అన్వేషించండి

టాటా సియెర్రా వెయిటింగ్‌ పీరియడ్‌: డీజిల్‌, ఆటోమేటిక్‌ వేరియంట్ల కోసం ఎక్కువ కాలం ఆగాల్సిందే!

టాటా సియెర్రా బుక్‌ చేసిన తర్వాత కారు మీ చేతికి రావడానికి ఎంత సమయం పడుతుంది? పెట్రోల్‌, డీజిల్‌, ఆటోమేటిక్‌, మాన్యువల్‌ వేరియంట్ల వారీగా వెయిటింగ్‌ పీరియడ్‌ వివరాలు ఇక్కడ చదవండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా సియెర్రా SUVకి భారీ స్పందన, 70,000 బుకింగ్స్ దాటింది.
  • డీజిల్, ఆటోమేటిక్ వేరియంట్లకు 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్.
  • హై స్పెక్స్, మున్నార్ మిస్ట్ కలర్ మోడళ్లకు ఎక్కువ ఎదురుచూడాలి.
  • రూ.11.49 లక్షల నుండి ధర, క్రెటా, సెల్టోస్ ప్రధాన ప్రత్యర్థులు.

Tata Sierra Waiting Period: టాటా మోటార్స్‌ మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన టాటా సియెర్రా SUV ఇప్పటికే భారీ స్పందన తెచ్చుకుంది. లాంచ్‌ అయిన మొదటి రోజే దాదాపు 70,000 బుకింగ్స్‌ నమోదు కావడం చూస్తే, ఈ కారుపై ఎంత డిమాండ్‌ ఉందో అర్థమవుతోంది. జనవరి 15 నుంచి కస్టమర్‌ డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పటికీ చాలామందిలో ఒకే ప్రశ్న - సియెర్రాను బుక్‌ చేస్తే ఎంత కాలానికి ఈ కారు చేతికి వస్తుంది?       

వేరియంట్‌ను బట్టి మారే వెయిటింగ్‌ పీరియడ్‌             

డీలర్‌ వర్గాల సమాచారం ప్రకారం, టాటా సియెర్రా వెయిటింగ్‌ పీరియడ్‌ సగటున 3 నుంచి 4 నెలల వరకు ఉంది. అయితే ఇది అన్ని వేరియంట్లకు ఒకేలా ఉండదు. డీజిల్‌ వేరియంట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో, అవి పెట్రోల్‌ వేరియంట్లతో పోలిస్తే 2 నుంచి 4 వారాలు ఎక్కువగా వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.          

ఆటోమేటిక్‌ వేరియంట్లకు ఎక్కువ డిమాండ్‌     

సియెర్రాలో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న వేరియంట్లకు డిమాండ్‌ ఎక్కువ. అందుకే, మాన్యువల్‌ వేరియంట్లతో పోలిస్తే ఆటోమేటిక్‌ మోడళ్లకు 15 నుంచి 30 రోజులు అదనపు వెయిటింగ్‌ ఉంటుంది. ముఖ్యంగా టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ పూర్తిగా ఆటోమేటిక్‌లోనే అందుబాటులో ఉండటం వల్ల, దాని కోసం వెయిట్‌ మరింత పెరుగుతోంది.

స్పెక్స్‌ ఎక్కువైతే వెయిట్‌ కూడా ఎక్కువే

టాటా సియెర్రా మొత్తం 7 ట్రిమ్స్‌లో లభిస్తోంది, అవి - Smart, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished, Accomplished+. డీలర్ల మాట ప్రకారం, హై స్పెక్‌ ట్రిమ్స్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో, ఈ వేరియంట్లకు వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా ఎక్కువగా ఉంది.

ఈ కలర్‌ ఎంచుకుంటే ఎక్కువ రోజులు ఎదురుచూపే

సియెర్రా కారును Andaman Adventure, Pristine White, Pure Grey, Bengal Rouge, Coorg Cloud, Munnar Mist వంటి కలర్‌ ఆప్షన్లలో తీసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా, Munnar Mist కలర్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో, ఈ కలర్‌ బుక్‌ చేస్తే వెయిటింగ్‌ పీరియడ్‌ మరింత పెరుగుతుంది.

ఇంజిన్‌ ఆప్షన్లు

టాటా సియెర్రా మూడు ఇంజిన్‌ ఎంపికలతో వస్తోంది.

106hp న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌

160hp టర్బో పెట్రోల్‌

118hp డీజిల్‌

టర్బో పెట్రోల్‌ ఆటోమేటిక్‌లో మాత్రమే లభిస్తే, మిగతా రెండు ఇంజిన్‌లకు మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఎంపిక కూడా ఉంది.

ధర & ప్రత్యర్థులు

టాటా సియెర్రా ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉంటుంది. ఈ SUVకి హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, స్కోడా కుషాక్‌, టయోటా హైరైడర్‌, హోండా ఎలివేట్‌ వంటి మిడ్‌సైజ్‌ SUVలు ప్రధాన ప్రత్యర్థులు.

గమనిక: వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రాంతాన్ని బట్టి కూడా మారవచ్చు. కచ్చితమైన సమాచారం కోసం మీ దగ్గరలోని టాటా డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

టాటా సియెర్రా కారు బుక్ చేసుకుంటే ఎంత కాలం వేచి ఉండాలి?

టాటా సియెర్రా కారు సగటున 3 నుండి 4 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. డీజిల్ వేరియంట్లకు పెట్రోల్ వేరియంట్ల కంటే 2-4 వారాలు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు.

ఆటోమేటిక్ టాటా సియెర్రా వేరియంట్లకు ఎక్కువ వెయిటింగ్ ఉంటుందా?

అవును, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న వేరియంట్లకు మాన్యువల్ వేరియంట్ల కంటే 15-30 రోజులు అదనపు వెయిటింగ్ ఉంటుంది. ముఖ్యంగా టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ కోసం వెయిటింగ్ పెరుగుతోంది.

టాటా సియెర్రాలో ఏ కలర్ కి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది?

మున్నార్ మిస్ట్ (Munnar Mist) కలర్ కి డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన, ఈ కలర్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ మరింత పెరుగుతుంది.

టాటా సియెర్రా ఇంజిన్ ఆప్షన్లు ఏమిటి?

టాటా సియెర్రా 106hp న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 160hp టర్బో పెట్రోల్, మరియు 118hp డీజిల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ లో మాత్రమే లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget