అన్వేషించండి

Tata Tiago: సేల్స్‌లో టాటా టియాగో కొత్త రికార్డు - కేవలం ఏడు సంవత్సరాల్లోనే!

టాటా టియాగో మనదేశంలో ఐదు లక్షల యూనిట్ల అమ్మకాలను దాటింది.

Tata Tiago: టాటా మోటార్స్ 2016లో టియాగోను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. మెరుగైన మైలేజ్, డిజైన్ కారణంగా ఇది వినియోగదారులను ఆకర్షించడం ప్రారంభించింది. చాలా త్వరగానే దేశీయ విపణిలో ప్రముఖ కారుగా మారింది. ఇప్పుడు ఈ కారు 5,00,000 యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటింది.

15 నెలల్లోనే లక్ష మార్కు
కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కారు 15 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటింది. ఈ కారు గుజరాత్‌లోని సనంద్‌ ఫ్యాక్టరీలో తయారు అవుతుంది. ఇదే దాని హోమ్ గ్రౌండ్. కంపెనీ ఈ కారును ఆరు వేరియంట్‌లలో విక్రయిస్తుంది. ఈ కారు ధర రూ. 5.59 లక్షల నుంచి రూ. 8.11 లక్షల మధ్య ఉంది.

టాటా టియాగో కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌తో సహా పలు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా టాటా టియాగో ఎన్ఆర్‌జీ వేరియంట్‌‌ను పెట్రోల్ ఆప్షన్‌లో విక్రయిస్తున్నారు.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ కారు విక్రయాలలో 60 శాతం పట్టణ ప్రాంతాల్లో, 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇది కాకుండా టాటా టియాగో కస్టమర్లలో 10 శాతం వాటా మహిళలదే. ఈ కారును కొనుగోలు చేసిన కస్టమర్లలో 71 శాతం మంది కొత్త కస్టమర్లే. వారి మొదటి కారును కొనుగోలు చేశారు.

ఏ కారుతో పోటీ
దేశీయ విపణిలో టాటా టియాగోకు గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి మంచి పోటీ ఉంది.

టాటా టియాగోలో ఈవీ వెర్షన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. అదే టాటా టియాగో ఈవీ. ఈ కారులో రెండు వెర్షన్లు ఉన్నాయి. వీటిలో 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇక 24 కేడబ్ల్యూహెచ్ మోడల్ 315 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించనుంది. బ్యాటరీ ప్యాక్‌కు 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని కంపెనీ అందించనుంది. ఇక కారుకు  3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ లభించనుంది.

టియాగో ఈవీలో రెండు ఛార్జర్ ఆప్షన్లు ఉన్నాయి. 3.3 కిలో వాట్ కాంపాక్ట్ ఏసీ చార్జర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేస్తే పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు గంటల 36 నిమిషాలు పట్టనుంది. అదే 7.2 కిలో వాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే చాలా వేగంగా కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.

టాటా టియాగో ఈవీలో 8 స్పీకర్ల హర్మాన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం అందించారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ట్రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డ్ ఉన్న ఎలక్ట్రిక్ ఓవీఆర్ఎమ్స్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget