Summer car care: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!
విపరీతమైన వేడి కార్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్, రబ్బరు భాగాలతో పాటు ఆయిల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో కారును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది భారత్ లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ తొలి వారం నుంచే వేడి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. మే రాక ముందే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మనుషులతో పాటు వాహనాలు కూడా ఎండ తీవ్రతకు దెబ్బతింటున్నాయి. వేడికి కార్లలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తీవ్రమైన ఎండ కారణంగా కార్లలోని అనేక భాగాలు చెడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత నుంచి కార్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. క్యాబిన్‌ను చల్లగా ఉంచడం
కారును వీలైనంత వరకు నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించాలి. అలాంటి పరిస్థితి లేని సమయంలో విండోలను కొద్దిగా క్రిందికి ఉంచాలి. క్రాస్-వెంటిలేషన్ కారణంగా క్యాబిన్ నుంచి విడుదలయ్యే వేడిగాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎండలో పార్క్ చేసినప్పుడు, విండోలకు సన్ షేడ్‌ను అంటుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల తక్కువ వేడి ఉంటుంది.
2. ACని ఎలా వాడాలంటే?
వేడిగా ఉండే రోజులో కారు AC అత్యధిక లోడ్‌ను తీసుకుంటుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అనేది సర్వీస్ ఇంటెన్సివ్. క్యాబిన్ యూనిట్‌ను రక్షించడంలో సహాయపడటానికి కంప్రెసర్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా టాప్ అప్ చేయాలి. చాలా మంది కారు యజమానుల, కారు ఎయిర్ కండీషనర్ క్యాబిన్‌ను చల్లబరచడానికి చాలా సమయం తీసుకుంటుందని చెప్తుంటారు. మీ AC యూనిట్ ఎంత శక్తివంతమైనదనే దానితో సంబంధం లేకుండా, కారులో ఉన్న వేడి కారణంగా సమయం పడుతుందని గుర్తించాలి. దీన్ని నివారించడానికి మీరు కార్ స్టార్ట్ చేసే ముందు విండోలను కిందికి దించాలి. అలా చేయడం వల్ల కొంత వేడి తగ్గిపోతుంది. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. క్యాబిన్ లోని వేడి మొత్తం బయటకు వెళ్లాక, విండోస్ క్లోజ్ చేసి ఏసీని ఆన్ చేయాలి.
3. మీ కారు టైర్ల ఒత్తిడిని గమనించండి
వేసవిలో కార్ల టైర్లు పేలడాన్ని గమనిస్తూ ఉంటాం. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో టైర్ రబ్బరు దెబ్బతినే అవకాశం ఉంది. నాసిరకం రోడ్లపై, వేగంగా వెల్లడం వల్ల టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వేసవిలో, మీరు మీ టైర్ ఒత్తిడిని గమనించాలి. అధికంగా గాలిని నింపడం వల్ల కూడా వేగంగా ప్రయాణించే సమయంలో గాలి తీవ్రత పెరిగి పగిలిపోయే అవకాశం ఉంటుంది.
4. మీ రేడియేటర్‌ను సర్వీసింగ్ చేయండి
ఎండా కాలంలో కూలెంట్ ఆయిల్స్ వినియోగించాలి. మంచి నాణ్యమైన కూలెంట్ ఆయిల్ ను వాడటం వల్ల మీ కారు వేడిని తగ్గించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి, వేసవిలో వాహనాలు చెడిపోవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి తక్కువ కూలెంట్ కారణంగా ఇంజిన్ వేడెక్కడం. మీ కారులో కూలెంట్ లెవల్ ని తరచుగా చెక్ చేయాలి. తక్కువగా ఉంటే ఫిల్ చేయాలి.
5. ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆయిల్స్ చెక్ చేయండి
వేసవిలో ఇంజిన్ తో పాటు ట్రాన్స్మిషన్ ఆయిల్స్ ను చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ సరిగా లేకపోతే ఇంజిన్ లో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. సో, మీ ఇంజన్-ఆయిల్ లెవెల్స్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. చేయండి మరియు సరైన ఆయిల్‌తో టాప్ అప్ చేయండి.
6. హోసెస్, బెల్టులు
డ్రైవ్ చేస్తున్నప్పుడు, కారు ఇంజన్ అధిక ఉష్ణోగ్రతలకు చేరుకుంటుంది. హోసెస్, బెల్టులు అధికవేడికి ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. వీటి భాగాలు రబ్బరు సమ్మేళనాలతో తయారు చేయబడినందున ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
7. బ్యాటరీ సంరక్షణ
అధిక వేడి బ్యాటరీ లైఫ్ ను తగ్గిస్తుంది. దీని వలన బ్యాటరీ లోపల ఉన్న లిక్విడ్ త్వరగా ఆవిరైపోతుంది. దీంతో బ్యాటరీ చెడిపోతుంది. బ్యాటరీ టెర్మినల్స్ లో ఎక్కడైనా తుప్పుపట్టినా ప్రమాదమే. అందుకే కేబుల్ కనెక్షన్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కారు సాధారణ డిస్టిల్డ్ వాటర్ టాప్ అప్‌లు అవసరమయ్యే బ్యాటరీని ఉపయోగిస్తుంటే, వేసవిలో లిక్విడ్ స్థాయిలను తరచుగా తనిఖీ చేయాలి.
8. పాలిష్ ప్రొటెక్షన్
మీ కారు పెయింట్ ఎక్కువగా వేడెక్కకుండా రక్షించడంలో పాలిష్ సహాయపడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా పెయింట్‌పై రక్షిత మైనపు పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి, వేసవి రాకముందే మీ కారును పాలిష్ చేయండి.
Read Also: వేసవిలో వేడిని తట్టుకునే బెస్ట్ కార్లు ఇవే, వెంటిలేటెడ్ సీట్లే కాదు, తక్కువ ధర కూడా!