అన్వేషించండి

Tata Punch Price Drop: GST తగ్గింపు తర్వాత టాటా పంచ్ చాలా చౌక గురూ!, దీని పోటీ కార్లు ఏవో తెలుసా?

GST 2.0 అమలు తర్వాత, Tata Punch ఇప్పుడు రూ. 5.50 లక్షలకు అందుబాటులో ఉంది. దాని ఫీచర్లు, ఇంటీరియర్, భద్రత & ఇంజిన్ వివరాలను తెలుసుకుందాం.

Tata Punch New Price GST 2,0 Cut: తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV టాటా పంచ్, ఇప్పుడు మరింత తక్కువ ధరలోకి మారింది. గతంలో, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5,99,990. ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త GST 2.0 అమలుతో, కంపెనీ ఈ ధరను రూ. 5,49,990 కి తగ్గించింది. అంటే, ఈ కారును ఇప్పుడు కొనే కస్టమర్లు ప్పుడు నేరుగా రూ. 50,000 ఆదా చేయగలుగుతారు. బడ్జెట్‌ రేటులో ప్రీమియం & 5-స్టార్‌ సేఫ్టీ SUVని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మార్పు ఒక గొప్ప శుభవార్త.

ప్రీమియం & మోడ్రన్‌ ఇంటీరియర్స్
కొత్త టాటా పంచ్ 2025 లోపలి భాగాన్ని మరింత ప్రీమియంగా తీర్చిదిద్దారు. లెదర్‌తో చుట్టిన 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ప్రకాశవంతమైన టాటా లోగో ఇచ్చారు. పెద్ద 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్‌ ఇస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది, ఇది అవసరమైన అన్ని సమాచారాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. అదనంగా, క్యాబిన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ & ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి లక్షణాలు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లలో సన్‌రూఫ్ & వెంటిలేటెడ్ సీట్లు కూడా వస్తాయి, ఇది దాని విభాగంలో మరింత ప్రత్యేకంగా ఉంటుంది.

ఫీచర్లు
టాటా పంచ్‌ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు & క్రూయిజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో నిండిపోయింది. అదనంగా.. రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్ & కీలెస్ ఎంట్రీ దీన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాయి. టాప్ వేరియంట్లలో టచ్-అండ్-టోగుల్ ఆడియో కంట్రోల్స్‌ & కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీతో కస్టమర్‌లు రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ & రిమోట్ కంట్రోల్ ఫీచర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.

5-స్టార్ రేటింగ్ భద్రత
టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం మరో హైలైట్‌. దీంతో, అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా ఈ కారు నిలిచింది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌, వెనుక పార్కింగ్ సెన్సార్లు & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. దీని దృఢమైన నిర్మాణం & అధిక-బలం కలిగిన స్టీల్.. క్రాష్ ప్రొటెక్షన్‌ను మరింత మెరుగుపరుస్తాయి. భద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టే కస్టమర్‌లకు ఇది టాప్‌ ఆప్షన్‌ అవుతుంది.

ఇంజిన్ & మైలేజ్
కొత్త టాటా పంచ్ 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ 87 bhp & 115 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. దీని CNG వేరియంట్ 72 bhp & 103 Nm టార్క్ ఇస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.09 kmpl మైలేజీని అందిస్తుందని, CNG వేరియంట్ 26.99 km/kg ఆకట్టుకునే మైలేజీని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.

ప్రత్యర్థి కార్లు కూడా చవక
టాటా పంచ్ పోటీ కార్లు - Hyundai Exter & Maruti Suzuki Ignis. Tata Altroz, Tata Tiago & Renault Kiger తోనూ ఇది పోటీ పడుతుంది. ఇటీవలి GST తగ్గింపు తర్వాత, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ₹31,000 నుంచి ₹86,000 వరకు తగ్గింది. మారుతి ఇగ్నిస్ ధర ₹50,000 నుంచి ₹70,000 వరకు దిగి వచ్చింది. అంటే, ప్రస్తుతం కస్టమర్‌లకు తక్కువ ధరల్లోనే చాలా ఫీచర్-లోడెడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget