Tata Punch Facelift ఫీచర్లు లీక్! - ఈ పండుగ సీజన్‌లోనే లాంచ్, డబ్బు రెడీగా పెట్టుకోండి!
Tata Punch Facelift 2025 Features: పరీక్ష సమయంలో కనిపించిన ఫొటోలను బట్టి, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దాని ఎలక్ట్రిక్ వెర్షన్ నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందిందని అర్ధమవుతోంది.

Tata Punch Facelift Design Launch Date And Price: పాపులర్ కార్ల కంపెనీ టాటా మోటార్స్, మరోసారి SUV విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, ఈ కంపెనీ హిట్ వెహికల్ & మైక్రో SUV 'టాటా పంచ్'తో సంచలనం సృష్టించబోతోంది. నివేదికల ప్రకారం, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో (October 2025), అంటే ప్రస్తుత పండుగ సీజన్‌లోనే లాంచ్ చేయవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రిఫ్రెష్డ్ లుక్ & డిజైన్‌తో రావడమే కాకుండా, దాని ఫీచర్లు & టెక్నాలజీలోనూ గణనీయమైన అప్‌డేట్స్ ఉండవచ్చు, ఫలితంగా ఇది ప్రస్తుత మోడల్ కంటే మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌ను దాని ఎలక్ట్రిక్ వెర్షన్ నుంచి ఎక్కువ స్ఫూర్తితో రూపొందించినట్లు, టెస్టింగ్ టైమ్‌లో కనిపించిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. స్లిమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త గ్రిల్ & ఫ్రెష్ ఫ్రంట్ బంపర్ డిజైన్ వంటి మార్పులకు అవకాశం ఉంది. అదనంగా, EV మోడల్‌లో ఇప్పటికే చూసిన మాదిరిగానే C ఆకారపు DRLs కలిగి ఉండవచ్చు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ & రీడిజైన్ చేసిన చేసిన రియర్ బంపర్ ఉండవచ్చు. ఇలా, అన్ని రకాల అప్‌డేట్స్‌తో ఈ SUV బోల్డ్ లుక్స్‌తో, మరింత మోడ్రన్‌గా & యూత్‌కు అనుకూలంగా లాంచ్ కావచ్చు, ఇది యువ కస్టమర్లను ఆకర్షించగలదు.
లోపలి భాగం ఎలా ఉంటుంది?
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ (Tata Punch Facelift Interior) పార్ట్‌ను మరింత ప్రీమియంగా & ఆధునిక సాంకేతికతో రూపొందించారు. కారులో 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉంటుంది, ఇది మెరుగైన దృశ్య & స్పర్శ అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా, ఈ SUV ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది, ఇది డ్రైవర్‌కు అన్ని సమాచారాలను ఒకే చోట అందిస్తుంది.
ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు
ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ధర రూ. 6.20 లక్షల నుంచి రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్ & ఫీచర్ అప్‌డేట్ల కారణంగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రేటు (Tata Punch Facelift Price) స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, పంచ్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి: Pure, Pure (O), Adventure S, Adventure+ S & Creative+. పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా ఇవే వేరియంట్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.



















