అన్వేషించండి

Ola Sona Weekend: అక్షయ తృతీయ ధమాకా.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 50,000 వరకు బెనిఫిట్స్! 

ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా సోనా వీకెండ్' పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ. 50,000 వరకు ప్రయోజనాలతో పాటు 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ స్కూటర్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.

Ola Sona Weekend Massive Discounts and Gold-Plated Scooters: అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను మోసుకొచ్చింది. 'ఓలా సోనా వీకెండ్' (Ola Sona Weekend) పేరుతో కేవలం రెండు రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు తమ ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా రూ. 50,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్లు ఏప్రిల్ 18, 19 తేదీల్లో మాత్రమే వర్తిస్తాయి. కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, అదృష్టవంతులైన కస్టమర్లకు నిజమైన 24 క్యారెట్ల బంగారం పూత పూసిన 'ఓలా ఎస్1 ప్రో సోనా' ఎడిషన్ స్కూటర్ గెలుచుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది.

గోల్డ్ థీమ్ స్పెషల్ అట్రాక్షన్..
ఈ ప్రచారంలో హైలైట్ ఏంటంటే.. లిమిటెడ్ ఎడిషన్ ఓలా ఎస్1 ప్రో సోనా. ఇందులో స్కూటర్ బాడీ పార్ట్స్ పైన రియల్ గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. దీనికి తోడు ఓలా యాప్, మూవ్ ఓఎస్ (MoveOS) డాష్‌బోర్డ్ కూడా 'సోనా మూడ్' పేరుతో గోల్డెన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. పండుగ వేళ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓలా ఈ సరికొత్త ప్రయోగాన్ని చేస్తోంది.

ధరల తగ్గింపు వివరాలు..
ఈ సేల్‌లో భాగంగా ఓలా తన జెన్ 3 ఎస్1 ఎక్స్ (2 kWh), రోడ్‌స్టర్ ఎక్స్ (2.5 kWh) మోడళ్లను కేవలం రూ. 49,999 ప్రారంభ ధరకే ఆఫర్ చేస్తోంది. మరోవైపు భారీ రేంజ్ ఇచ్చే రోడ్‌స్టర్ ఎక్స్+ 9.1 kWh ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. దీని అసలు ధర రూ. 1,89,999 ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ. 1,39,999 కే లభిస్తోంది. అంటే ఏకంగా రూ. 50,000 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ బైక్ కొన్నవారికి 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఉచితంగా లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్లు - వారంటీ..
క్యాష్ డిస్కౌంట్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, యస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై అదనంగా రూ. 10,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. మొత్తం పోర్ట్‌ఫోలియోపై రూ. 40,000 వరకు నేరుగా తగ్గింపులు ఉన్నాయి. స్వదేశీ సాంకేతికతతో తయారైన '4680 భారత్ సెల్' (4680 Bharat Cell) వాడిన కొత్త ఎస్1 ఎక్స్+ 5.2 kWh స్కూటర్ కూడా రూ. 1,29,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. ఇది ఒక్క ఛార్జ్‌తో 320 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తక్కువ ధరలో మంచి రేంజ్ ఇచ్చే వెహికల్స్ కోసం చూసే వారికి ఈ రెండు రోజుల సేల్ ఒక చక్కటి అవకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget