News
News
వీడియోలు ఆటలు
X

Summer car care tips: సమ్మర్‌లో మీ కారును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఈ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!

సమ్మర్ లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్లలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే, వేసవిలో కార్లను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.

FOLLOW US: 
Share:

భారత్ లో ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నెలలో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  సమ్మర్ లో కార్లను జాగ్రత్త కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

1. బ్యాటరీని పరిశీలించండి  

కారు బ్రేక్‌డౌన్‌లకు బ్యాటరీ ఫెయిల్యూర్ అత్యంత సాధారణ కారణం. అధిక ఉష్ణోగ్రతల నుంచి కారు బ్యాటరీని సరిగ్గా కాపాడకపోతే దాని లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. వేడి తీవ్రతకు  ఎలక్ట్రోలైట్ త్వరగా ఆవిరైపోతుంది. అందుకే, తరుచుగా బ్యాటరీలోని లిక్విడ్ స్థాయిని తనిఖీ చేయండి. అవసరమైతే డిస్టిల్ వాటర్ తో టాప్ అప్ చేయండి.

2. ఎయిర్ కండిషనింగ్

మీరు ఎండలో ప్రయాణం చేసే సమయంలో ఏసీ అనేది చాలా ముఖ్యం. తయారీదారులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎయిర్ కన్ సిస్టమ్‌లను రీగ్యాస్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. సో, క్రమం తప్పకుండా ఏసీ పనితీరును పరిశీలిస్తూ ఉండాలి. అవసరమైతే ఎయిర్ కన్ సిస్టమ్‌లను రీగ్యాస్ చేయించాలి.     

3. టైర్లు

వేడి వాతావరణం కారు టైర్లలో గాలి ఒత్తిడిని పెంచుతుంది. ఎక్కువ గాలి ఉంటే, ఒత్తిడి పెరిగి కారు రన్నింగ్ లో ఉండగా టైర్లు పేలిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు టైర్లలోని గాలి ప్రెషర్ ను పరిశీలిస్తూ ఉండాలి.     

4. ఆయిల్స్ తనిఖీ చేయండి

ఇంజిన్ లోని కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ స్థాయిలను గమనిస్తూ ఉండాలి. బ్రేక్, క్లచ్, పవర్ స్టీరింగ్ ఆయిల్ ను కూడా నెలకు ఒకసారి తనిఖీ చేయాలి. వేడి వాతావరణంలో, ఆయిల్స్ త్వరగా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది.  

5. బెల్ట్ అప్

ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగా కారు ఇంజిన్ బేలో ఉండే  డ్రైవ్‌బెల్ట్ తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వేసవిలో తరుచుగా బెల్టులను గమనించాలి. కూలింగ్ ఫ్యాన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూస్తూ ఉండాలి.

6. వైపర్ బ్లేడ్‌లను గమనించండి

తీవ్ర వేడి కారణంగా వైపర్ బ్లేడ్ లు వేడెక్కి గ్లాస్ మీద రబ్బరు మరకలు పడే అవకాశం ఉంటుంది. అందుకే, వేసవిలో ఎక్కువగా వైపర్ వినియోగం లేకుండా చూసుకోవాలి.   

7. కారును శుభ్రంగా ఉంచండి

కారు విండ్‌ స్క్రీన్ నుంచి దుమ్మును తరుచుగా క్లీన్ చేయాలి. వేసవిలో దుమ్ము, పక్షిరెట్టలు, కీలకాల మూలంగా పెయింట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే తరుచుగా నీటితో శుభ్రం చేసుకోవడం మంచింది.     

8. కచ్చితంగా సర్వీస్ చేయించండి

కారు ఇంజిన్ సర్వీస్ విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు. వేసవి కదా, చేయించుకోవచ్చులే అనుకోకూడదు. కచ్చితంగా సర్వీస్ చేయించాలి. వేసవిలో సర్వీస్ చేయించడం ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే సరిచేసే అవకాశం ఉంటుంది.    

9. బ్రేక్‌డౌన్ కవర్‌ను ముందుగానే తీసుకోండి

రికవరీ సర్వీస్ మెంబర్‌షిప్ పొందడానికి కారు చెడిపోయే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ముందుగానే కొనుగోలు చేయడం మంచిది.   

10. బయలుదేరే ముందు స్టాక్ అప్ చేయండి

మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీతో కొన్ని అత్యవసర సామాగ్రిని తీసుకెళ్లండి. వాటర్ బాటిల్స్, స్నాక్స్, టార్చ్‌, ఫోన్ ఛార్జర్‌ మీతో ఉంచుకోవడం మంచిది. డ్రైవింగ్ లైసెన్స్, బీమా పాలసీ దగ్గరే ఉంచుకుంటే మరీ మంచిది.   

Read Also: మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారా? ఛార్జర్ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారట - ఎందుకంటే?

Published at : 03 May 2023 05:46 PM (IST) Tags: Car Care tips Car maintenance Summer Car Care tips

సంబంధిత కథనాలు

Hero Xtreme 160R: కొత్త బైక్ కొనాలనుకుంటే జూన్ 14 వరకు ఆగండి - సూపర్ బైక్ లాంచ్ చేస్తున్న హీరో!

Hero Xtreme 160R: కొత్త బైక్ కొనాలనుకుంటే జూన్ 14 వరకు ఆగండి - సూపర్ బైక్ లాంచ్ చేస్తున్న హీరో!

Maruti Suzuki Jimny: ఎట్టకేలకు లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ - ధర ఎంతంటే?

Maruti Suzuki Jimny: ఎట్టకేలకు లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ - ధర ఎంతంటే?

Upcoming Electric Cars: రూ.20 లక్షల లోపు రాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే - ఫీచర్స్ అద్భుతం

Upcoming Electric Cars: రూ.20 లక్షల లోపు రాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే - ఫీచర్స్ అద్భుతం

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ -  కొనాలంటే ఇదే రైట్ టైం!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!