అన్వేషించండి

Tata Punch GST ఆఫర్‌ - ఈ దీపావళికి యూత్‌ కోసం స్పెషల్ డీల్

Tata Punch GST Cut: GST కోత తర్వాత, బెస్ట్ సెల్లింగ్ Tata Punch కొనడం ఇప్పుడు ఇంకా సులభం అయింది. ఈ దీపావళికి మీరు ఈ కారును ఎంత చవకగా సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం.

Tata Punch GST 2025 Price Drop: ఈ దీపావళికి, "చీప్‌ & బెస్ట్‌"లో ఒక మంచి కారు కొనాలని ఆలోచిస్తుంటే, టాటా పంచ్ గురించి మీరు ఒకసారి ఆలోచించవచ్చు. వాస్తవానికి, టాటా పంచ్‌ కొనడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్ర & తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఈ కాంపాక్ట్ SUV, టాటా పంచ్ ఇప్పుడు ఇంకా చవకగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో, గతంలో దీని ఎక్స్-షోరూమ్ ధర ₹5,99,990. కానీ ఇప్పుడు, GST 2.0 అమలుతో, కంపెనీ ఆ ధరను ₹5,49,990 కి తగ్గించింది. దీని అర్థం, ఈ కారు కొనే కస్టమర్లకు ఇప్పుడు ఒకేసారి ₹50,000 మిగులుతుంది, దీపావళి మరింత వెలుగులు విరజిమ్ముతుంది.

ఫీచర్లు & ఇంటీరియర్ ఎలా ఉన్నాయి? 
కొత్త టాటా పంచ్ 2025 లోపలి భాగాన్ని ఇంకా ప్రీమియంగా తీర్చిదిద్దారు. లెదర్‌తో చుట్టిన టు-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇచ్చారు. ప్రకాశవంతమైన టాటా లోగో అమర్చారు. పెద్ద 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది.

టాటా పంచ్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు & క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్ & కీలెస్ ఎంట్రీ వంటివి ఈ కారు డ్రైవింగ్‌ సౌలభ్యాన్ని పెంచుతాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లలో టచ్-అండ్-టోగుల్ ఆడియో కంట్రోల్స్‌ & కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ కూడా ఉంటాయి.

టాటా పంచ్ ఎంత సురక్షితం? 
టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందింది, తద్వారా ఇది తన విభాగంలో అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా నిలిచింది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌, రియర్ పార్కింగ్ సెన్సార్లు & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. 

టాటా పంచ్ ఇంజిన్ & మైలేజ్
కొత్త టాటా పంచ్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 87 bhp & 115 Nm టార్క్ ఇస్తుంది. దీని CNG వేరియంట్ 72 bhp & 103 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.09 kmpl మైలేజీని అందిస్తుంది, CNG వేరియంట్ 26.99 km/kg ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది.

ప్రత్యర్థి కార్లు ఎంత చౌకగా మారాయి? 
టాటా పంచ్‌కు సమీప ప్రత్యర్థి కార్లు - Hyundai Exter & Maruti Suzuki Ignis. ఇంకా, ఈ SUV Tata Altroz, Tata Tiago & Renault Kiger తో కూడా పోటీ పడుతుంది. ఇటీవలి GST తగ్గింపు తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ₹31,000 నుంచి ₹86,000 వరకు తగ్గింది. మారుతి ఇగ్నిస్ ధర ₹50,000 నుంచి ₹70,000 వరకు దిగి వచ్చింది. అంటే.. ప్రస్తుతం కస్టమర్‌లు ఎంచుకోవడానికి బోలెడన్ని వాహనాలు అందుబాటు ధరలో & ఫుల్‌ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget