Toyota New SUV: పెట్రోల్ ఖాళీ అయినా 80km నడిచే టయోటా కొత్త హైబ్రిడ్ SUV - ఫీచర్లతో ఫీవర్ తెప్పిస్తోందిగా
Toyota New Hybrid SUV Rav4: టయోటా కొత్త RAV4 హైబ్రిడ్ SUVకి ఒక ప్రత్యేకత ఉంది. పెట్రోల్ లేకుండా కూడా ఇది 80 కి.మీ. వరకు మిమ్మల్ని తీసుకువెళుతుంది.

Toyota New Hybrid SUV Rav4 Price, Mileage And Features In Telugu: టయోటా, ప్రపంచ మార్కెట్లో కొత్త 6వ తరం RAV4 SUVని లాంచ్ చేసింది. స్టైలిష్ లుక్స్‌తో పాటు.. సాంకేతికత & శక్తి కలబోతగాస ఈ కార్ వచ్చింది. దీని లుక్ మినీ ఫార్చ్యూనర్ తరహాలో స్పోర్టీగా ఉంది, రోడ్డుపై వెళ్తుంటే అందరి కళ్లూ ఈ కార్‌పైనే ఉంటాయి.
షార్ప్ ఫ్రంట్ గ్రిల్ & స్ట్రాంగ్ బాడీ లైన్స్‌తో ఈ SUV చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కార్ క్యాబిన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి అడ్రస్‌లా ఉంటుంది. టయోటా తాజా అరీన్ సాఫ్ట్‌వేర్‌పై పని చేసే పెద్ద 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్‌లో క్యాబిన్‌లో బిగించారు. నావిగేషన్, మ్యూజిక్ & కనెక్టివిటీని ఈ సాఫ్ట్‌వేర్ మరింత మెరుగ్గా చేస్తుంది. 10.5 అంగుళాల మల్టీమీడియా డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా సూపర్ స్మార్ట్ ఫీచర్లను యాడ్ చేశారు.
పెట్రోల్ లేకుండా 80 కి.మీ. రన్నింగ్
కొత్త RAV4 SUV రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది, అవి - స్ట్రాంగ్ హైబ్రిడ్ & ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV). ఈ రెండూ 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కనెక్ట్ అవుతాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 236Hp పవర్‌ను జనరేట్ చేస్తుంది & PHEV వేరియంట్ 320Hp పవర్‌ను ఇస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం... PHEV మోడల్‌ను ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత, పెట్రోల్‌తో అవసరం లేకుండా ఎలక్ట్రిక్ మోడ్‌లో 80 కి.మీ.లు నడవగలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ & ఆల్-వీల్ డ్రైవ్ (AWD)లో ఈ బండిని కొనవచ్చు.
మైలేజ్‌లో మేటి
కంపెనీ ప్రకారం, టయోటా RAV4 దాదాపు 35 km మైలేజీ (Toyota RAV4 SUV mileage) ఇవ్వగలదు. ఈ కారు కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 km వేగాన్ని అందుకుంటుంది, హై-పెర్పార్మెన్స్ సెగ్మెంట్ కార్ అవుతుంది.
టయోటా RAV4 SUV సేఫ్టీ ఫీచర్లు
RAV4 SUVలో ప్రయాణీకుల భద్రత (Toyota Rav4 Safety Features) కోసం టయోటా అన్ని ఏర్పాట్లు చేసింది. టయోటాకు చెందిన అధునాతన భద్రత వ్యవస్థ "సేఫ్టీ సెన్స్ ADAS"ను అమర్చారు. ఇందులో.. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇంరా... 6 ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ కెమెరా & సీట్ బెల్ట్ వంటి కీలక విషయాలను కూడా యాడ్ చేశారు. స్పోర్టీ లుక్స్ ఇష్టపడేవాళ్ల కోసం Toyota RAV4 GR Sport వెర్షన్‌లోనూ ఈ SUV అందుబాటులోకి వచ్చింది.
టయోటా RAV4 SUV ధర
అమెరికా మార్కెట్‌లో టయోటా RAV4 SUV ప్రారంభ ధర (Toyota RAV4 SUV ex-showroom price) దాదాపు 30,645 డాలర్లు. భారతీయ రూపాయల్లో ఇది రూ.25.5 లక్షలు. టాప్ వేరియంట్ ధర $38,950 (దాదాపు రూ.32.5 లక్షలు). ఈ కార్ భారతదేశంలో ఇంకా లాంచ్ కాలేదు, త్వరలోనే మన రోడ్లపైకి రావచ్చు.





















