ఈ కారు లాంచ్ అయితే పెట్రోల్ కార్లకు గండమే - ఎలక్ట్రిక్ మాత్రం కాదు!
మనదేశంలో మొట్టమొదటి ఫ్లెక్ ఫ్యూయల్ కారును టయోటా ఆవిష్కరించనుంది.
టయోటా భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించనుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారును రివీల్ చేయనున్నారు. ఇది లాంచ్ కాదు కానీ భారతదేశ రోడ్లపై ఈ టెక్నాలజీని పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్టుగా రన్ చేయనున్నారు. టయోటా నుండి వచ్చిన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుకు సంబంధించి ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు.
అయితే ఇది ప్రస్తుత లైనప్ నుంచి వచ్చినది కాకుండా పూర్తిగా కొత్త మోడల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఇంజన్ హైరైడర్‌లో కనిపించే టయోటా 1.5l పెట్రోల్ ఇంజన్ కావచ్చు. కానీ నాన్-హైబ్రిడ్ రూపంలో కనిపిస్తుంది. ఫ్లెక్స్-ఇంధన కార్ల ప్రయోజనాల గురించి నితిన్ గడ్కరీ చాలా కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. వాటిని అభివృద్ధి చేయాలని కార్ల తయారీదారులను కోరారు.
ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్ ప్రాథమికంగా ఇథనాల్‌తో పాటు పెట్రోల్‌లో ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో నడుస్తుంది. ఈ రకమైన ఇంజిన్ 100 శాతం పెట్రోల్ లేదా ఇథనాల్‌తో కూడా పని చేయగలదు. ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్లు బ్రెజిల్ వంటి ఇతర దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈ రకమైన ఇంజిన్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీని వినియోగం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు ప్యూర్ పెట్రోల్ నుంచి ఇథనాల్‌కు మారవచ్చు, అయితే ఇది స్వచ్ఛమైన ఇంధనం, స్వచ్ఛమైన పెట్రోల్ కంటే చాలా చౌకైనది. ఫ్లెక్స్-ఇంధనాల పనితీరు కూడా పెట్రోల్ ఇంజిన్‌ల మాదిరిగానే ఉంటుంది. సీఎన్‌జీ లాగా పెర్ఫార్మెన్స్ డౌన్ అవ్వదు.
ఇది ఉద్గారాలను తగ్గించడంతోపాటు పెట్రోల్/డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మోటరింగ్‌ను కూడా చౌకగా చేయడంలో సహాయపడుతుంది. ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్, సాధారణ పెట్రోల్ ఇంజిన్‌కు భిన్నమైనది కాదు. ఇంధన పంపు మొదలైన భాగాలకు చిన్న మార్పులతో ఉంటుంది. అయినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలు, వీటి నిబంధనల గురించి ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే వచ్చే ఏడాది నుంచి మనం మరికొంత మంది కార్ల తయారీదారుల నుంచి ఫ్లెక్స్-ఇంధన కార్లను ఆశించవచ్చు. ఇథనాల్ మిశ్రమ గ్యాసోలిన్ 2023 నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాలలో అందుబాటులోకి రానుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram