అన్వేషించండి

Tesla Cyber Cab : రోబో ట్యాక్సీ లను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ మస్క్ - పాత తెలుగు సినిమాల్లోని ఫాంటసీ కార్లను దించేస్తున్నారుగా !

Tesla : టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌లను ఆవిష్కరించారు. ఇవి పాత తెలుగు సినిమాల్లో ఫాంటసీ కార్లను పోలినట్లుగా ఉన్నాయి. కాకపోతే ఇవి నిజం.

Tesla Chief Elon Musk unveils Robo Taxi  Robo Van : టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్‌ ఐ రోబోట్‌ ఈవెంట్‌లో రోబోవ్యాన్‌, సైబర్‌ క్యాబ్‌లను ప్రపంచానికి పరిచయం చేశారు. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహింంచిన కార్యక్రమంలో సైబర్ క్యాబ్ ఎక్కి మరీ వచ్చారు.  ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఉద్దేశించారు.  మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్‌ వరల్డ్‌’గా చెప్పుకొచ్చారు. సైబర్ క్యాబ్‌లో ఇద్దరు..   రోబోవన్‌ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్‌ కారు. ఈ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి ఆటోమేషన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది.  

‘వీ, రోబోట్’ పేరిట వీటిని ఆవిష్కరించారు. ఈ కార్లు ఇతర కార్ల కన్నా  20 రెట్లు సురక్షితమైనవని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.  2026 కల్లా సైబర్ క్యాబ్ ఉత్పత్తి జరుగుతుంది. సైబర్ వ్యాన్‌లను వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియా నగరాల్లోని రోడ్ల  మీదకు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డ్రయివర్ లెస్ కార్లలో ప్రజలు పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ లేక పనిచేసుకుంటూ లేక ఏదో విధంగా కాలం గడుపవచ్చునని ఎలన్ మస్క్ తన ఆవిష్కరణ ప్రసంగంలో తెలిపారు.  

సైబర్ క్యాబ్, రోబోవ్యాన్‌లో డ్రైవర్‌ క్యాబిన్‌ కూడా ఉండదు. ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు..  సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్‌ విధానంలో ఛార్జ్‌ చేసేలా రూపొందించారు. మస్క్ రిలీజ్ చేసిన ఈ ప్రోటోటైప్ వాహనాలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.  

తెలుగు సినిమాల్లో ఆదిత్య 369 వంటి సినిమాల్లో దర్శకుల ఊహాలోకంలో సృష్టించిన తరహా వాహనాలను ఇక్కడ మస్క్ ఒరిజినల్ కార్లగా రూపుదిద్దుతున్నారని సోషల్ మీడియాలో కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.  

 టెస్లా కార్లతో ఇప్పటికే డ్రైవర్ లెస్ , ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో  సంచలనం సృష్టించిన మస్క్.. అంతరిక్షంలోనూ విజయం సాధించడానికి స్పేస్ ఎక్స్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
Viswam Movie Review - విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
Jigra Review: జిగ్రా రివ్యూ: యాక్షన్ అవతార్‌లో ఆలియా భట్ - ఇంతకీ సినిమా ఎలా ఉంది?
జిగ్రా రివ్యూ: యాక్షన్ అవతార్‌లో ఆలియా భట్ - ఇంతకీ సినిమా ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
Viswam Movie Review - విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
Jigra Review: జిగ్రా రివ్యూ: యాక్షన్ అవతార్‌లో ఆలియా భట్ - ఇంతకీ సినిమా ఎలా ఉంది?
జిగ్రా రివ్యూ: యాక్షన్ అవతార్‌లో ఆలియా భట్ - ఇంతకీ సినిమా ఎలా ఉంది?
Noel Tata: నోయెల్ టాటానే రతన్ టాటా వారసుడా? టాటా ట్రస్ట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
నోయెల్ టాటానే రతన్ టాటా వారసుడా? టాటా ట్రస్ట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
Billionaires in India: అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
Aadhaar Card: ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి ఎంత డబ్బు తీసుకోవచ్చు? - విత్‌డ్రా ప్రాసెస్‌ ఇదిగో
ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి ఎంత డబ్బు తీసుకోవచ్చు? - విత్‌డ్రా ప్రాసెస్‌ ఇదిగో
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Embed widget