Cheapest electric scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!
భారత్ లో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతున్నది. పెట్రో ధరల పెంపుతో పాటు కాలుష్య నివారణ మీద ప్రజల్లో అవగాహన కలుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఊపందుకుంది.
![Cheapest electric scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే! Top 6 Cheapest electric scooters in India with the best range Cheapest electric scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/6f68bd31836ce35446410bcfa1bb21aa1662988903365544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. రానున్న రోజుల్లో పొల్యూషన్ ప్రీ వాహనాల వినియోగం శరవేగంగా విస్తరించే అవకాశం ఉందని భావించి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏథర్, TVS, బజాజ్ సహా పలు కంపెనీలు విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అంతేకాదు.. ఒకే ఛార్జ్‌పై 100+ కిమీ పరిధిని అందించనున్నాయి. దేశీయ మార్కెట్ లో బెస్ట్ అండ్ లో కాస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. Ola S1 - 181 km/ఛార్జ్ - రూ.99,999
ఓలా ప్రస్తుతం మంచి ఎలక్ట్రిక్ వాహనాలన తయారు చేస్తున్నది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తన EV ప్రయాణాన్ని S1, S1 ప్రో అనే రెండు ఇ-స్కూటర్‌లతో ప్రారంభించింది. S1 ప్రో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్షకు పైగా ఉంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. అటు S1 రూ. 99,999 తో 3 kWh బ్యాటరీతో ప్యాక్ చేయబడింది. ఇది 8.5 kW మోటార్ కు శక్తినిస్తుంది. 58 Nm వీల్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. 181 కి.మీ పరిధిని అందిస్తుంది. గరిష్టంగా 116 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. బ్లూటూత్, 4G కనెక్టివిటీకి సపోర్టు చేస్తుంది. ఇన్‌బిల్ట్ GPS నావిగేషన్, వివిధ డిస్‌ప్లే మోడ్‌లు, అప్రాన్‌లకు అమర్చబడిన స్పీకర్లతో మ్యూజిక్ ప్లేబ్యాక్ను కలిగి ఉంది.
2. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సిఎక్స్- 140కిమీ/ఛార్జ్ - రూ. 62,190
Hero Electric Optima CX అనేది Optima HX ఇ-స్కూటర్ యొక్క మెరుగైన వెర్షన్. ఇది సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పాత మోడల్ధర రూ. 62,190. లేటెస్ట్ వెర్షన్ ధర రూ.77,490గా ఉంది. Optima CX 550W BLDC మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 1.2 kW పీక్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. డబుల్ బ్యాటరీ వేరియంట్ 45 కిమీ/గం గరిష్ట వేగంతో ఒకే ఛార్జ్‌పై 140 కిమీ పరిధిని చేయగలదు. డిజైన్ వారీగా Optima CX.. Optima HX లా కనిపిస్తుంది. అయితే, ఇది మూడు కొత్త రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. Optima CX డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, వాక్ అసిస్ట్ ఫంక్షన్, యాంటీ-థెఫ్ట్ అలారంతో రిమోట్ లాక్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
3. ఆంపియర్ మాగ్నస్ EX - 121 కిమీ/ఛార్జ్ - రూ. 73,999
ఆంపియర్ మాగ్నస్ EX ధర ప్రస్తుతం రూ. 73,999లో అందుబాటులో ఉంది. ఇది అత్యంత ఫీచర్-రిచ్ స్కూటర్ కాదు. సాధారణ పరిమాణ LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంను కలిగి ఉంది. దాని పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, ఆంపియర్ మాగ్నస్ EX 1.2 kW మోటార్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 55 km/hr వేగం పొందుతుంది. మోటారు 60V, 30Ah బ్యాటరీకి జత చేయబడింది. ఇది సంప్రదాయ 5 amp సాకెట్ ను కలిగి ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-7 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్ తో ఈ స్కూటర్ 121 కిమీల పరిధిని కలిగి ఉంది.
4. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ - 108 కిమీ/ఛార్జ్ - రూ. 80,790
హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ అనేది కంపెనీ యొక్క ప్రీమియం కమ్యూటర్ స్కూటర్. ఇది 72V 26 Ah బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. 1200W మోటారుతో 1800W వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఇది 90 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 45 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ LED హెడ్‌లైట్, టెయిల్ లైట్, అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్నది.
5. ఒకినావా ప్రైజ్ ప్రో - 88 కిమీ/ఛార్జ్ - రూ. 87,593
ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రైజ్ ప్రో దాని ప్రసిద్ధ మోడళ్లలో ఒకటి. ఇది 58 కిమీ/గం గరిష్ట వేగంతో కూడిన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 2kWh లిథియం అయాన్ బ్యాటరీకి జత చేయబడిన 1kW BLDC మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఒక ఛార్జ్‌పై 88 కిమీ పరిధిని అందిస్తుది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 2-3 గంటలు పడుతుంది. దాని 'స్పోర్ట్ మోడ్'లో 88 కిమీ పరిధిని అందిస్తుంది. యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, పూర్తిగా డిజిటల్ LCD కన్సోల్, సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్‌లు దీని ప్రత్యేతలు.
6. బౌన్స్ ఇన్ఫినిటీ E1 - 85 కిమీ/ఛార్జ్ - రూ. 45,099
బౌన్స్ ఇన్ఫినిటీ E1 భారతదేశంలో విక్రయించబడుతున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. బౌన్స్ ఇన్ఫినిటీ E1 2 kWh 48V 39 Ah బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఇది హబ్ మోటార్‌కు జత చేయబడింది. ఇది 83 Nm వీల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది. ఇది 85 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది రెండు మోడ్ లలో పని చేస్తుంది. ఎకో మోడ్ పరిధి 65 కి.మీ కాగా, స్పోర్ట్ మోడ్‌లో 50 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది జియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్, బ్లూటూత్ కనెక్టివిటీని పొందే LCD కన్సోల్‌ను కలిగి ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)