Tata Sierra Price In India: టాటా సియెర్రా గ్రాండ్ లాంచ్.. డిజైన్ నుంచి ఫీచర్ల వరకు ప్రత్యేకతలు ఇవే
టాటా సియెర్రా నవంబర్ 15న భారత మార్కెట్లోకి విడుదల అవుతుంది. టాటా సియెర్రా డిజైన్, ఫీచర్లు, ఇంజిన్, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. రిపోర్టుల ప్రకారం అంచనాలు ఇలా ఉన్నాయి.

Tata sierra Lauching In India | తమ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ Tata Motors నేడు తమ ఐకానిక్ SUV Tata Sierra ని ప్రపంచానికి పరిచయం చేసింది. 90వ దశకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Sierra ఇప్పుడు మోడ్రన్, హై-టెక్ SUV గా తిరిగి వస్తోంది. Rushlane నివేదిక ప్రకారం.. దీని గ్లోబల్ ఆవిష్కరణ నేడు ముంబైలో జరుగుతోంది. సియెర్రా లాంచింగ్‌కు ముందు, దాని అనేక స్పై షాట్‌లు, డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
కొత్త Tata Sierra డిజైన్
కొత్త టాటా Sierra ని ఈసారి పూర్తిగా లైఫ్‌స్టైల్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ SUV గా తయారు చేశారు. పాత 3 డోర్ డిజైన్‌కు బదులుగా, టాటా మోటార్స్ ఇప్పుడు మరింత కొత్తగా 5-డోర్ లేఅవుట్‌ను అందించింది. అదే సమయంలో Tata SUV గుర్తింపుగా పరిగణించే ‘Alpine Window’ డిజైన్‌ను కూడా మోడ్రన్ టచ్ లో కొనసాగించింది. ఇది పాత Sierra ఔట్ లుక్ స్పష్టంగా చూపుతుంది. కొత్త SUV లో బాక్సీ, మస్క్యులర్ లుక్, కొత్త పిల్లర్ డిజైన్, గ్లాస్-బ్లాక్ ఫినిష్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్‌లు-టెయిల్‌ల్యాంప్‌లు, హై బోనెట్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి. ఇవి దాని డిజైన్‌ను మరింత పవర్‌ఫుల్ చేస్తాయి.
చాలా అడ్వాన్స్‌డ్‌గా ఫీచర్లు
కొత్త Tata Sierra ఫీచర్ల పరంగా చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఇందులో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS, ఫుల్ LED లైటింగ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, OTA అప్‌డేట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. Tata ఏ కారులోనైనా మొదటిసారిగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను అందిస్తోంది. దీని ఇంటీరియర్‌లో రెండు 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్లు, 10.2 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. ఈ పూర్తి స్క్రీన్ సెటప్ Sierra ని దాని విభాగంలో అత్యంత హైటెక్ SUVలలో ఒకటిగా చేస్తుంది.
ఇంజిన్, ఎలక్ట్రిక్ వేరియంట్
కొత్త Sierra లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు 2 ఉండవచ్చు. పెట్రోల్‌లో 1.5 లీటర్ సహజంగా ఆస్పిరేటెడ్, టర్బోఛార్జ్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా డీజిల్‌లో Harrier లోని 2.0 లీటర్ ఇంజిన్ లేదా టాటా Curvv లోని 1.5 లీటర్ ఇంజిన్ ఇవ్వవచ్చు. అత్యధికంగా చర్చ జరుగుతున్న టాపిక్ ఏంటంటే, దాని ఎలక్ట్రిక్ వేరియంట్. Sierra EV దాదాపు 65 kWh బ్యాటరీ ప్యాక్, దాదాపు 600 కిమీ రేంజ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త Tata Sierra ధర
నివేదికల ప్రకారం కొత్త Tata Sierra ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర దాదాపు 11 లక్షలు కావచ్చు. అయితే ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలను బట్టి దాని టాప్ మోడల్ ధర దీని కంటే చాలా ఎక్కువగా ఉండనుంది. మోడ్రన్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ చర్చను చూస్తే, ఈ SUV భారత మార్కెట్‌లో బిగ్ కం బ్యాక్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.






















