డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ అలవాట్లు మానుకోండి, లేదంటే మీ కారుకు ఇబ్బందులు తప్పవు!
ఆటోమేటిక్ కారుతో పోల్చితే మ్యానువల్ కారు నడపడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే, డ్రైవింగ్ చేసేటప్పడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కాదని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఏ వాహనం అయినా, ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ఎక్కువ కాలం పని చేస్తుంది. అందుకే వాహనాలకు వీలైనంత పద్దతిగా వాడుకోవాలి. అలాగే మనం వాడే మ్యానువల్ కారును కూడా ఎంత జాగ్రత్తగా నడుపుకుంటే అంత ఎక్కువ కాలం పని చేస్తుంది. కారు నడిపే సమయంలో తీసుకునే జాగ్రత్తలే దాని లైఫ్ టైమ్ ను పెంచుతాయి. మాన్యువల్ కారును డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. వాటిలో కీలకమైన 5 జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.అవసరం అయితేనే గేర్ స్టిక్ పై చేతిని పెట్టండి
కార్లు నడిపే వారిలో కామన్ గా కనిపించే అలవాడు గేర్ స్టిక్ పై చెయ్యి అలాగే ఉండడం. చాలా మంది అవసరం లేకున్నా గేర్ స్టిక్ పై చెయ్యిని అలాగే పెడతారు. అలా చేయడం వల్ల గేర్ ఫోర్క్ లపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా ఒక్కోసారి గేర్ బాక్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే, గేర్లను మార్చేటప్పుడు మాత్రమే గేర్ స్టిక్‌ను తాకాలి. ఆ తర్వాత చేతిని తీసివేయాలి. వీలైనంత వరకు రెండు చేతులను స్టీరింగ్ వీల్‌పై ఉంచండం మంచిది. మాన్యువల్ గేర్ బాక్స్‌లలో వేర్ అండ్ టియర్ అంత కీలకమైనది కాదు. కానీ, నివారించే ప్రయత్నం చేయాలి.
2.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ పెడల్ పై కాలు ఉంచకూడదు
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ పెడల్‌పై కాలు ఉంచడం సరైన పద్దతి కాదు. దీని కారణంగా క్లచ్ ప్లేట్స్ వేడెక్కడంతో పాటు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో, గేర్‌లను మార్చిన తర్వాత క్లచ్ పెడల్ పై నుంచి కాలు తీసివేయాలి. కారులో ఉన్న డెడ్ పెడల్‌పై మాత్రమే కాళ్లు పెట్టుకోవడం మంచింది.
3.క్లచ్‌ని పూర్తిగా తొక్కిపట్టకుండా గేర్లను మార్చవద్దు
ఆటోమేటిక్ కారుతో పోల్చితే మాన్యువల్ కారును నడపడం కాస్త కష్టంగానే ఉంది. చాలా మంది గేర్లు మార్చే సమయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. క్లచ్ పెడల్‌ను పూర్తిగా కాలుతో తొక్కి పట్టకుండానే గేర్‌ను మార్చుతారు. ఇలా చేయడం వల్ల ట్రాన్స్ మిషన్ దెబ్బతింటుంది. దీన్ని బాగు చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది. అందుకే, గేర్‌లను మార్చే ముందు క్లచ్ పెడల్‌ను పూర్తిగా తొక్కి పట్టాలి. ఒక్కోసారి సరిగా క్లచ్ తొక్కకుండా గేర్ వేస్తే శబ్దం కూడా వస్తుంది. అప్పుడైనా జాగ్రత్త పడటం మంచిది.
4.బ్రేక్ డౌన్‌షిఫ్ట్ చేయవద్దు
ఇంజిన్ బ్రేకింగ్ అని పిలువబడే బ్రేక్‌కి డౌన్‌షిఫ్టింగ్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సాధారణ బ్రేకింగ్ టెక్నిక్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఇది ట్రాన్స్ మిషన్, క్లచ్‌పై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే వేగాన్ని తగ్గించి, పూర్తిగా ఆపివేయడానికి బ్రేక్ పెడల్‌ను ఉపయోగించాలి. మీరు ఇంజన్ బ్రేకింగ్‌ని కేవలం బ్రేక్‌లు ఫెయిల్ అయినప్పుడు, డౌన్‌హిల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి.
5.మీ వేగం విషయంలో జాగ్రత్త అవసరం
యువకులు కారును నడిపే సమయంలో అధిక వేగంగా వెళ్లాలని భావిస్తారు. కానీ, కారు అధిక వేగాన్ని ఇష్టపడదు.
క్లచ్‌ని నొక్కడం RPMని పరిమితికి మంచి పెంచడం కారణంగా మొత్తం కార్ క్లచ్ సిస్టమ్ చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, పరిమితికి లోబడి కారును నడపడం మంచింది.
Read Also: సమ్మర్‌లో మీ కారును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఈ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!