అన్వేషించండి

భారతదేశంలో తొలి స్మార్ట్‌ వాచ్ కనెక్టెడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ - TVS iQube కొత్త ఫీచర్లు మీకోసం!

TVS iQube ఇప్పుడు EV స్మార్ట్‌వాచ్‌ కనెక్టెడ్‌ ఫీచర్‌ను అందిస్తోంది. కేవలం ₹2,999 ధరకే లభించే ఈ Noise స్మార్ట్‌వాచ్‌ రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఎలా పని చేస్తుందో పరిశీలిద్దాం.

TVS iQube Smartwatch Connected Features: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సాంకేతికత వేగంగా మారుతోంది, కొత్త మలుపులు తిరుగుతోంది. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్, ఇప్పుడు, ప్రత్యేక నాయిస్‌ స్మార్ట్‌వాచ్‌ (Noise Smartwatch) తో అనుసంధానం అవుతుంది. ఇది మీ మణికట్టుపైనే స్కూటర్‌కు సంబంధించిన ప్రతి ఒక్క వివరాన్ని ప్రదర్శిస్తుంది. మన దేశంలో, EV & స్మార్ట్‌వాచ్ కలయికలో (EV-Smartwatch Integration) ఇలాంటి ఆవిష్కరణ ఇదే మొదటిసారి. దీనివల్ల, రైడర్లు రియల్-టైమ్ అప్‌డేట్స్‌ & అలెర్ట్స్‌ అందుకుంటారు.

EV-స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి?
TVS & Noise మధ్య ఈ భాగస్వామ్యంలో భాగంగా, iQube కస్టమర్లు కేవలం ₹2,999 ధరకే ప్రత్యేక స్మార్ట్‌వాచ్‌ను అందుకోవచ్చు & 12 నెలల ఉచిత నాయిస్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఇది వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ నేరుగా iQubeకి కనెక్ట్ అవుతుంది & స్కూటర్ స్థితి, బ్యాటరీ సమాచారం, టైర్ ప్రెజర్, భద్రత హెచ్చరికలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని రైడర్లకు తక్షణమే అందిస్తుంది.

ప్రతి సమాచారం మీ మణికట్టుపై!
స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ యూజర్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేరుగా తమ మణికట్టు (స్మార్ట్‌వాచ్) నుంచి నియంత్రించవచ్చు & పర్యవేక్షించవచ్చు. వాహనం లాక్ అయిందా, అన్‌లాక్ అయిందా, ఛార్జింగ్ ఉందా & లేదా, లేదా రైడింగ్‌లో ఉందా అనే వివరాలను ఈ స్మార్ట్‌వాచ్ అందిస్తుంది. ఛార్జ్ స్టేటస్‌ (SoC), బ్యాటరీ పర్సెంటేజీ & విజువల్‌ ప్రోగ్రెస్‌ బార్‌ సహా బ్యాటరీ స్టేటస్‌ను కూడా ఈ వాచ్‌లో చూడవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్‌ 20% కంటే తక్కువకు పడిపోయినప్పుడు 'లో బ్యాటరీ' అలెర్ట్‌ కూడా స్మార్ట్‌ వాచ్‌లో కనిపిస్తుంది. వివిధ రైడ్ మోడ్స్‌లో మిగిలిన దూరాన్ని & టైర్ ప్రెజర్ ఆధారంగా అంచనా వేసిన రైడింగ్‌ రేంజ్‌ను కూడా ఈ వ్యవస్థ అందిస్తుంది. TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రెండు టైర్లకు ప్రత్యక్ష టైర్ ప్రెజర్ & సిఫార్సు చేసిన స్థాయులను వాచ్‌లోనే ప్రదర్శిస్తుంది.

దొంగతనం హెచ్చరికలు 
దొంగతనం జరిగినప్పుడు లేదా బండిని ఎవరైనా జరపడానికి ప్రయత్నించినప్పుడు హెచ్చరికలు, జియోఫెన్స్ నోటిఫికేషన్‌లు & ప్రమాదం జరిగినప్పుడు లేదా స్కూటర్ పడిపోయినప్పుడు యాప్ నోటిఫికేషన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఛార్జింగ్ ప్రారంభం, పురోగతి & పూర్తి సమాచారం కూడా స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవస్థ సురక్షితమైన API & యూజర్‌ పర్మిషన్లపై ఆధారపడి ఉంటుందని, పూర్తి గోప్యతను నిర్ధారిస్తుందని TVS చెబుతోంది.

TVS iQube రేంజ్‌ & ధర
TVS iQube 212 కి.మీ. వరకు IDC పరిధిని కలిగి ఉంది. 4 గంటల 18 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఆరు వేరియంట్లలో & 12 రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ధర ₹1,09,250 & ₹1,62,314 మధ్య ఉంటుంది.

TVS iQube - Smartwatch ఇంటిగ్రేషన్ భారతీయ EV పరిశ్రమలో ఒక ప్రధాన ఆవిష్కరణ. ఇది ఇ-స్కూటర్‌ను మాత్రమే కాకుండా, స్మార్ట్ టెక్నాలజీ అనుభవాన్ని కూడా అందిస్తుంది. బ్యాటరీ అప్‌డేట్స్‌, టైర్ ప్రెజర్, భద్రత & ఛార్జింగ్ సమాచారం ఇప్పుడు మీ మణికట్టుపైనే ఉంటుంది. ఇది, భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ట్రెండ్‌ సెట్ చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget