీకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. శాండ్రో ఒక ట్రక్కు సహాయంతో కారును దగ్గరలోని సిటీకి తీసుకెళ్లాడు. ఈ మొత్తం జర్నీ, తనకు ఎదురైన అనుభవానికి సంబంధించిన వీడియోను శాండ్రో తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా షేర్ చేశాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget