అన్వేషించండి

ఫుల్ ట్యాంక్ తో 1200 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. ఫ్యామిలీ జర్నీకి Toyota Innova Hycross సరిపోతుందా?

Toyota Innova Hycross Power: మార్కెట్లో ధరతో పాటు మైలేజీ, రేంజ్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. దాంతో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. కారు ఫీచర్లు, మైలేజీ చూస్తే వావ్ అంటారు.

భారత మార్కెట్‌లో టొయోటా ఇన్నోవా హైక్రాస్ అత్యుత్తమ లగ్జరీ MPV కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే పెద్ద ఫ్యామిలీ కోసం ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విశాలమైన ఇంటీరియర్, అద్భుతమైన మైలేజీ, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఇన్నోవా హైక్రాస్ లభిస్తుంది. దీంతో పాటు ఈ కారు ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరకే లభిస్తోంది. కార్ల మధ్య కాంపిటీషన్ పెరగడంతో కొన్నిసార్లు కంపెనీలు ధరలు తగ్గించక తప్పదు. మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, దీని ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలు తెలుసుకున్నాక డిసైడ్ అవ్వండి. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్ ధర ఎంత?

టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర ₹18.48 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీని టాప్ మోడల్ ZX(O) హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ₹37.38 లక్షల వరకు ఉంటుంది. VX హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ₹31.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. 

G Fleet 7STR పెట్రోల్ బేస్ మోడల్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర రూ.18,48,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ.24,97,129 పడుతుంది. ZX(O) Hybrid పెట్రోల్ టాప్ మోడల్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 31,30,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 41,59,080 చెల్లించాల్సి ఉంటుంది.

కారు పవర్ మరియు మైలేజీ

టొయోటా ఇన్నోవా హైక్రాస్ 2 ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్.. ఇది 173 bhp పవర్, 209 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండోది 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండింటిపై వెళ్తుంది. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ అయితే 16.13 kmpl మైలేజీ ఇస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ 23.24 kmpl వరకు  ఇస్తుంది (ARAI సర్టిఫైడ్). కారు ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 1200 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ జర్నీ చేయవచ్చు. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు

టొయోటా ఇన్నోవా హైక్రాస్ కేబిన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ఫ్యామిలీ ట్రిప్స్ కూడా తేలిక అవుతాయి. ఇందులో 'Toyota i-CONNECT'తో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ Apple CarPlay, వైర్డ్ Android Auto సపోర్ట్ చేస్తుంది. సౌండ్ సిస్టమ్ కోసం ఇందులో 9 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, సబ్‌వూఫర్ ఉన్నాయి.

మార్కెట్‌లో టొయోటా ఇన్నోవా హైక్రాస్ కారు మహీంద్రా XUV700, టాటా సఫారీ, టొయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కారెన్స్ సహా మారుతి సుజుకి ఇన్విక్టో వంటి వాహనాలకు గట్టి పోటీ ఇష్తుంది.

 

ఈ కారు కేవలం ఫ్యామిలీ కారు మాత్రమే కాదు, ఇది టెక్నాలజీ పరంగా కూడా చాలా ముందుంది. 

భద్రత (Safety): ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీనికి గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 

ADAS టెక్నాలజీ: ఇది Toyota Safety Sense (ADAS) ఫీచర్లతో వస్తుంది. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రెండవ వరుసలో లెగ్ రెస్ట్‌తో కూడిన పవర్డ్ ఒట్టోమన్ సీట్లు మీకు హైక్లాస్ జర్నీ అనుభూతిని కలిగిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget