అన్వేషించండి

Electric offers: మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారా? ఛార్జర్ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారట - ఎందుకంటే?

ఓటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఓలా కంపెనీ ఈ డబ్బును ఎందుకు వెనక్కి ఇస్తోందంటే?

గడిచిన కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. పెట్రో ధరల పెరుగుదల, పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన వస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల్లో ఓలా దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లను పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. మంచి ఫీచర్లు, అంతకు మించి బ్యాటరీ లైఫ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయడం లాంటి వెసులుబాటు ఉంటడంతో ఓలా స్కూటర్ల పట్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారు.

ఓలా వినియోగదారులకు గుడ్ న్యూస్

తాజాగా ఓలా కంపెనీ తమ స్కూటర్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బైక్ ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఓలా తమ కస్టమర్లకు రీఫండ్ చేయడం మొదలు పెట్టింది. ఆయా మోడల్స్ ను బట్టి రూ. 9 వేల నుంచి రూ.19 వేల వరకు వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. స్కూటర్ కొనుగోలు సమయంలో ఛార్జర్ కోసం ఈ డబ్బును తీసుకుంది.  

కేంద్రం హెచ్చరికతో వెనక్కి తగ్గిన ఓలా

ఓలా ఈ డబ్బును రీఫండ్ చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను తిరిగి వారికి ఇచ్చిన తర్వాతే, కంపెనీకి సబ్సిడీ డబ్బులు పూర్తిగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దీంతో డబ్బులు వెనక్కి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఓలా కంపెనీ చార్జర్‌ను యాడ్ ఆన్ సర్వీస్ కింద వినియోగదారులకు అందించింది. చార్జర్ ధరను స్కూటర్ ధరలో యాడ్ చేయలేదు.  ఈ నేపథ్యంలో ఛార్జర్ కోసం కస్టమర్లు ఆయా మోడల్ ను బట్టి రూ. 9 నుంచి రూ. 19 వేల వరకు అదనంగా చెల్లించారు. ఈ పద్దతిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఛార్జర్ ను వేరేగా అమ్మితే సబ్సిడీ పొందలేరని తేల్చి చెప్పింది. ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేసిన వారికి డబ్బు రీఫండ్ చేయాలని తేల్చి చెప్పింది. అలా చేయని నేపథ్యంలో సబ్సిడీ ఇవ్వమని వెల్లడించింది. దీంతో ఓలా కంపెనీ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను రీఫండ్ చేయడం మొదలుపెట్టింది.

లక్ష మంది వినియోగదారులకు రీఫండ్ చేయనున్న ఓలా    

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది వినియోగదారులకు ఛార్జర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ తో కాకుండా విడిగా అమ్మినట్లు ఓలా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారందరికీ డబ్బులు వాపసు ఇచ్చేస్తామని చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, చార్జర్ ను కలిపి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి తమ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను  రీఫండ్ చేయడం మొదలు పెట్టింది ఓలా. సుమారు రూ. 130 కోట్ల రూపాయలను రీఫండ్ చేయనుంది.

Read Also: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget