అన్వేషించండి

Tata Car Offers: టాటా టియాగో, టిగోర్‌లపై భారీ ఆఫర్లు - ఏకంగా రూ.75 వేల వరకు!

Tata Car Best Deals: టాటా టియాగో, టిగోర్‌లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Tata Tiago and Tigor: టాటా మోటార్స్ ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లు ఈ నెలలో తమ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. భారీ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

టియాగో, టిగోర్ సీఎన్‌జీపై తగ్గింపు
టాటా టియాగో, టిగోర్ సీఎన్‌జీ సింగిల్ సిలిండర్ వేరియంట్‌లు రూ. 60,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దాని ట్విన్-సిలిండర్ వేరియంట్‌లపై రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.

ఈ వారం ప్రారంభంలో టాటా టియాగో, టిగోర్‌లలో సీఎన్‌జీ ఏఎంటీ వేరియంట్‌లను పరిచయం చేసింది. దీని కారణంగా దేశంలోనే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి సీఎన్‌జీ కార్లుగా అవతరించాయి. రెండు మోడళ్ల ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా రూ.7.90 లక్షలు, రూ.8.85 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

వేటితో పోటీ?
టాటా టియాగో, టిగోర్ వరుసగా మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి డిజైర్‌లతో పోటీ పడుతున్నాయి. రెండింటిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ సీఎన్‌జీ వేరియంట్‌తో 77 పీఎస్ పవర్, 98.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. స్విఫ్ట్, డిజైర్‌ల్లో లభించే ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 22.41 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 22.61 కిలోమీటర్లు, సీఎన్‌జీ మాన్యువల్‌తో 31.12 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. మారుతి సుజుకి రాబోయే కొద్ది నెలల్లో స్విఫ్ట్, డిజైర్ తదుపరి తరం మోడల్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త జెడ్ సిరీస్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న ఇంజిన్ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాలలో వివిధ విభాగాలలో అనేక కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి ప్లాన్లు రెడీ చేస్తుంది. ఈ ప్లాన్‌లో ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్, కొత్త ఎస్‌యూవీ, ఈవీ ఉన్నాయి. గత సంవత్సరం కంపెనీ నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్‌యూవీలను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారు 2024లో విడుదల కానుంది. ఇది మాత్రమే కాకుండా 2025లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మొదటిసారి 2019లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ కారు మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందనుండటం విశేషం. కొత్తగా లాంచ్ కానున్న మోడల్‌లో చిన్నపాటి బ్యూటీ ఛేంజెస్, అనేక కొత్త ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Embed widget