అన్వేషించండి

Renault Kwid 10వ వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్‌ - స్పెషల్‌ ఫీచర్లతో 500 కార్లు మాత్రమే, ధర ఎంతంటే?

Renault India, 10వ వార్షికోత్సవం సందర్భంగా, తన పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ ఎడిషన్‌లో కేవలం 500 యూనిట్లు మాత్రమే అమ్ముతారు.

Renault Kwid 10th Anniversary Edition Price Features: రెనాల్ట్ ఇండియా, తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు, తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ యొక్క 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్‌, దేశవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మాత్రమే అమ్ముతారు. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను టెక్నో వేరియంట్ ఆధారంగా డిజైన్‌ చేశారు. ధరలు సుమారు రూ. 5.25 లక్షలు (MT) & రూ. 5.50 లక్షలు (AMT) (ఎక్స్-షోరూమ్‌)గా నిర్ణయించారు. 

కొత్త రంగులు & డిజైన్లు
క్విడ్ 10th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది, అవి - బ్లాక్ రూఫ్ తో ఫైరీ రెడ్ (Fiery Red with Black Roof) & బ్లాక్ రూఫ్ తో షాడో గ్రే (Shadow Grey with Black Roof). ఇంకా, ఇందులో బ్లాక్ ఫ్లెక్స్ వీల్స్, డోర్లు & సి-పిల్లర్ పై యానివర్సరీ డెకాల్స్, ఎల్లో కలర్‌ గ్రిల్ ఇన్సర్ట్స్‌ ఉన్నాయి, ఇవి ఈ కారుకు మరింత స్టైలిష్ లుక్ ఇస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, GST 2.0 అమలు తర్వాత, క్విడ్ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత చవకైన డ్యూయల్-టోన్ కారుగా మారింది.

క్యాబిన్‌లో ప్రత్యేక హంగులు
ఇంటీరియర్‌లో 10వ వార్షికోత్సవ థీమ్‌తో సీట్లు, పసుపు రంగు యాక్సెంట్స్‌ & ప్రీమియం డీటెయిలింగ్ కూడా ఉన్నాయి. లెదర్ స్టీరింగ్ వీల్ (మస్టర్డ్ స్టిచింగ్‌తో), ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సరౌండ్, డోర్ ట్రిమ్‌లపై పసుపు రంగు టచ్‌లు, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు & పడిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ అప్‌డేట్స్‌ అన్నీ ఈ వెర్షన్‌కు మరింత ప్రీమియం & యూత్‌ఫుల్‌ అప్పీల్‌ ఆపాదిస్తాయి.

క్విడ్, భారతదేశంలో మా కంపెనీ కొత్త ఆరంభానికి నిదర్శనం. ఆవిష్కరణ, అందుబాటు ధర & 95% కంటే ఎక్కువ స్థానిక విడిభాగాలతో ఎంట్రీ-లెవల్ విభాగాన్ని మార్చేసింది. 10వ వార్షికోత్సవ ఎడిషన్ కేవలం కారు మాత్రమే కాదు, గత 10 సంవత్సరాలుగా మా కంపెనీ నమ్మకం & నిబద్ధతకు ఒక వేడుక - రెనాల్ట్ ఇండియా MD వెంకట్రామ్ మామిళ్లపల్లె 

భద్రతలో పెద్ద అప్‌డేట్
ప్రస్తుత క్విడ్ వెర్షన్లలో భద్రతను మెరుగుపరచడానికి కూడా రెనాల్ట్ ఈ వార్షికోత్సవ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఇప్పుడు, అన్ని వేరియంట్లలోని అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్టులు అందించింది. క్లైంబర్ వేరియంట్‌ను ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లతో మరింత మెరుగుపరిచింది.

వేరియంట్లు & కొత్త ధర
కంపెనీ క్విడ్ వేరియంట్ పేర్లను కూడా అప్‌డేట్‌ చేసింది. ఇది ఇప్పుడు మూడు వేరియంట్లలో వస్తుంది: ఎవల్యూషన్ (గతంలో RXL), టెక్నో (గతంలో RXT), & క్లైంబర్. కొత్త క్విడ్ ధర సుమారు రూ. 4.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని AMT వేరియంట్ భారతదేశంలో అత్యంత తక్కువ ధర ఆటోమేటిక్ కార్లలో ఒకటిగా ఉంది, ఇది దాదాపు రూ. 5 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
Hyderabad Global City : గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
Fact Check: కేంద్రం 'ఉచితంగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇస్తోందా? విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్న డిజిటల్ దుర్వినియోగం
కేంద్రం 'ఉచితంగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇస్తోందా? విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్న డిజిటల్ దుర్వినియోగం
Rajamouli Hanumuthu Issue: ఆంజనేయునిపై రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయం - క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేయాలని బీజేపీ సలహా
ఆంజనేయునిపై రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయం - క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేయాలని బీజేపీ సలహా
Advertisement

వీడియోలు

Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌
IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
Hyderabad Global City : గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
Fact Check: కేంద్రం 'ఉచితంగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇస్తోందా? విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్న డిజిటల్ దుర్వినియోగం
కేంద్రం 'ఉచితంగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇస్తోందా? విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్న డిజిటల్ దుర్వినియోగం
Rajamouli Hanumuthu Issue: ఆంజనేయునిపై రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయం - క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేయాలని బీజేపీ సలహా
ఆంజనేయునిపై రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయం - క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేయాలని బీజేపీ సలహా
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Early Warning Signs of Heart Failure : గుండె వైఫల్యానికి ముందు కనిపించే 5 సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
గుండె వైఫల్యానికి ముందు కనిపించే 5 సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
JoshuaBell: రోడ్డుపై 29 కోట్ల వయోలిన్, అయినా ఎవరూ పట్టించుకోలేదు? ప్రతిభకు వేదిక ఎంతవరకూ అవసరం?
రోడ్డుపై 29 కోట్ల వయోలిన్, అయినా ఎవరూ పట్టించుకోలేదు? ప్రతిభకు వేదిక ఎంతవరకూ అవసరం?
Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల కలిగే నష్టాలివే.. మూడ్ స్వింగ్స్ నుంచి నిద్ర రాకపోవడం వరకు
మెగ్నీషియం లోపం వల్ల కలిగే నష్టాలివే.. మూడ్ స్వింగ్స్ నుంచి నిద్ర రాకపోవడం వరకు
Embed widget