పెట్రోల్ కష్టాలు తీరినట్లే! Tata Tiag EVని కేవలం రూ.10 వేల EMI తో సొంతం చేసుకోవచ్చు, డ్రైవింగ్ రేంజ్ కూడా ఎక్కువ!
Tata Tiago EV EMI: హైదరాబాద్‌లో టాటా టియాగో EV బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, మీరు RTO ఛార్జీలు & బీమా, ఇతర ఖర్చలకు కలిపి దాదాపు రూ. 9.48 లక్షలు చెల్లించాలి.

Tata Tiago EV On Rs 10000 EMI: టాటా టియాగో EV బాహ్య రూపం ఇప్పటి కాలానికి తగ్గట్లుగా, ఆధునికతకు నిదర్శనంలా కనిపిస్తుంది. అగ్రెసివ్ గ్రిల్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్ ఈ ఫోర్‌వీలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బ్లూ హైలైట్స్, ఏరో డైనమిక్ డిజైన్ వలన ఇది పూర్తి ఎలక్ట్రిక్ లుక్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ రూపంలోనూ, సిటీ డ్రైవ్‌కి అనువైన డిజైన్‌లోనూ టియాగో EV ఆకట్టుకుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారి & డ్రైవింగ్ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో, మధ్య తరగతి కుటుంబాలకు టాటా టియాగో EV మంచి ఉపశమనంలా పని చేస్తుంది. తక్కువ ధరలో మంచి డ్రైవింగ్ రేంజ్ ఇవ్వడమే కాకుండా, మోడరన్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ కార్‌ను ఎందుకు కొనాలంటే... రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లి, రావడానికి లేదా లేదా ఏదైనా పని కోసం రోజూ అప్&డౌన్ చేయడానికి చక్కటి ఎంపిక అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ కారు ధర ఎంత?
హైదరాబాద్ - Tata Tiago EV XE (Base Variant Medium Range)
ఎక్స్‑షోరూమ్ ధర: రూ. 7,99,000
ఇన్సూరెన్స్: దాదాపు రూ. 33,960
RTO & ఇతర ఛార్జీలు: RTO పన్నులను చాలా తక్కువగా చూపినప్పటికీ, CarWale ప్రకారం, ఆన్-రోడ్ అంచనా ధర రూ. 9.48 లక్షలు.
వరంగల్, విజయవాడ, విశాఖపట్నం
ఈ నగరాల్లోనూ, CarWale ప్రకారం, టాటా టియాగో EV బేస్ వేరియంట్ ఎక్స్‑షోరూమ్ ధర రూ. 7,99,000. ఆన్-రోడ్ అంచనా ధర రూ. ₹9.56 లక్షలు.
హైదరాబాద్‌లో, మీరు టియాగో EV కొనుగోలు కోసం డౌన్ పేమెంట్‌గా రూ. 3 లక్షలు జమ చేస్తే, మిగిలిన మొత్తానికి (రూ. 6.56 లక్షలు) బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకోవచ్చు. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం.
రూ. 6.56 లక్షల కార్ లోన్ (Tata Tiago EV Car Loan)ను, 9 శాతం వడ్డీ రేటుతో, 7 సంవత్సరాల్లో చెల్లించేలా EMI ఆప్షన్ ఎంచుకుంటే, నెలకు రూ. 10,415 EMI చెల్లించాలి. ఈ 7 సంవత్సరాల్లో (84 నెలలు) మీరు 2,27,519 రూపాయలను వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది.
- 6 సంవత్సరాలకు EMI రూ. 11,668; వడ్డీ మొత్తం రూ. 1,92,755.
- 5 సంవత్సరాలకు EMI రూ. 13,437; వడ్డీ మొత్తం రూ. 1,58,879.
- 4 సంవత్సరాలకు EMI రూ. 16,109; వడ్డీ మొత్తం రూ. 1,25,891.
టాటా టియాగో ఈవీ పవర్ & డ్రైవింగ్ రేంజ్
టాటా టియాగో EV మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ మోడల్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కి.మీ., టాప్ వేరియంట్ అయిన XZ Plus Tech LUX Long Range ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీ. దూరం ప్రయాణించగలదు. టియాగో EV టాప్ వేరియంట్ 24kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ EVని DC 25kW ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 58 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు. 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్‌తో 10-100% ఛార్జ్ చేయడానికి 3 గంటల 36 నిమిషాల సమయం కావాలి. సాధారణ 15Amp (15A plug point) హోమ్ ఛార్జర్ ఉపయోగించి పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 9 గంటల సమయం పడుతుంది.





















